రివ్యూ : ఇద్దరి లోకం ఒకటే – ఆకట్టుకొని లోకం

స్టార్ కాస్ట్ : రాజ్ తరుణ్ , షాలిని పాండే తదితరులు..
దర్శకత్వం : జి.ఆర్‌.కృష్ణ‌
నిర్మాతలు: దిల్ రాజు
మ్యూజిక్ : మిక్కీ
విడుదల తేది : డిసెంబర్ 25, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

రివ్యూ : ఇద్దరి లోకం ఒకటే – ఆకట్టుకొని లోకం

గత కొంతకాలంగా హిట్ అనేదిలేని రాజ్ తరుణ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో ‘ఇద్దరి లోకం ఒకటే’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జి.ఆర్‌.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ఈరోజు (డిసెంబర్ 25న ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన షాలినీ పాండే హీరోయిన్ గా నటించగా.. మిక్కీ జె.మేయర్‌ సంగీతం, సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ, అబ్బూరి రవి మాటలు సమకూర్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది…? కథ ఏంటి..? తరుణ్ కు హిట్ వచ్చిందా..లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

మ‌హి(రాజ్ త‌రుణ్‌), వ‌ర్ష‌(షాలిని పాండే) ఒకేరోజు ఊటీలోని హాస్పిట‌ల్‌లో జన్మిస్తారు. చిన్ననాటి స్నేహితులుగా పెరిగిన వీర‌ద్ద‌రూ త‌ర్వాత అనుకోకుండా విడిపోతారు. మళ్లీ 18 ఏళ్ల త‌ర్వాత కులుసుకుంటారు. మహి ఓ ప్రొఫెషనల్‌ ఫోటోగ్రాఫర్‌ గా గుర్తింపు తెచ్చుకుంటాడు. తాతా (నాజర్‌) కోరిక మేరకు వర్ష సినిమాల్లో హీరోయిన్‌గా నటించాలనే లక్ష్యంతో ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఈ దశలో మహితో వర్షకు పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత మహి వర్షను హీరోయిన్ గా చేస్తాడు.

చిన్న‌ప్ప‌టి నుండి ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న ప‌రిచ‌యం ప్రేమ‌గా మారే క్ర‌మంలో క‌థ‌లో అనుకోకుండా రాహుల్‌(రాజు సిరివెన్నెల) అనే వ్యక్తితో వర్ష పెళ్లికి రెడీ అవుతుంది. అసలు వర్ష ఎందుకు పెళ్లి కి ఒప్పుకుంటుంది..? మ‌హికి వ‌చ్చిన స‌మ‌స్య ఏమిటి..? ఇద్ద‌రు ప్రేమికులు ఎలా ఒక్క‌ట‌య్యారు..? అనేది సినిమా కథ.

ప్లస్ :

* రాజ్‌ తరుణ్‌, షాలినీ పాండేల యాక్టింగ్
* సినిమాటోగ్రఫీ

మైనస్ :

* కథ

* ఎడిటింగ్

* స్క్రీన్ ప్లే

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* రాజ్‌ తరుణ్‌ ఈ సినిమాలో చాల హొందగా నటించాడు. తన స్టైల్‌ హై సీన్స్‌ లేకుండా సెటిల్డ్‌ పర్మాఫెన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే రాజ్‌ తరుణ్‌కు ఉన్న ఇమేజ్‌ కారణంగా అక్కడక్కడ పాత్రకు సూట్‌ అవ్వలేదేమో అనిపిస్తుంది. రాజ్‌ తరుణ్‌ మార్క్‌ ఎనర్జీ ఈ క్యారెక్టర్‌లో మిస్‌ అయ్యింది.

* షాలిని పాండే గ్లామర్ తోనే యాక్టింగ్ తో ఆకట్టుకుంది.

* హీరోయిన్‌ తల్లిగా రోహిణి మరోసారి తనదైన పర్ఫామెన్స్‌తో కంటతడిపెట్టించింది. హీరో ఫ్రెండ్‌ పాత్రలో నటించిన భరత్‌ తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో పర్వాలేదనిపించాడు.

* నాజర్‌ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు.

* మిగతా వారంతా వారి వారి పరిధిలో నటించి మెప్పించారు.

సాంకేతిక విభాగం :

* స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ ఊటీ అందాలను తన కెమెరాలో అద్భుతంగా బంధించాడు. విజువల్‌కు తన కెమెరా కన్నుతో తెర రూపం ఇచ్చాడు. ఫ్రేమ్స్‌, లైటింగ్‌ సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చాయి.

* సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్‌ నిరాశపరిచాడు.

* ఎడిటింగ్‌ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.

* దిల్ రాజు నిర్మాణ వివరాలు బాగున్నాయి.

* జి.ఆర్‌.కృష్ణ ప్యూర్ లవ్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా చేయలేకపోయాడు. పుట్టకతోనే ఒకరికోసం ఒకరు అనే సెన్స్ తో పుట్టిన హీరో హీరోయిన్ల మధ్య ఆ రేంజ్ ప్రేమ సినిమాలో ఎక్కడా కనిపించదు. అలాగే ఆ ప్రేమకు సరైన సంఘర్షణ కూడా లేదు. సినిమా పూర్తిగా స్లో స్క్రీన్ ప్లేతో బోరింగ్ ట్రీట్మెంట్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఒక్క ఇంటర్వెల్ సీన్ మినహా మిగతా సన్నివేశాలు అన్నీ ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు అనుకున్నప్పటికీ ఎమోషన్ గాని, ఆ ఫీల్ గాని తీసుకరాలేకపోయాడు.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

Click here for English Review