రివ్యూ : ఎఫ్ 2 – సంక్రాంతి అల్లుళ్లకి ఫుల్ గిరాకీ..

స్టార్ కాస్ట్ : వెంకటేష్ , వరుణ్ తేజ్ , తమన్నా, మెహ్రాన్ తదితరులు..
దర్శకత్వం : అనిల్ రావిపూడి
నిర్మాతలు: దిల్ రాజు
మ్యూజిక్ : దేవి శ్రీ
విడుదల తేది : జనవరి 12, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : ఎఫ్ 2 – సంక్రాంతి అల్లుళ్లకి ఫుల్ గిరాకీ..

సంక్రాంతి బరిలో చివరి చిత్రం గా వచ్చిన ఎఫ్ 2 ఈరోజు గ్రాండ్ గా విడుదల అయ్యింది. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టార్ మూవీగా పటాస్ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కిన ఈ మూవీ ని దిల్ రాజు నిర్మించారు.

సంక్రాంతి బరిలో ఎన్టీఆర్ కథానాయకుడు , చరణ్ వినయ విధేయ రామ చిత్రాలు ఉన్నప్పటికీ దిల్ రాజు మాత్రం ఫ్యామిలీ కథను నమ్ముకొని ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి సంక్రాంతి అల్లుళ్లు గా వచ్చిన వెంకీ , వరుణ్ లు ఎలా సందడి చేసారు..? అసలు ఈ అల్లుళ్ల కష్టాలు ఏంటి..? వీరి ఫ్రస్ట్రేషన్‌ కు కారణం ఎవరు..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

హారిక‌(త‌మ‌న్నా) ను పెళ్లి చేసుకున్న వెంకీ (వెంకటేష్) పెళ్లి తర్వాత అత్త , భార్య పెట్టి కష్టాలు అనుభవిస్తుంటాడు..అదే టైం లో హారిక సిస్టర్ హ‌నీ(మెహ‌రీన్‌) ని ఇష్టపడతాడు వరుణ్ యాదవ్ ( వరుణ్ తేజ్ ) ఈ విషయం తెలిసి పెళ్లి చేసుకోవద్దని వరుణ్ కు చెపుతాడు వెంకీ. అయినాగానీ వరుణ్ మాత్రం వెంకీ మాటలు వినకుండా హానీ ని పెళ్లి చేసుకుంటాడు.

ఇక ఆ తర్వాత భార్య , అత్తలు పెట్టె టార్చర్ నుండి వెంకీ , వరుణ్ ఎలా తప్పించుకుంటారు..? ప‌క్కింటి వ్య‌క్తి(రాజేంద్ర‌ప్ర‌సాద్‌) వీరికి ఏ సలహా ఇస్తాడు..? ఆ సలహా తో భార్యలకు బుద్ది వస్తుందా..రాదా..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* కామెడీ

* ఫస్ట్ హాఫ్

* డైరెక్షన్

మైనస్ :

* సెకండ్ హాఫ్ లో కాస్త సాగదీత

* మ్యూజిక్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* వెంకటేష్ కామెడీ ఎలా అదరగొడతాడో చెప్పాల్సిన పని లేదు. నువ్వు నాకు నచ్చావ్ , మల్లీశ్వరి చిత్రాలే చెపుతాయి. ఈ చిత్రాల తర్వాత ఆ రేంజ్ లో కామెడీ ని మనం వెంకీ నుండి చూడలేదు. ఇక ఎఫ్ 2 లో మరోసారి తనలోని అసలైన కామెడీ ని చూపించి థియేటర్స్ నవ్వులు కురిపించాడు.. వెంకీ ఫ్ర‌స్ట్రేష‌న్ చూస్తున్నంత సేపు నవ్వు కోకుండా ఉండలేం. చాల రోజుల తర్వాత కడుపుబ్బా నవ్వించాడు.

* తెలంగాణ యువకుడి గా వరుణ్ యాదవ్ రోల్ లో వరుణ్ తేజ్ ఆకట్టుకున్నాడు. వెంకీ తో పోల్చుకుంటే వరుణ్ రోల్ పెద్దగా లేనప్పటికీ ఆయన పాత్ర కు న్యాయం చేసాడు.

* హారిక‌ రోల్ లో తమన్నా నటన బాగుంది. చాల రోజుల తర్వాత ఫుల్లెన్త్ రోల్ దక్కింది. నటన పరంగానే కాకుండా గ్లామర్ గా కూడా మంచి మార్కులు కొట్టేసింది.

* మెహ్రీన్ కు ఓ ప్రత్యేక క్యారెక్టర్ ఇచ్చాడు డైరెక్టర్..ఆ క్యారెక్టర్ లో ఆమె 100 % న్యాయం చేసింది.

* ర‌ఘుబాబు, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ప్ర‌కాష్‌రాజ్‌, నాజ‌ర్‌లు రోల్స్ కూడా కామెడీ ని పండించాయి.

* సీనియర్ నటి అన్నపూర్ణ తనదయిన మాట తీరుతో హీరోలకు ఫ్ర‌స్ట్రేష‌న్ తెప్పించి ప్రేక్షకులకు నవ్వు తెప్పించింది.

* వెన్నెల కిషోర్ , ప్రియదర్శి , అనసూయ , బ్రహ్మజీ మొదలగు వారంతా వారి వారి పాత్రల్లో అదరగొట్టారు.

ఓవరాల్ గా ప్రతి ఒక్క క్యారెక్టర్ ను కామెడీ గా చూపించి సక్సెస్ అయ్యాడు డైరెక్టర్.

సాంకేతిక విభాగం :

* తన మ్యూజిక్ తో సినిమాకు హైలైట్ గా నిలిచే దేవి శ్రీ ప్రసాద్..తన మార్క్ చూపించలేకపోయారు. ఒకటి రెండు సాంగ్స్ తప్ప మిగతా సాంగ్స్ అన్ని తేలిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించింది.

* ఎప్పటిలాగానే సమీర్ రెడ్డి తన కెమెరా పనితాన్ని చూపించి సినిమాను చాల అందంగా తెరకెక్కించారు. యూర‌ప్‌లో తెరకెక్కించిన పాటల లొకేషన్స్ కట్టిపడేశాయి.

* ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. అది కాస్త చూసుకుంటే బాగుండు.

* ఇక దిల్ రాజు నిర్మాణ విలువలు గురించి చెప్పాల్సిన పనే లేదు. కథ కు తగిన ఖర్చు చేసి సినిమాను విజయ బాటలో ఉంచుతారు. ఈ సినిమా విషయంలోనే అదే చేసారు.

ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి విషయానికి వస్తే..రైటర్ గా తన సినీ కెరియర్ మొదలు పెట్టి ఆ తర్వాత సుప్రీమ్ చిత్రం తో డైరెక్టర్ గా మరి మొదటి సక్సెస్ అందుకున్నాడు. పటాస్ , రాజా ది గ్రేట్ ఇలా వరుస సక్సెస్ లు అందుకొని ప్రేక్షకులను రంజిపచేసాడు.

ఇక చిత్ర కథ అంత కూడా భార్యల చేతిలో కష్టాలు పడే భర్తల జీవితాన్ని ఫన్నీ గా రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంత కూడా ప్రతి ఫ్రేమ్ ఫన్నీ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ అంత కూడా యూరప్ చుట్టూ తిరుగుతుంది. కథలో పెద్దగా ట్విస్ట్ లు లేకపోయినా , కామెడీ కి డోకా ఉండదు. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుకుంటూనే ఉంటారు. మరోసారి అనిల్ తన పెన్ను కు పదును పెట్టాడు.

ఎక్కడ కూడా బోర్ ఫీలింగ్ రాకుండా సినిమాను సాఫీగా నడిపించాడు. కాకపోతే సెకండ్ హాఫ్ లో కాస్త సాగదీసినట్లు అనిపిస్తుందంతే. మిగతా అంత కూడా ఫుల్ గా ఎంజాయ్ చేసే విధంగా తన మార్క్ చూపించాడు.

చివరగా :

ప్రస్తుతం ప్రేక్షకులు కూడా కామెడీ నే కోరుకుంటున్నారు. రెండు గంటల సేపు హ్యాపీ గా నవ్వుకునే సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అనిల్ కూడా ఇలాంటి కథనే రాసుకొని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. భార్యల వల్ల హీరోలు పడే ఫ్రస్ట్రేషన్‌ ను కామెడీ గా చూపించి థియేటర్స్ లలో నవ్వులు పోయించాడు డైరెక్టర్.

వెంకటేష్ లోని కామెడీ యాంగిల్ ను మరోసారి చూపించి ఆకట్టుకున్నాడు. వెంకీ సైతం తన పాత్రకు ఫెరెక్ట్ గా న్యాయం చేసాడు. మిగిలిన నటి నటులంతా కూడా బాగా అలరించారు. అంత అనుకుంటున్నట్లే సంక్రాంతి కి ఫుల్ గా నవ్వించారు.

నోట్ :

సినిమాను థియేటర్స్ లలో చూడండి..పైరసీ చేసి సినిమా ఇండస్ట్రీని నాశనం చేయకండి. ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది కేవలం మన ఆనందం కోసమే..అలాంటి ఆనందాన్ని పైరసీ లో చూడకండి.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review