రివ్యూ : సస్పెన్స్ ‘ ఎవరు ‘…

స్టార్ కాస్ట్ : అడివి శేష్‌, రెజీనా, నవీన్‌ చంద్ర తదితరులు..
దర్శకత్వం : వెంకట్‌ రామ్‌జీ
నిర్మాతలు: పివిపి
మ్యూజిక్ : చరణ్‌ పాకల
విడుదల తేది : ఆగస్టు 15, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : సస్పెన్స్ ‘ ఎవరు ‘…

‘క్ష‌ణం’, ‘అమీ తుమీ’, ‘గూఢ‌చారి’ వంటి వినూత్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతో ఆకట్టుకున్న అడవి శేష్ నటించిన తాజా చిత్రం ‘ఎవరు’. నూతన డైరెక్టర్ రామ్ జీ‌ ఈ చిత్రం తో ఇండస్ట్రీ కి పరిచయమవుతుండగా.. పీవీపీ సినిమాస్ బ్యాన‌ర్‌‌లో ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రంతో శేష్ ఎలాంటి సస్పన్స్ కు గురి చేసాడు..? అసలు ఎవరు..ఎవరు..? దీని కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

రిసెప్షనిస్ట్‌ గా పనిచేసే సమీరా (రెజీనా).. ను అదే సంస్థ అధినేత ఇష్టపడడంతో అతడితో పెళ్లికి సిద్ధపడుతుంది. కానీ ఆ అధినేత తో ఆమెకు శారీరక సంబంధం లేకపోవడంతో.. తన స్నేహితుడైన పోలీస్ ఉన్నతాధికారి అశోక్ (నవీన్ చంద్ర)తో సన్నిహితంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి తమిళనాడు కూనూర్ ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ సమీరాపై అత్యాచారం జరగడం.. అక్కడే అశోక్ హత్య చేయబడటం జరుగుతుంది. మరి ఈ సమీరా ఫై ఎవరు అత్యాచారం చేయబోయారు..? అశోక్ ను ఎవరు చంపారు..? ఈ కేసును పోలీసు అధికారి విక్రమ్‌ వాసుదేవ్‌(అడివి శేష్‌) ఎలా ఛేదించారు..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* కథ – కథనం

* ఊహించని ట్విస్టులు

* నేపథ్య సంగీతం

మైనస్ :

* కామెడీ

* కమర్షియల్ ఎలిమెంట్స్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* సస్పెన్స్ కథలకు కేరాఫ్ అంటే అడవి శేషే..ఆ కథల్లో ఆయన జీవం పోస్తారు..అందరూ నటిస్తే ఈయన మాత్రం ప్రాణం పోస్తారు. అందుకే దర్శక నిర్మాతలంతా ఈయన్నే కావాలని కోరుకుంటారు. ఈ చిత్రంలో కూడా విక్రమ్ వాసుదేవ్‌ పాత్రలో చించేసాడు శేష్‌. అనవసరమైన బిల్డప్‌లు భారీ ఎమోషన్స్‌, పంచ్‌ డైలాగ్‌లు లేకుండా సెటిల్డ్ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు.

* నవీన్ చంద్ర పోలీస్ ఆఫీసర్‌గా తన పాత్రలో ఆకట్టుకున్నారు. రెజీనాతో రొమాంటిక్ సన్నివేశాల్లో తనలోని రొమాంటిక్ నటుడ్ని మేలుకొలిపాడు.

* జగడం సినిమాలో రామ్ తమ్ముడిగా నటించిన నిహాల్ ఈ సినిమాలో క్యాన్సర్ పేషెంట్‌గా అద్భుతంగా నటించారు. కథలో కీలకమైన రోల్ పోషించారు. ఎమోషనల్ సన్నివేశాలను చాలా ఈజీగా చేసి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించాడు.

* కథలో కీలకమైన వినయ్ వర్మ పాత్రలో మురళీశర్మ మరోసారి ఆకట్టుకున్నారు. ఆయనకు భార్యగా నటించిన పవిత్ర లోకేష్ తన పరిధిమేర పాత్రకు న్యాయం చేసింది.

* ఇతర పాత్రల్లో నటించిన నటి నటులు వారి పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :

* గూఢచారి చిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్న శ్రీ చరణ్ పాకాల మరోసారి సస్పెన్స్ థ్రిల్లర్ కథలకు చరణ్ తర్వాతే ఎవరైనా అనిపించేలా ఈ చిత్రానికి కూడా ప్రాణం పెట్టాడు. కథకు ఎలాంటి బ్యాక్ గ్రౌడ్ అవసరమో అదే ఇచ్చి సినిమాకు హైలైట్ అయ్యాడు. సాంగ్స్ కూడా కథకు తగ్గట్లే ఉన్నాయి.

* ఎడిటింగ్ కూడా కరెక్ట్ గా సరిపోయింది. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా ట్విస్టులతో సాగించాడు. సినిమా చూస్తున్నంత సేపు నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఆత్రుత కలిగించారు.

* అబ్బూరి రవి అందించిన డైలాగ్స్ సినిమాకి హైలైట్‌గా నిలిచాయి.

* కెమెరా వర్క్ కూడా కరెక్ట్ గా సరిపోయింది.ఒక ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ కథకు ఎలాంటి ఇంటెన్సిటీ ఉండాలో ఆలా ఉంది.

* వరుసగా ఐదోసారి అడివి శేష్‌తో సినిమా చేసిన నిర్మాత పీవీపీ మరోసారి సక్సెస్ అయ్యాడు. ఇలాంటి విభిన్న కథలను సెట్ చేసి ప్రేక్షకులను ధ్రిల్ కు గురి చేస్తున్నాడు. కథ కు తగ్గట్లే పెట్టుబడి పెట్టాడు. కాకపోతే ఇంకాస్త ప్రమోషన్ ఫై దృష్టి పెడితే బాగుండు.

* ఇక డైరెక్టర్ వెంకట్‌ రామ్‌జీ విషయానికి వస్తే మొదటి సినిమానే ఇలాంటి సస్పెన్సు కథ ను రాసుకొని..దానిని తెరపై కూడా అంతే విధంగా చూపించి ప్రేక్షకులను సస్పెన్సు కు గురి చేసాడు. తర్వాత ఏం జరుగుతుందా అనే ఆసక్తి కలిగించడం లో సక్సెస్ అయ్యాడు.

ఫస్టాఫ్‌లో ఉన్నంత గ్రిప్పింగ్ సెకండాఫ్‌లో కాస్త తగ్గుతుంది. ఇంటర్వెల్‌‌ సీన్‌‌తో కథ రసకందాయంలో పడుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించినా అక్కడక్కడా లాజిక్‌లు మిస్ అయినట్టు కనిపిస్తాయి. కామెడీ, మసాలాలఫై దృష్టి పెట్టలేకపోయాడు. మిగతా అంత కూడా బాగా వర్క్ అవుట్ చేసాడు. ఓవరాల్ గా సస్పెన్స్ ఎవరు అనిపించాడు.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review