రివ్యూ : గేమ్ ఓవర్ – స్లో గేమ్

స్టార్ కాస్ట్ : తాప్సి, వినోదిని వైద్యనాథ‌న్‌ తదితరులు..
దర్శకత్వం : అశ్విన్ శరవణన్
నిర్మాతలు: ఎస్.శశికాంత్
మ్యూజిక్ : రోన్ ఏతాన్ యోహాన్
విడుదల తేది : జూన్ 14, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : గేమ్ ఓవర్ – స్లో గేమ్

తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేకపోయినా సొట్ట బుగ్గల తాప్సి..ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి బాగానే రాణిస్తుంది..ఈమె చేసిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు అవుతుండడం తో అమ్మడికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.

తాజాగా నయనతారతో ‘మయూరి’ లాంటి సినిమాను తీసిన అశ్విన్ శరవణన్ డైరెక్షన్ లో గేమ్ ఓవర్ అంటూ ఈరోజు తెలుగు , తమిళ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వై నాట్ స్టూడియోస్ పతాకంపై ఎస్.శశికాంత్ ఈ సినిమాను నిర్మించారు. మరి ఈ సినిమా తో తాప్సి ఎలాంటి హిట్ అందుకుంది..? అసలు గేమ్ ఓవర్ టైటిల్ కు కథ కు సంబంధం ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

స్వప్న (తాప్సి) వీడియో గేమ్ డిజైనర్‌..గేమ్స్ అంటే ప్రాణం ఇస్తుంటుంది. ఓ సంఘటన కారణంగా ఆమె తన తల్లిదండ్రులను వదిలి తన పనిమనిషి క‌ళ‌మ్మ (వినోదిని వైద్యనాథ‌న్‌)తో క‌లిసి ఒక ఇంట్లో నివసిస్తుంటుంది. అంతకు ముందు అమృత (సంచన నటరాజన్‌) అనే అమ్మాయిని ఓ హంతకుడు అతి కిరాతకంగా తాళ్లతో కట్టేసి ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌ తొడిగి..ఆమె బాడీని నరికి తగులబెడతాడు.

స్వప్నఓ ప‌చ్చబొట్టు చేతికి వేసుకుంటుంది. ఆ పచ్చబొట్టు లో అమృత అస్తిక‌లు కలుస్తాయి. అసలు స్వప్న కు..అమృత కు సంబంధం ఏంటి..? ఆమె అస్తిక‌లు..ఆ ప‌చ్చబొట్టులో ఎందుకు కలుస్తాయి..? దానివల్ల స్వప్న ఎలాంటి ఇబ్బందులకు గురి అవుతుంది అనేది అసలు కథ.

ప్లస్ :

* తాప్సి

* సెకండ్ హాఫ్

* స్క్రీన్ ప్లే

మైనస్ :

* ఫస్ట్ హాఫ్

* స్లో నేరేషన్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* తాప్సి బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది . ఇప్పటివరకు ఎక్కువ గ్లామర్ పాత్రల్లోనే తాప్సి ను చూసాం..కానీ ఈ సినిమాలో మాత్రం సినిమా మొత్తాన్ని తన భుజాల ఫై వేసుకొని. తన నటన తో ప్రేక్షకులను కట్టిపడేసింది. చాలామంది ఈమె యాక్టింగ్ కు ఫిదా కావాల్సిందే. లుక్‌, యాక్షన్‌, ఎమోషన్స్‌ ఇలా ప్రతీ విషయంలో కరెక్ట్ గా సరిపోయింది.

* కలమ్మ పాత్రలో వినోదిని వైద్యనాథన్‌ సరిగ్గా సరిపోయింది.

* ఇతర పాత్రల్లో అనీష్‌ కురివిల్లా, రమ్య సుబ్రమణ్యం, సంచన నటరాజన్‌ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :

* రోన్ ఏతాన్ యోహాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథ కు తగ్గట్లు ఉంది.

* ఫస్ట్ హాఫ్ లో రిచర్డ్ కెవిన్ తన ఎడిటింగ్ కు ఇంకాస్త పని చెపితే బాగుండు.

* సినిమాటోగ్రఫి సినిమాకు హైలైట్ గా నిలిచింది.

* అశ్విన్ శరవణన్,కావ్య రాంకుమార్ స్క్రీన్ ప్లే సినిమా కు కీ రోల్ గా నిలిచింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చక్కటి స్క్రీన్ ప్లై తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

* ఈ సినిమా ద్వారా దర్శకుడు అశ్విన్ శరవణన్ దేశంలోని పలు సామాజిక అంశాలను కూడా టచ్ చేసే ప్రయత్నం చేసాడు. మనం వీడియో గేమ్ ఆడుతున్నపుడు కిల్ అయినప్పుడల్లా లైఫ్ లైన్ ఉపయోగించుకుని గేమ్ కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఇదే తరహాలో ఈ చిత్రంలో తాప్సీకి విలన్ లైఫ్ లైన్ ఇస్తాడని, ఇందులో ఆమె వృత్తికి, గతానికి లింక్ పెట్టి ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో అద్భుతంగా కథను ముందుకు నడిపించాడు.

కాకపోతే మొదటి పార్ట్ లో ఏమాత్రం కథ లేకపోవడంతో ప్రేక్షకులకు నిరాశ కలిగిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లోనే అసలైన కథ మొదలు అవుతుంది. కానీ కథ బాగుందే అనుకునేలోపే క్లైమాక్స్ వచ్చేసి అరే అనిపించింది. ఓవరాల్ గా మైండ్ గేమ్ తో సాగిన ఈ చిత్రానికి తాప్సి , స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలిచింది. కాకపోతే కాస్త స్లో నేరేషన్ గా ఉండడం ఇబ్బంది కలిగిస్తుంది.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review