రివ్యూ : డిస్కో రాజా – సైంట్ ఫిక్ రివెంజ్ డ్రామా..

స్టార్ కాస్ట్ : రవితేజ, నభ నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్య హోప్, బాబీ సింహా తదితరులు..
దర్శకత్వం : వి ఐ ఆనంద్
నిర్మాతలు: రామ్ తాళ్లూరి
మ్యూజిక్ : థమన్
విడుదల తేది : జనవరి 24, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : డిస్కో రాజా – సైంట్ ఫిక్ రివెంజ్ డ్రామా..

ఒకప్పుడు మాస్ రాజా రవితేజ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే నమ్మకం ఉండేది..ప్రొడ్యూసర్స్ సైతం రవితేజ తో సినిమా చేస్తే తప్పనిసయిగా లాభాలు అందుకోవచ్చు అని అనుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం రవితేజ సినిమా అంటే మినిమమ్ కాదు కదా రిలీజ్ కు ముందే నెగిటివ్ గా మాట్లాడుకుంటున్నారు. అంతలా రవితేజ సినిమాలు ప్రేక్షకులను విసుగు తెప్పించాయి. రవితేజ నుండి అసలైన హిట్ చూసి అభిమానులు ఎంత కాలం అయ్యింది. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ..ఏ ఒక్కటి కూడా అలరించలేకపోతున్నాయి.

ఈ నేపథ్యంలో టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం ఇలా వరుసగా విభిన్న సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు విఐ ఆనంద్ డైరెక్షన్లో డిస్కో రాజా అనే చిత్రాన్ని చేసారు. ఈ మూవీ లో రవితేజ కు జోడిగా ఇస్మార్ట్ శంక‌ర్ ’ ఫేమ్‌ నభా నటేశ్‌, ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ నటించగా..ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇటీవల రిలీజ్ అయినా ప్రోమోస్ , సాంగ్స్ , మేకింగ్ ఇలా అన్ని సినిమా ఫై అంచనాలు పెంచేసాయి. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది..? ఈచిత్ర కథ ఏంటి..? వి ఐ ఆనంద్ రవితేజ ను ఎలా చూపించాడు..? ఈ సినిమా తో రవితేజ ఫామ్ లోకి వచ్చినట్లేనా..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

వాసు (రవితేజ) ఫై ఎటాక్ జరగడం తో బ్రెయిన్ డెడ్ అవుతుంది…ఆ తర్వాత పరిణీతి (తాన్య హోప్) వాసు కు ప్రయోగం చేసి మళ్లీ అతడిని మాములు మనిషి ని చేస్తుంది. కానీ వాసు తన గతాన్ని మరచిపోతాడు. ఎలాగైనా తన గతాన్ని తెలుసుకోవాలని చెన్నై బయలుదేరతాడు.

అక్కడ వాసు ను చూసి కొంతమంది డిస్కో రాజా అని కొందరు ఎటాక్ చేస్తుంటారు. అసలు డిస్కో రాజా ఎవరు..? అతడికి , వాసు కు సంబంధం ఏంటి..? డిస్కో రాజా ను ఎందుకు చంపాలని అనుకుంటారు..? సేతు (బాబీ సింహా) డిస్కో రాజ్ (రవితేజ)కు సంబంధం ఏంటి..? అనేది అసలు కథ.

ప్లస్ :

* రవితేజ

* థమన్ బ్యాక్ గ్రౌండ్

* సినిమాటోగ్రఫీ

మైనస్ :

* సెకండ్ హాఫ్

* ఎమోషల్ సన్నివేశాలు

* బోరింగ్ సన్నివేశాలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* రవితేజ ఎనర్జ్ గురించి చెప్పాల్సిన పనిలేదు..ఈ సినిమాలో కూడా అదే ఎనర్జ్ తో కుమ్మేసారు. సినిమా మొత్తం కూడా తన భుజాల ఫై మోశాడు. ముఖ్యంగా డిస్కో రాజా పాత్ర లో తనకలవాటైన మ్యానరిజమ్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసాడు. మూడు భిన్నమైన షేడ్స్ ను రవితేజ చాలా సులువుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు.

* సినిమాలో ముగ్గురు హీరోయిన్లు పాయల్ రాజ్ పుత్, నభ నటేష్, తాన్య హోప్ లు ఉన్నప్పటికీ కథలో వారి పాత్రలు తేలిపోయాయి. ఈ ముగ్గురికి చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఉన్నంతలో పాయల్ పాత్రకు కొంత ప్రాధాన్యత దక్కింది. హెలెన్ పాత్రలో ఆమె నటన బాగుంది.

* విలన్ గా నటించిన బాబీ సింహా అదరగొట్టాడు. తనని ఎందుకందరూ గొప్ప నటుడంటారో మరోసారి ఈ సినిమా ద్వారా నిరూపించాడు.

* సునీల్ కు ఒక విభిన్నమైన పాత్ర లభించింది. అతని పాత్ర మిశ్రానుభూతులు మిగుల్చుతుంది.

* సత్య, వెన్నెల కిషోర్ ఉన్న కాసేపూ నవ్వించడానికి ప్రయత్నించారు కానీ అంత వర్కౌట్ అవ్వలేదు.

* మిగిలిన వాళ్లంతా వారి వారి పరిధిలో నటించారు.

సాంకేతిక విభాగం :

* ఈ మధ్య థమన్ జోరు ఏ రేంజ్ లో ఉందొ చెప్పాల్సిన పని లేదు. వరుస విజయాలతో సూపర్‌ ఫాంలో ఉన్న తమన్‌ ఈ సినిమాకు కూడా సూపర్‌ హిట్ ఆల్బమ్‌ ఇచ్చాడు. నువ్వు నాతో ఏం అన్నావో, ఢిల్లీ వాలా పాటలు టాప్‌లో ట్రెండ్ అవుతున్నాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో తమన్‌ ఆకట్టుకున్నాడు.

* కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. ఐస్ ల్యాండ్ లో సన్నివేశాలు బాగా చిత్రీకరించారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కూడా ఫ్రేమ్స్ ఆకట్టుకున్నాయి.

* శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ పర్వాలేదు..సెకండ్ హాఫ్ లో ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండేది

* రామ్ తాళ్లూరి నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రతి రూపాయి కూడా తెర ఫై కనిపిస్తుంది.

* ఇక డైరెక్టర్ వి ఐ ఆనంద్ విషయానికి వస్తే..మొదటి నుండి కూడా విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులకు కొత్తదనం అందించిన ఆనంద్..ఈ సినిమా కూడా అదే విధంగా తెరకెక్కించారు. రవితేజ ఎనర్జ్ ని బాగా వాడుకున్నాడు. సినిమా మొదలుపెట్టిన విధానం..ల్యాబ్ లో చేసిన ప్రయోగం, ఆపై ఇంటర్వెల్ కు ముందు డిస్కో రాజ్ పాత్ర పరిచయం..ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్ లో అదరగొట్టింది. సెకండ్ హాఫ్ మొదలైన తీరు కూడా బాగానే ఉన్నప్పటికీ మధ్య లో కాస్త తగ్గింది.. క్లైమాక్స్ కు వచ్చే సరికి కాస్త స్పీడ్ అందుకుంది.

చివరగా : గత కొంతకాలం గా ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న రవితేజ కు ఈ సినిమా బూస్ట్ ను ఇచ్చినట్లే..

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review