రివ్యూ : ఈ నగరానికి ఏమైంది ‘ తరుణ్ భాస్కర్ మాయ’

స్టార్ కాస్ట్ : విష్వ‌క్సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభిన‌వ్ గొమ‌టం, వెంక‌టేశ్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్‌, సిమ్ర‌న్ చౌద‌రి తదితరులు..
దర్శకత్వం : తరుణ్ భాస్కర్
నిర్మాతలు: సురేష్ బాబు
మ్యూజిక్ : వివేక్ సాగర్
విడుదల తేది : జూన్ 29, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : ఈ నగరానికి ఏమైంది ‘ తరుణ్ భాస్కర్ మాయ’

2016 లో ఎలాంటి అంచనాలు లేకుండా అంత కొత్తవారితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పెళ్లి చూపులు’. ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా పరిచయమైయ్యాడు. కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది. అప్పటివరకు వస్తున్న మూస కథలకు ఈ చిత్రం ఓ గుణపాఠంలా చేసింది. ఈ సినిమాతో తరుణ్ భాస్కర్ స్టార్ డైరెక్టర్ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. చిత్ర నిర్మాతలకు సైతం ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది.

రెండేళ్ల గ్యాప్ తర్వాత తరుణ్ ఈ నగరానికి ఏమైంది..? అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంత కొత్తవారితో తెరకెక్కించిన ఈ మూవీ ని , ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ బాబు నిర్మించడం జరిగింది. మరి తరుణ్ భాస్కర్ ఈ నగరం తో ఎలాంటి హిట్ అందుకున్నాడు..? ఈ సినిమా తో ఇండస్ట్రీ కి పరిచమైన కొత్త నటి నటులు ఎలా నటించారు..? అసలు కథ ఏంటి..అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

వివేక్‌(విశ్వక్సేన్‌ నాయుడు), కార్తీక్‌(సుశాంత్‌రెడ్డి), కౌశిక్‌(అభినవ్‌గో మతం), ఉపేంద్ర(వెంకటేశ్‌ కాకుమాను) మంచి స్నేహితులు. కార్తీక్ ఎలైట్ పబ్ లో వర్క్ చేసే ఓ మ్యానేజర్. వైన్ టెస్ట్ చేయడంలో సిద్ధహస్తుడు కానీ.. ఫ్రెండ్స్ ను సెలక్ట్ చేసుకోవడంలో మాత్రం పూర్. వివేక్ మన కార్తీక్ బెస్ట్ ఫ్రెండ్, మంచి సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కానీ మందుకు బానిస, కానీ ఆ విషయాన్ని ఒప్పుకోడు. ఉపేంద్ర ఓ వెడ్డింగ్ ఫిలిమ్ ఎడిటర్, బార్ కి వచ్చి మిల్క్ షేక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఆర్డర్ చేసే టైపు. ఇక మిగిలింది కౌషిక్ వెర్షన్ 2.0 టైపు..వీరంతా కలిసి ఓ షార్ట్ ఫిలిం తీసి దానిని ప్రపంచానికి చాటి చెప్పాలని , ఈ షార్ట్ మూవీ తో తమ టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలని అనుకుంటారు.

ఓ రోజు కార్తీక్ తన ముగ్గురి స్నేహితులకు పార్టీ ఇస్తాడు. ఆలా పార్టీ లో ఫుల్ తాగేసి వారికీ తెలియకుండానే గోవా కు వెళ్లిపోతారు. ఇక గోవాకు వెళ్లిన ఆ నలుగురు ఎలాంటి కష్టాలు పడ్డారు..? వారు తీయాలన్న షార్ట్ ఫిలిం తీసారా లేదా..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.

ప్లస్ :

* నటీనటుల యాక్టింగ్

* కామెడీ

* మ్యూజిక్

* డైలాగ్స్

మైనస్ :

* కథ

* సాగదీత సన్నివేశాలు

* సెకండ్ హాఫ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* నలుగురు కొత్తవారినప్పటికీ తెరపై మాత్రం ఎన్నో సినిమాలు చేసిన అనుభవం ఉన్నవారిలా జీవించారు. తరుణ్ భాస్కర్ మరోసారి కొత్తవారిని ఎంచుకొని సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా కౌశిక్‌ నటన ఆకట్టుకుంటుంది. చాలా సన్నివేశాల్లో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచేంతాడు. వివేక్‌ మద్యం సేవిస్తున్నప్పుడు ఎదురుగా కూర్చొని హావభావాలు పలికించిన తీరు థియేటర్స్ లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.
మిగతా ముగ్గురు కూడా చాల బాగా నటించి మంచి మార్కులు కొట్టేసారు.

* ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే.. అనీషా ఆంబ్రోస్‌, సిమ్ర‌న్ చౌద‌రి తెర ఫై అందంగా కనిపించడమే కాదు నటన పరంగా కూడా ఆకట్టుకున్నారు.

* మిగతా నటి నటులంతా వారి వారి పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

* తరుణ్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్..ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వడమే కాదు కథ తగిన విధంగా నేపధ్య సంగీతం ఇచ్చి సినిమాకు హైలైట్ గా నిలిచారు.

* నికేత్ బొమ్మి సినిమా ఫొటోగ్రఫీ చాల బాగుంది..సినిమా అంత కూడా కలర్ ఫుల్ గా ఉండేలా చూపించాడు.

* ర‌వితేజ గిరిజాల‌ ఎడిటింగ్ విషయం లో కాస్త ఇబ్బంది పెట్టింది. సెకండ్ హాఫ్ లో చాల సన్నీ వేషాలు అనవసరం అనిపిస్తాయి. వాటి వల్ల సినిమా బోర్ కొట్టిస్తుంది.

* సురేశ్ బాబు నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే..కథలో పెద్దగా తన పనితనం చూపించకపోయిన రచన పరంగా క్యారెక్టర్లను చూపించే విధానం అందర్నీ ఆకట్టుకున్నాయి. షార్ట్ ఫిలిం క‌ల‌ల‌ను సాకారం చేసుకునే ప‌నిలో ప‌డ్డ న‌లుగురు కుర్రాళ్లు, వాళ్ల‌ల్లో ఒక‌రికి రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే ఫ్యామిలీ ప్రాబ్ల‌మ్‌, ఒక‌రికి ల‌వ్ ప్రాబ్ల‌మ్‌.. ఇంకో ఇద్ద‌రు మామూలుగా ఉంటారు.

ఏదో చేద్దామ‌ని, డ‌బ్బు కోసం.. డాబు కోసం ఇంకేదో చేయాల‌నుకున్న ఒక ఫ్రెండ్ మ‌న‌సులో ఉన్న విష‌యాన్ని గ్ర‌హించిన మ‌రో ఫ్రెండ్‌.. అత‌ని క‌ల సాకారం అయ్యే ద‌శ‌గా అడుగులు వేయించిన తీరు, యువ‌త స‌ర‌దాగా మందు కొట్టిన‌ప్పుడు వారు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారో చూపించిన స‌న్నివేశాలు, క‌ష్టాల‌న్నిటినీ ప‌క్క‌న‌పెట్టి క‌డుపుబ్బ న‌వ్వించే కామెడీ స‌న్నివేశాలు ఇలా అన్ని కూడా సమపాలనలో ఉండేలా చూసుకొని తరుణ్ మరోసారి విజయం దక్కించుకున్నాడు.

కాకపోతే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించడం తో ప్రేక్షకులు కాస్త ఇబ్బంది పడతారు. ఇక సినిమా అంత బాగానే ఉంటుంది. క్లైమాక్స్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌న్నివేశాన్ని లింక్ చేసిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.

చివరిగా :

‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం లో పెద్దగా కథ లేనప్పటికీ , నలుగురు స్నేహితుల మధ్య సాగే ప్రయాణం మాత్రమే. దాన్ని యువతకు ముఖ్యంగా స్నేహితులకు నచ్చేలా ఈ సినిమా తెరకెక్కింది. వివేక్‌ ప్రవర్తన, కార్తీక్‌ సిన్సియారిటీ, కౌశిక నవ్వులు, ఉపేంద్ర అమాయకత్వం ఇలా ఒక్కో పాత్రకు ఒక్కో షేడ్‌ ఇచ్చి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచాడు. ఓవరాల్ గా ఈ మూవీ యూత్ కు అలాగే ఏ క్లాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.