రివ్యూ : గుణ 369 – రివెంజ్ డ్రామా

స్టార్ కాస్ట్ : కార్తికేయ, అనఘ, మహేష్‌ తదితరులు..
దర్శకత్వం : అర్జున్‌ జంధ్యాల
నిర్మాతలు: అనిల్, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాలు
మ్యూజిక్ :చైతన్‌ భరద్వాజ
విడుదల తేది : ఆగస్టు 2, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : గుణ 369 – రివెంజ్ డ్రామా

‘ఆర్‌.ఎక్స్.100’ చిత్రంతో ఇండస్ట్రీ కి హీరోగా పరిచమైన కార్తికేయ ..మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని యూత్ కు బాగా దగ్గర అయ్యాడు . ఆ తర్వాత హిప్పీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా కార్తికేయ కు నిరాశనే మిగిల్చింది. ఈ నేపథ్యంలో బోయపాటి శ్రీను శిష్యుడు అర్జున్‌ జంధ్యాల డైరెక్షన్లో గుణ 369 అనే సినిమా చేసాడు.

పక్క మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ మంచి అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ తో కార్తికేయ హిట్ అందుకున్నాడా..లేదా..? ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్న అర్జున్‌ జంధ్యాల మొదటి సినిమాతో ఎలాంటి ఫలితం అందుకున్నాడు..? అసలు ఈ కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

గుణ (కార్తికేయ) ఎలాగైనా బీటెక్‌ పాసై..ఓ గ్రానైట్‌ క్వారీలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంటాడు. కాలనీలో అందరికీ సాయం చేస్తూ మంచి అబ్బాయి గా పేరు తెచ్చుకుంటాడు. అదే కాలనీకి కొత్తగా వచ్చిన గీత (అనఘ) అనే అమ్మాయితో గుణ ప్రేమలో పడతాడు. గుణ మంచితనం చూసి ఆమె కూడా ప్రేమించడం మొదలు పెడుతుంది.

గద్దలగుంట రాధ(ఆదిత్యమీనన్‌) పెద్ద రౌడీ. సెటిల్‌మెంట్స్‌ చేసుకుంటూ తనకు ఎదురొచ్చిన వారిని భయపెడుతూ ఉంటాడు. ఈనేపథ్యంలో కొన్ని సంఘటనల కారణంగా గుణ అతడి దగ్గర పనిచేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది రాధను చంపేస్తారు..ఆ నేరం గుణ ఫై పడుతుంది. ఆలా జైలు కు వెళ్లి వచ్చిన గుణ కు గీత చనిపోయిందనే వార్త తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? గుణ..రాధ దగ్గర ఎందుకు పనిచేయాల్సి వస్తుంది..? రాధను..గీత ను ఎవరు చంపుతారు..? గుణ వారిపై ఎలా పగ తీర్చుకుంటాడనేది అసలు స్టోరీ.

ప్లస్ :

* స్టోరీ
* సెకండ్ హాఫ్ యాక్షన్
* కార్తికేయ నటన
* మెసేజ్‌

మైనస్ :

* హీరో – హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్
* మ్యూజిక్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

కార్తికేయ మరోసారి యాక్షన్ హీరో అనిపించుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంత లవర్ బాయ్ గా కనిపించిన కార్తికేయ..సెకండాఫ్‌లో యాక్షన్‌ ఎలిమెంట్‌, ఎమోషనల్‌ ఎలిమెంట్స్‌లో చక్కటి నటనను కనపరిచాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో నటన ఆకట్టుకుంది.

ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచమైన అనఘ.. తొలి చిత్రంతోనే డిఫరెంట్‌ పాత్రను చేసింది. ఆమె అటెంప్ట్‌కి అభినందించాలి. ఆమె పాత్ర పరంగా తనదైన నటనతో మెప్పించింది. లుక్స్ పరంగానూ అనఘ ఫుల్‌ మార్క్స్‌ సాధించింది.

తండ్రి పాత్రలో నరేష్‌ ఒదిగిపోయాడు. పెద్దగా స్కోప్‌ లేకపోయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచాడు.

రాధ పాత్రలో ఆదిత్య తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.

సినిమాలో పిల్లర్‌లాంటి పాత్రలో మహేశ్‌ నటించాడు. రంగస్థలం తర్వాత అతనికి మంచి పాత్ర ఈ సినిమాలో పడింది. అసలు సినిమా అంతా మహేశ్‌ను బేస్‌ చేసుకునే రన్‌ అవుతుంది.

హేమ, కౌముది, శివాజీరాజా తదితరులు వారి వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.

సాంకేతిక విభాగం :

చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించిన పాటలు పెద్దగా బాగాలేకపోయినప్పటికీ..నేపథ్యం సంగీతం బాగుంది.

తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది.

రామ్‌రెడ్డి కెమెరా వర్క్ సినిమాకు హైలైట్ గా నిలిచింది.

అనీల్‌ కడియాల, తిరుమల్‌రెడ్డి నిర్మాణ విలువలు సినిమా కథ కు తగ్గట్లు కరెక్ట్ గా సరిపోయాయి.

ఇక నూతన డైరెక్టర్ అర్జున్ జంధ్యాల విషయానికి వస్తే..బోయపాటి దగ్గర శిష్యుడు కావడం తో ఆయన మాస్ ఎలిమెంట్స్ ను బాగా వంటపట్టుకున్నాడు. సెకండ్ హాఫ్ లో చాల చోట్లా బోయపాటి మార్క్ కనిపించింది. యదార్థ సంఘటనల ఆధారంగా కథను సిద్ధం చేసుకున్న జంధ్యాల ఆ కథను మాస్‌ కమర్షియల్ స్టైల్‌లో చెప్పే ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యాడు. కాస్త లవ్‌ ట్రాక్‌పై శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా ఫస్ట్ మూవీ నే కమర్షియల్ మెసేజ్ ను తీసుకొని అర్జున్ విజయం సాధించారు.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review