రివ్యూ : హిప్పీ – యూత్ మూవీ

స్టార్ కాస్ట్ : కార్తికేయ, దిగంగనా, జజ్బాసింగ్‌ తదితరులు..
దర్శకత్వం : టీఎన్‌ కృష్ణ
నిర్మాతలు: వీ క్రియేషన్స్‌
మ్యూజిక్ : నివాస్‌ కే ప్రసన్న
విడుదల తేది : జూన్ 06, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : హిప్పీ – యూత్ మూవీ

‘ఆర్ఎక్స్100’ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఒక్క సినిమాతోనే యూత్ ను అంత తనవైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు ‘హిప్పీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దిగంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరోయిన్లుగా నటించగా.. సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. టీఎన్ క్రిష్ణ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ప్రముఖ నిర్మాత కళైపులి ఎస్.థాను నిర్మించారు. మరి కార్తికేయ హిప్పీ తో ఎలాంటి హిట్ అందుకున్నాడు..? అసలు హిప్పీ కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

హిప్పీ దేవదాస్‌ (కార్తికేయ) మార్షల్ ఆర్ట్స్ అంటే ఎంతో ప్రాణం..ఎలాగైనా మార్షల్ ఆర్ట్స్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ట్రై చేస్తుంటాడు. అలా ఇంజనీరింగ్‌ పూర్తి కాగానే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ మొదలు పెడతాడు. ఈ క్రమం లో స్నేహ (జజ్బా సింగ్) ను ప్రేమించడం మొదలు పెడతాడు. ఆమెకూడా హిప్పీ ని ప్రేమిస్తుంది. ఇద్దరు కలిసి లో లాంగ్ డ్రైవ్ కు వెళ్తారు. ఆలా అక్కడ స్నేహ ఫ్రెండ్ ఆముక్తమాల్యద(దిగంగన సూర్యవంశీ)ను చూసి ప్రేమిస్తాడు. ఆలా మెల్ల మెల్ల గా స్నేహ ను దూరం చేస్తూ ఆముక్తకు దగ్గరవుతుంటాడు. దీంతో స్నేహ వేరొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోద్ది.

ఆ తర్వాత హిప్పీ, ఆముక్తమాల్యదలు దగ్గరవుతుంటారు. కానీ అప్పటి నుండే హిప్పీ అసలైన కష్టాలు మొదలు అవుతాయి. మరి ఆ కష్టాలు ఏంటి..? ఆ కష్టాల నుండి ఎలా బయటపడతాడు..? ఇంతకీ హిప్పీ కి ఎవరి వాళ్ళ కష్టాలు వస్తాయి..? అరవింద్‌ (జె.డి. చక్రవర్తి) కు హిప్పీ కి సంబంధం ఏంటి..? అనేది మీరు తెరఫై చూడాల్సిందే.

ప్లస్ :

* కార్తికేయ

* యూత్ కు నచ్చే అంశాలు

* కామెడీ

* సినిమాటోగ్రఫి

మైనస్ :

* స్లో నేరేషన్

* రొటీన్ కథ

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* కార్తికేయ కండలు తిరిగిన దేహంతో ఆకట్టుకున్నాడు. కేవలం లుక్ పరంగానే కాదు నటనలో కూడా చాల వైవిద్యం కనపరిచాడు. ఇక హీరోయిన్స్ తో రొమాన్స్ విషయంలో మనోడు కేక పుట్టించాడు. హాట్ హాట్ లిప్ లాక్ లతో యూత్ కు ఇంకాస్త దగ్గర అయ్యాడు.

* దిగంగనా సూర్యవంశీ.. ఆముక్తమాల్యద ఇద్దరు కూడా గ్లామర్ పరంగానే కాకుండా నటన లో కూడా మంచి మార్కులు వేసుకున్నారు.

* అరవింద్‌ పాత్ర లో జేడీ చక్రవర్తి అదరగొట్టాడు. ఆ పాత్ర ను చాల ఈజీ గా చేసి మరోసారి తన నటనతో అలరించాడు. కాకపోతే సినిమా స్టార్టింగ్ లో డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ తో ఇంకాస్త ఇబ్బంది పెట్టాడు.

* వెన్నెల కిశోర్‌ తన కామెడీ టైమింగ్‌తో బాగానే నవ్వించాడు. ఇతర పాత్రల్లో జజ్బా సింగ్‌, బ్రహ్మాజీ, సుదర్శన్‌ మొదలగు వారు వారి వారి పాత్రల్లో ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :

* ఆర్‌డీ రాజశేఖర్‌ సినిమాటోగ్రఫి బాగుంది.

* నివాస్‌ కే ప్రసన్నా సంగీతం జస్ట్ ఓకే.

* ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటె బాగుండు. చాల సన్నివేశాలు బోర్ గా ఉండడం తో ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేసారు.

* ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఇక డైరెక్టర్ విషయానికి వస్తే.. టీఎన్‌ కృష్ణ తీసుకున్న కథ కొత్తదేమీ కాదు..హీరో హీరోయిన్లు ప్రేమించుకోవడం ఆ తర్వాత విడిపోవడం..మళ్లీ కలుసుకోవడం ఫై ఇప్పటివరకు చాల సినిమాలే వచ్చాయి. కాకపోతే ఈ సినిమా విషయానికి వస్తే కథ తెలిసిందే అయినప్పటికీ మార్షల్ ఆర్ట్స్ , మసాలా సన్నివేశాలు ఎక్కువగా జోడించి ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు.

రొమాంటిక్ సన్నివేశాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. కామెడీ వర్క్ అవుట్ కావడం సినిమాకు ప్లస్ అయ్యింది. కొన్ని సన్నివేశాలే బాగా బోర్ కొట్టించాయి. అవి కాస్త చూసుకుంటే బాగుండు. ఓవరాల్ గా యూత్ కు నచ్చే హిప్పీ.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review