రివ్యూ : జాగ్వార్‌ – ‘స్పీడ్ అందుకోలేదు’

టైటిల్ : ‘జాగ్వార్‌‘ (2016)
స్టార్ కాస్ట్ : నిఖిల్‌ గౌడ, దీప్తి, జగపతిబాబు, సంపత్‌రాజ్‌, బ్రహ్మానందం,రమ్యకృష్ణ, రావు రమేష్‌ తదితరులు..
డైరెక్టర్ : మహదేవ్‌
ప్రొడ్యూసర్స్ : అనితా కుమారస్వామి
మ్యూజిక్ : తమన్‌
విడుదల తేది : అక్టోబర్ 06, 2016
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

రివ్యూ : జాగ్వార్‌ – స్పీడ్ అందుకోలేదు

Jaguar-telugu-review

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూ టర్‌, ప్రముఖ నిర్మాత హెచ్‌.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మించిన చిత్రం ‘జాగ్వార్‌’.

జగపతి బాబు , రమ్య కృష్ణ లు ప్రధాన పాత్రలు చేయడం , మిల్కి బ్యూటీ తమన్నా ఐటెం సాంగ్ లో కనిపించడం , వీటి అన్నింటికంటే ‘బాహుబలి’ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించడం తో ఈ సినిమా ఫై అటు కన్నడ ప్రేక్షకులకు , ఇటు తెలుగు ప్రేక్షకులు సినిమా ఎలా ఉంటుందో అని ఆసక్తి పెంచుకున్నారు..మరి వారి ఆసక్తి కి జాగ్వార్‌ ఎలా సమాధానం చెప్పాడు..? 75 కోట్ల భారీ ఖర్చు పెట్టి ఈ సినిమాలో ఏం చూపించారు..? నిఖిల్‌కుమార్‌ ఎలా నటించాడు..? అనేది ఇప్పుడు చూద్దాం…

కథ :

కృష్ణ (నిఖిల్ కుమార్) మెడిసిన్ చదివే ఓ కుర్రాడు. పగలంతా తోటి ఫ్రెండ్స్ తో చదువుకుంటూ , వారితో తిరుగుతు ఎంజాయ్ చేస్తాడు..కానీ రాత్రి కాగానే ఓ ముసుగు ధరించి హత్యలు చేయడం , ఎస్‌.ఎస్‌. టీవీ ఛానల్‌ హ్యాక్ చేసి, ఆ ఛానల్ లో ఈ హత్యలు లైవ్ లో చూపించడం చేస్తాడు. దాంతో రాష్ట్రమంతా కలకలం రేగుతుంది. ఈ హత్యలు కృష్ణ ఎందుకు చేస్తున్నారు..అనేది తెలుసుకోవడానికి గవర్నమెంట్ ఓ సీబీఐ అధికారి (జగపతిబాబు)ని నియమిస్తుంది. జగపతి బాబు , కృష్ణ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడని ఎలా కనిపెడతాడు..? కృష్ణ , దీప్తి లు ఎలా కలుసుకుంటారు..? ఈ కథలోకి రమ్య కృష్ణ ఎలా ఎంట్రీ ఇస్తుంది అనేది మీరు తెర ఫై చూడాలి..

ప్లస్ :

* హీరో ఎంట్రీ సీన్స్ ..

* తమన్నా ఐటెం సాంగ్

* ఫైట్స్

మైనస్ :

* కథ

* సెకండ్ పార్ట్

* మ్యూజిక్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

తన మొదటి సినిమా అయినప్పటికీ పర్వాలేదు అనిపించాడు నిఖిల్ గౌడ. డ్యాన్సుల్లో, యాక్షన్ ఎపిసోడ్స్‌లో బాగా ఆకట్టుకున్నాడు. యాక్టింగ్ పరంగా ఇంకా చాలానే నేర్చుకోవాలి..ఇతడిని తెలుగు ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడానికి ఇంకాస్త సమయం పడుతుంది..ఇక సీబీఐ ఆఫీసర్ రోల్ లో జగపతి బాబు యాక్టింగ్ బాగున్నప్పటికీ అతడిని వాడుకోవడం లో డైరెక్టర్ విఫలం అయ్యాడు.

హీరోయిన్ దీప్తి కేవలం పాటలకు పరిమితం తప్ప , కథలో ఎలాంటి స్కోప్ లేకుండా పోయింది. రావు రమేష్ ఎప్పటిలాగానే తన పాత్రలో ఒదిగిపోయి నటించేశాడు. క్లైమాక్స్‌లో రమ్యకృష్ణ ఇచ్చిన అప్పీయరన్స్ బాగుంది. బ్రహ్మానందం కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాకపోగా బోర్ కొట్టించింది. ఆదిత్యమేనన్‌, అవినాష్‌ తదితరులు వారి పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

ముందుగా ఫొటోగ్రఫీ గురించి చెప్పుకోవాలి మనోజ్‌ హంస అందించిన సినిమా ఫొటోగ్రఫీ చిత్రానికి బాగా హెల్ప్ అయ్యింది..ప్రతి ఫ్రేమ్ లో వారు పెట్టిన ఖర్చు ను అందంగా చూపించాడు..ఇక యాక్షన్ సన్నివేశాలలో తన పనితనం ఆకట్టుకుంది. ఎప్పటిలాగానే తమన్ మరోసారి తన పాటలతో విసిగించాడు..తమన్నా ఐటెం సాంగ్ తప్ప మిగతా ఏ పాటలకు కూడా ప్రేక్షకులు థియేటర్స్ లలో లేరు. పాట వచ్చినంత సేపు గేమ్స్ ఆడుకుంటూ కూర్చున్నారు.

కథ విషయానికి వస్తే తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించిన బాహుబలి లాంటి చిత్రానికి కథ అందించిన విజయేంద్రప్రసాద్‌ , ఈ జాగ్వార్‌ కు కథ అందియడం, దాదాపు 75 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసాం అని ప్రచారం జరగడం తో సినిమా లో ఏముంటుందో..కథ ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తి గా థియేటర్స్ వైపు పరుగులు పెట్టారు..కానీ అసలు కథ ఏంటో సినిమా చూస్తే కానీ అర్ధం అవ్వలేదు..మనకు తెలిసిన కథ నే మళ్లీ రాసాడు తప్ప కొత్తగా ఏమి లేదు..కాకపోతే లైవ్ లో హత్య చేయడం అనేది కాస్త కొత్తగా అనిపిస్తుంది అంతే..ఫస్ట్ హాఫ్ అంత అటుఇటు గా సాగిపోయిన సెకండ్ హాఫ్ మాత్రం చాల బోర్ కొట్టించింది..

ఇక డైరెక్టర్ మహదేవ్ దగ్గరికి వస్తే తెలుగు లో బాలకృష్ణ తో మిత్రుడు అనే డిజాస్టర్ చిత్రాన్ని తీసిన ఘనత ఇతడిది..విజయేంద్ర ప్రసాద్ అందించిన కథకు డైరెక్టర్ స్క్రీన్‍ప్లే సాదాసీదాగా సాగిపోయింది. కథకు అనవసరమైన సీన్స్ ను జత చేస్తే మంచి కమర్షియల్ సినిమా ఆయె ఈ చిత్రాన్ని ఆలా వదిలేసాడు. సినిమా లో ఎక్కడ కూడా తన పనితనం చూపించలేకపోయాడు.. ‘జాగ్వార్‌’ ఎంట్రీ.. సీబీఐ ఆఫీసర్‌ ఎంట్రీ అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్న మిగతా కథ అంత సాగతీసే ప్రయత్నం చేసాడు.

చివరిగా :

మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన తనయుడి ని కథానాయకుడిగా గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని బాగానే అనుకున్నాడు..ఖర్చు కూడా బాగానే పెట్టాడు కానీ దానికి తగట్టే కథ , డైరెక్టర్ ను ఎంచుకుంటే బాగుండు..అసలు ఆ కథ కు అంతః ఖర్చు అవసరమా అని సాధారణ ప్రేక్షకుడికి సందేహం కలుగుతుంది.. టైటిల్ ‘జాగ్వార్‌’ పెట్టారు కానీ సినిమా లోని ఎక్కడ కూడా ఆ పరుగు కనిపించక పోగా చూసే జనాలకు నీరసం వచ్చేలా చేసింది..మొత్తానికి దసరా బరిలో ఏదో చేస్తాడు అనుకున్నడైరెక్టర్ , ప్రొడ్యూసర్లకు గట్టి దెబ్బ పడింది..ఓవరాల్ గా ‘జాగ్వార్‌’ – స్పీడ్ అందుకోలేదు .