రివ్యూ : హలో గురు ప్రేమకోసమే – కామెడీ ఎంటర్టైనర్

స్టార్ కాస్ట్ : రామ్ , అనుపమ , ప్రణీత , ప్రకాష్ రాజ్ తదితరులు..
దర్శకత్వం : త్రినాధ్ నక్కిన
నిర్మాతలు: దిల్ రాజు
మ్యూజిక్ : దేవి శ్రీ
విడుదల తేది : అక్టోబర్ 18, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : హలో గురు ప్రేమకోసమే – కామెడీ ఎంటర్టైనర్..

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌ రాజు సమర్పణ లో శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు గా త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం లో రూపొందిన ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్ `హ‌లో గురు ప్రేమ కోస‌మే`. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ఇందులో కీల‌క‌పాత్ర‌లో నటించగా , అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌ణీత హీరోయిన్స్‌గా న‌టించారు. `సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్` వంటి హిట్‌ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ క్యూట్ అండ్ సెన్సిబుల్ ల‌వ్ స్టోరీ ఫై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

దసరా కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది..? త్రినాద్ ఎలాంటి కథ తో వచ్చాడు ..? దిల్ రాజు నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయో..? దేవి శ్రీ మ్యూజిక్ సినిమాకు హెల్ప్ అయ్యిందా ..లేదా..? అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

సంజు (రామ్) జాబ్ కోసం కాకినాడ నుండి హైదరాబాద్ వస్తాడు. ఆ ప్రయాణంలో అను (అనుపమ) పరిచయం అవుతుంది. సంజు వాళ్లమ్మ (సితార) కు స్నేహితుడైన విశ్వనాద్(ప్రకాష్ రాజ్) ఇంట్లో సంజు ఉంటాడు. ఇక ట్రైనర్‌గా ఐటీ జాబ్‌లో చేరిన సంజు.. అదే ఆఫీస్ లో పనిచేస్తున్న ప్రణీతను ఇంప్రెస్ చేస్తాడు. ఆలా ఇంప్రెస్ అయినా ప్రణీత , సంజు కు ప్రపోజ్ చేస్తుంది. కానీ సంజు మాత్రం ఆమె ప్రపోజ్ ను రిజక్ట్ చేస్తాడు.

ఎందుకు సంజు ప్రణీత ప్రపోజ్ ను రిజక్ట్ చేస్తాడు..? ఇంతకీ అను ఎవరు..? అను కు విశ్వనాద్ కు సంబంధం ఏంటి..? సంజు ప్రేమకు విశ్వనాద్ ఎలా హెల్ప్ చేస్తాడు..? సంజు ఎవరిని ఇష్టపడతాడు..? ఇవ్వన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* రామ్ యాక్టింగ్

* ఫస్ట్ హాఫ్ కామెడీ

* ప్రకాష్ రాజ్ – రామ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు

మైనస్ :

* రొటీన్ స్టోరీ

* మ్యూజిక్

* సెకండ్ హాఫ్ స్లో గా సాగడం

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* రామ్ ఎప్పటిలాగానే ఎనర్జిటిక్‌గా నటించి న్యాయం చేసాడు. మరోసారి తన నటనతో , లుక్ ఆకట్టుకున్నాడు. విశ్వనాధ్ గా ప్రకాశ్ రాజ్ మరోసారి తన అద్భుతమైన నటన తో ఆకట్టుకున్నాడు. ఓ పక్క అమ్మాయి తండ్రిగా.. మరో పక్క తన కూతుర్ని ప్రేమించిన కుర్రాడికి స్నేహితుడిగా ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.

* రామ్ మరియు ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు.

అనుపమ తల్లిగా ఆమని మాట్లాడే బట్లర్ ఇంగ్లిష్ ప్రేక్షకులను తెగ నవ్విస్తుంది. ఇక అనుపమ విషయానికి వస్తే ఫ్యామిలీ గర్ల్‌గా, తండ్రిని ఎంతో ఇష్టపడే అమ్మాయిగా ఆకట్టుకుంది కానీ ఆమె పాత్రను ఇంకాస్త చూపిస్తే బాగుండు. రెండో హీరోయిన్ గా ప్రణీత తన పాత్రకు తగ్గ న్యాయం చేసింది.

* జ‌య‌ప్రకాష్, సితార, పోసాని కృష్ణ‌ముర‌ళీ త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం :

* దేవి శ్రీ మ్యూజిక్ అంటే వంక పెట్టాల్సిన అవసరం ఉండదు…కానీ ఈ సినిమా విషయంలో మాత్రం వంక పెట్టాల్సి వచ్చింది. నేను లోకల్ , నేను శైలజ వంటి చిత్రాలకు అద్భుతమైన మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ ఇచ్చిన దేవి , ఈ సినిమా విషయంలో మాత్రం సరైన న్యాయం చేయలేకపోయాడు. మ్యూజిక్ మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

* ప్రసన్న కుమార్ డైలాగ్స్ యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి. ‘గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాలి అనుకునే చదువును మర్చిపోతాం.. కానీ మర్చిపోవాలి మర్చిపోవాలి అనుకునే అమ్మాయిని మాత్రం .. దీనమ్మా! చచ్చేదాకా మర్చిపోలేం’

‘అబద్ధాలు చెబితే అమ్మాయిలు పుడతారో తెలియదు కాని.. అబద్ధాలు చెబితే అమ్మాయిలు ఖచ్చితంగా పడతారు’ ఇలా ఒకటి రెండు కాదు చాల డైలాగ్స్ బాగా పేలాయి.

* విజ‌య్ కే చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫి బాగుంది.

* సెకండ్ హాఫ్ లో కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఫై ఇంకాస్త శ్రద్ద తీసుకుంటే బాగుండు.

* దిల్ రాజు నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ త్రినాధ్ విషయానికి వస్తే..సినిమా చూపిస్త మావ , నేను లోకల్ సినిమాలతో తన టాలెంట్ ఏంటో చూపించడం తో హలో గురు ప్రేమకోసం ఫై అందరి భారీ అంచనాలే పెట్టుకున్నారు. నేను లోకల్ అంతగా కాకపోయినా సినిమా పర్వాలేదు అనిపించింది. రొటీన్ కథనే ఎంచుకున్నప్పటికీ దానికి సరిపడా కామెడీ రాసుకొని , బోర్ ఫీలింగ్ కలగకుండా జాగ్రత్త పడ్డాడు.

* ఫస్ట్ హాఫ్ అంత సరదా సరదాగా గడిచిపోతుంది. ఆఫీసులో వచ్చే సన్నివేశాలు కామెడీ పండిస్తాయి. ప్రణీత తండ్రికి, రామ్ మధ్య వచ్చే డేటాబేస్, ఊప్స్ కాన్సెప్ట్ ప్రశ్నల సీన్లయితే కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక సెకండాఫ్ కాస్త స్లో అయ్యింది.

ఫస్టాఫ్‌లో కామెడీ పండించడంలో సక్సెస్ అయిన డైరెక్టర్.. సెకండాఫ్‌లో దానిని కొనసాగించలేకపోయాడు. ప్రకాశ్ రాజ్, రామ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. దిల్ రాజు ఖర్చు కు తగ్గట్లు సినిమాను నడిపించాడు.

చివరిగా :

నేను లోకల్ తరహాలో లేకపోయినప్పటికీ , సినిమా పర్వాలేదు అనిపిస్తుంది. రొటీన్ కథ అయినప్పటికీ ఆ ఫీలింగ్ రాకుండా కామెడీ ని జోడించి ప్రేక్షకులను నవ్వులు తెప్పించాడు. రామ్ యాక్టింగ్ , అనుపమ గ్లామర్ , ప్రకాష్ రాజ్ డైలాగ్స్ , అక్కడక్కడా కొన్ని సెంటిమెంట్ సన్నివేశాలు ఇలా అన్ని కూడా సమపాలనలో ఉండడం తో సినిమా అందరికి నచ్చుతుంది. ఈ దసరా కు కుటుంబ సమేత వెళ్లి ఈ చిత్రాన్ని చూడొచ్చు.

నోట్ :

సినిమాను థియేటర్స్ లలో చూడండి..పైరసీ చేసి సినిమా ఇండస్ట్రీ ని నాశనం చేయకండి. ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది కేవలం మన ఆనందం కోసమే..అలాంటి ఆనందాన్ని పైరసీ లో చూడకండి.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review