‘ఇదం జగత్’ – థ్రిల్ మిస్ అయ్యింది.

స్టార్ కాస్ట్ : సుమంత్‌, అంజుకురియన్‌ తదితరులు..
దర్శకత్వం : అనిల్‌ శ్రీకాంతం
నిర్మాతలు: విరాట్‌ ఫిల్మ్స్‌, శ్రీ విఘ్నేష్‌కార్తీక్‌ సినిమాస్‌
మ్యూజిక్ : శ్రీచరణ్‌ పాకాల
విడుదల తేది :డిసెంబర్ 28, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

రివ్యూ : ‘ఇదం జగత్’ – థ్రిల్ మిస్ అయ్యింది.

విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న హీరో సుమంత్. ఈ మధ్యనే సుబ్రమణ్యపురం చిత్రం తో ప్రేక్షకులను అలరించిన ఈయన..తాజాగా ఓ వైవిధ్యమైన చిత్రం ‘ఇదం జగత్’ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయమవుతోంది. విరాట్ ఫిల్మ్స్ అండ్ శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై అనీల్ శ్రీ కంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంది…? సుమంత్ ఎలా ఆకట్టుకున్నాడు..? అసలు ఈ చిత్ర కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

ఏ పని దొరక్క ఖాళీగా రోడ్ల వెంట తిరుగుతున్న నిశిత్ (సుమంత్‌) కు నైట్ రిపోర్టర్ గా జాబ్ వస్తుంది. రాత్రి వేళలో జరిగే ప్ర‌మాదాల్ని, అక్రమాలను షూట్ చేసి ఛానల్ వారికీ ఇస్తుంటాడు. ఆలా జీవనం సాగిస్తున్న నిశిత్ లైఫ్ లోకి మ‌హ‌తి (అంజుకురియ‌న్‌) ఎంట్రీ ఇస్తుంది. ఆమెతో ఫ్రెండ్ షిప్ ఏర్పరచుకొని ఆమెకు దగ్గరవుతాడు.

ఓ రోజు అతడి దగ్గరున్న ఓ హత్య కు సంబందించిన వీడియో చూసి నిశిత్ కు దూరం అవుతుంది. మ‌హ‌తి దూరం కావడం తో నిశిత్ జీవితం మలుపు తిరుగుతుంది. ఇంతకీ ఆ వీడియో లో ఉన్న హత్య ఎవరిదీ..? దానిని చూసి మ‌హ‌తి ఎందుకు దూరం అవుతుంది..? ఆ హత్య కు , నిశిత్ సంబంధం ఏంటి..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* కథ

* సుమంత్ యాక్టింగ్

మైనస్ :

* ఆసక్తికర మలుపులు లేకపోవడం

* ఫస్ట్ హాఫ్

* క్వాలిటీ లేని విజువల్స్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ఎప్పటిలాగానే సుమంత్ తన నటన తో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో రెండు ర‌కాల షేడ్స్ చూపించి కాస్త కొత్తదనం నింపాడు.

* అంజుకురియ‌న్‌ మొదటి చిత్రం కావడం తో పెద్దగా హావభావాలు పలికించలేకపోయింది. చేసినంతలో ఓకే అనిపించింది. కాకపోతే గ్లామర్ పరంగా అంతగా మెప్పించలేకపోయింది.

* హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన సత్య అలాగే పోలీస్ ఆఫీసర్ గా నటించిన శివాజీ రాజా తమ పాత్రలకు న్యాయం చేశారు.

* నెగిటివ్ రోల్ లో నటించిన అర్జున్ రెడ్డి ఫేమ్ కళ్యాణ్ మంచి నటన కనబరిచాడు. తన నటన సినిమాకు ప్లస్ అయ్యింది.

* మిగతా పాత్రల్లో నటించిన వారంతా వారి వారి పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :

* శ్రీచరణ్‌ పాకాల అందించిన సంగీతం ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. పోనీ నేపధ్య సంగీతమైనా బాగుంటుందా అంటే అదీలేదు.

* బాల్ రెడ్డి ఛాయాగ్రహణం అంతంత మాత్రం గానే వుంది.

* గ్యారీ ఎడిటింగ్ పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ ఇంకాస్త ఇంట్రస్ట్ పెడితే బోర్ ఫీల్ అనేది పోయేది.

* జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌ నిర్మాణ విలువలు సాదా సీదాగా ఉండడంతో సినిమా స్క్రీన్ ఫై అవి కొట్టించినట్లు కనిపించాయి.

* ఇక డైరెక్టర్ అనిల్‌ శ్రీకాంతం విషయానికి వస్తే మొదటి సినిమానే కాబట్టి ఆయనపై పెద్దగా అంచనాలు పెట్టుకోలేం. ఆయన రాసుకున్న కథ బాగున్నప్పటికీ ,తెరపై చూపించడం లో తడబడ్డాడు. క‌థ‌లో వీలైన‌న్ని ఉత్కంఠ భ‌రిత‌మైన స‌న్నివేశాల్ని చూపించడం లో దర్శకుడు విఫలం అయ్యాడు. చాల సన్నివేశాల్లో లాజిక్ మిస్ అయ్యాడు.

హీరో – హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా సరిగా చూపించలేకపోయారు. క్లైమాక్స్ కూడా తేలిపోయింది. క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని ప్రచారం చేసినప్పటికీ , సినిమాలో మాత్రం థ్రిల్ కు గురి చేసే సన్నివేశాలు పడలేదు. ఓవరాల్ గా డైరెక్టర్ మొదటి ప్రయత్నం బాగానే ఉన్నప్పటికీ , దానిని చూపించడంలో సక్సెస్ కాలేకపోయాడు.

నోట్ :

సినిమాను థియేటర్స్ లలో చూడండి..పైరసీ చేసి సినిమా ఇండస్ట్రీని నాశనం చేయకండి. ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది కేవలం మన ఆనందం కోసమే..అలాంటి ఆనందాన్ని పైరసీ లో చూడకండి.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

Click here for English Review