రివ్యూ : ‘ గీత గోవిందం ‘ – టైం పాస్ గోవిందం ..

స్టార్ కాస్ట్ : విజయ్ దేవరకొండ , రష్మిక , నాగబాబు తదితరులు..
దర్శకత్వం : పరుశురాం
నిర్మాతలు: బన్నీ వాస్‌
మ్యూజిక్ : గోపిసుందర్
విడుదల తేది : ఆగస్టు 15, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : ‘ గీత గోవిందం ‘ – టైం పాస్ గోవిందం ..

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా అల్లు అరవింద్ సమర్పణ లో పరశురాం తెరకెక్కించిన చిత్రం `గీత గోవిందం`. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన చిత్ర టీజర్స్, ఆడియో ముఖ్యంగా `ఇంకేం ఇంకేం కావాలే` `వాట్ ద లైఫ్`….పాటలు చిత్రంపై విపరీతమైన క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. దీంతో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని విజయ్ అభిమానులు , సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తి గా ఎదురుచూసారు. మరి వారి ఎదురుచూపులు తగ్గట్లే సినిమా ఉందా..? అర్జున్ రెడ్డి తో అదరగొట్టిన విజయ్, గోవిందం గా ఎలా ఆకట్టుకున్నాడు..? అసలు గీత – గోవిందం మధ్య ఏం నడించింది..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) కాలేజ్ లెక్చరర్‌..ఎంతో పద్ధతి గా పెరిగిన గోవింద్. తను చేసుకోబోయే అమ్మాయి కూడా అంతే పద్దతిగా ఉండాలని అనుకుంటాడు.ఓ రోజు గుడిలో గీత (రష్మిక మందన్న)ను చూసి ఇష్టపడతాడు. ఎలాగైనా ఈమెనే పెళ్లిచేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఇంతలో తన చెల్లికి పెళ్లి కుదరటంతో గోవింద్ కాకినాడ కు బస్ లో బయలు దేరతాడు. అదే బస్సుల్లో విజయ్‌ పక్కన సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమెను చూసి షాక్ అవుతాడు.

ఈ విషయం తన స్నేహితులతో చెప్పడం తో , నీ ప్రేమ గురించి చెప్పడానికి ఇదే మంచి సమయమని సలహా ఇస్తారు. ఈ నేపథ్యం లో అనుకోకుండా విజయ్ ను గీత తప్పుపడుతుంది. అలా గీతకు మొదటి చూపులోనే గోవింద్ మైనస్ మార్కులు వేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? గోవింద్ – గీత మళ్లీ కలుసుకుంటారా లేదా..? గోవింద్ ప్రేమను గీత ఎలా తెలుసుకుంటుంది..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.

ప్లస్ :

* విజయ్ దేవరకొండ – రష్మిక కెమిస్ట్రీ..

* గోపిసుందర్ మ్యూజిక్

* పరుశురాం స్క్రీన్ ప్లే

మైనస్ :

* కథ

* సెకండ్ హాఫ్ లో స్లో నేరేషన్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ‘అర్జున్ రెడ్డి’ చిత్రం లో రా అండ్ బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించిన విజయ్..గోవిందం లో ఎలా కనిపించబోతాడో అని అంత అనుకున్నారు. కానీ ఆ అర్జున్ రెడ్డి , ఈ గోవిందం పూర్తిగా వేరు. కాలేజ్ లెక్చరర్ గా ఈ మూవీ లో విజయ్ కనిపించాడు..పేరుకు తగ్గట్లే విజయ్ అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టాడు. ముఖ్యం గా రష్మిక – విజయ్ మధ్య సాగిన కెమిస్ట్రీ సినిమాకే హైలైట్ గా ఉంది. యాక్టింగ్ , డాన్స్ , డైలాగ్స్ ఇలా అన్నింట్లో విజయ్ తన మార్క్ చూపించి మరోసారి యూత్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

* ‘అమ్మాయిలు, ఆంటీలు అని తిరిగితే యాసిడ్ పోసేస్తా’ అంటూ టీజర్ తోనే ఆకట్టుకుంది రష్మిక. చలో తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే యూత్ భామ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ , ఈ సినిమాలో గీత పాత్రలో చించేసింది. ముఖ్యం గా ‘ఇంకేం.. ఇంకేం.. కావాలే చాలే ఇది చాలే’ సాంగ్‌లో రష్మికా.. గులాబీ రంగు చీరలో బొడ్డు కిందకు చీరకట్టిన సౌందర్యాన్ని సర్ధుకుంటూ చూసే కొంటెచూపు కుర్రకారుకి నిద్రలేకుండా చేసింది. థియేటర్ లలో మరోసారి ఈ సాంగ్ వస్తే బాగుండు అనేలా అమ్మడి అందానికి ఫిదా అయ్యారు.

* నాగ‌బాబు రోల్ బాగుంది.

* సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, గిరిబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, మౌర్యాని, సుభాష్‌, అభ‌య్‌, స్వ‌ప్న‌క‌, స‌త్యం రాజేష్‌, దువ్వాసి మెహ‌న్‌, గుండు సుద‌ర్శ‌న్‌, గౌతంరాజు, అనీష‌, క‌ళ్యాణి న‌ట‌రాజ‌న్‌, సంధ్య జ‌న‌క్ త‌దిత‌రులు పాత్రలు వారి వారి పరిధి మేరకు ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

* మొదటిగా మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ మ్యూజిక్ గురించి చెప్పాలి. సినిమాకు ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఈయన మ్యూజిక్ అని చెప్పాలి. ‘ఇంకేం.. ఇంకేం.. కావాలే’ అన్న ఒక్కసాంగ్‌తో మోస్ట్ ఎగ్జైటింగ్ మూవీగా అందరిలో ఆసక్తి పెంచాడు. ఈ చిత్రం లో అన్ని సాంగ్స్ అదరగోట్టాయి. `ఇంకేం ఇంకేం కావాలే` `వాట్ ద లైఫ్`అనే సాంగ్స్ కు థియేటర్స్ మారుమోగిపోతున్నాయి..అలాగే మిగతా సాంగ్స్ కూడా థియేటర్స్ లలో మంచి రెస్పాన్స్ వస్తుంది.

* మ‌ణికంద‌న్‌ సినిమా ఫొటోగ్రఫీ మరో హైలైట్ గా నిలిచింది. తెర ఫై ఈయన కెమెరా పనితనం సంపూర్ణంగా కనిపిస్తుంది. హీరో , హీరోయిన్లను ఎంతో అందంగా చూపించారు.

* మార్తాండ్‌.కె.వెంక‌టేష్ ఎడిటింగ్ విషయం లో సెకండ్ హాఫ్ లో ఇంకాస్త కత్తెరకు పని చెపితే బాగుండు అనిపించింది.

* బ‌న్నివాసు నిర్మాణ విలువలు బాగున్నాయి..వీరు ఖర్చు చేసిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది.

* ఇక పరుశురాం విషయానికి వస్తే ఈ చిత్రానికి క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు అన్ని ఈయనే అందించారు. కథ పెద్దగా లేకున్నా స్క్రీన్ ప్లే తో తన మార్కు ను చూపించాడు. ఫస్ట్ హాఫ్ అంత హ్యాపీ గా సాగిన , సెకండ్ హాఫ్ కాస్త స్లో గా అనిపించింది. ఇక మాటలు చెప్పాల్సిన పనిలేదు. టీజర్ లో రష్మిక చేత ‘అమ్మాయిలు, ఆంటీలు అని తిరిగితే యాసిడ్ పోసేస్తా’ అనిపించి సినిమాలో ఇంకా ఎలాంటి డైలాగ్స్ ఉన్నాయో చెప్పకనే చెప్పాడు. కథ కు తగ్గట్లే యూత్ కు కావాల్సిన డైలాగ్స్ ను రాసుకొని రైటర్ గా సక్సెస్ అయ్యాడు.

ప్రస్తుతం థియేటర్స్ కు ఎక్కువగా యూతే వస్తారు కాబట్టి వారిని టార్గెట్ చేస్తూ ఈ కథ రాసుకున్నాడు. వారికీ ఎలాంటి సన్నివేశాలు ఉండాలో , హీరో – హీరోయిన్ మధ్య ఎలాంటి కెమిస్ట్రీ ఉంటె ఇష్టపడతారో అన్ని కరెక్ట్ గా చూసుకున్నాడు. శ్రీరస్తు శుభమస్తు చిత్రం తో కాస్త నిరాశ పరిచిన ఈ సినిమాతో ఫుల్ భోజనం పెట్టాడు.

చివరిగా :

విడుదలకు ముందే పాజిటివ్ బజ్ సొంతం చేసుకున్న ఈ గీత గోవిందం..అనుకున్నట్లే సక్సెస్ కొట్టింది. కాలేజ్ లెక్చరర్ గా విజయ్ యాక్టింగ్ , రేష్మిక గ్లామర్ , పరుశురాం స్క్రీన్ ప్లే , గోపి మ్యూజిక్ , నిత్యా మీనన్ – అను ఇమ్మాన్యుయేల్ గెస్ట్ రోల్స్ ఇలా అన్ని కూడా సినిమాను విజయ ఢంకా మోగేలా చేసాయి.

Click here for English Review