రివ్యూ : థ్రిల్లింగ్ ‘కల్కి’

స్టార్ కాస్ట్ : రాజశేఖర్ , అదా శర్మ, నందితా శ్వేత తదితరులు..
దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
నిర్మాతలు: సి కళ్యాణ్
మ్యూజిక్ : శ్రవణ్ భరద్వాజ్
విడుదల తేది : జూన్ 28, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : థ్రిల్లింగ్ ‘కల్కి’

యాంగ్రీ స్టార్’ రాజశేఖర్ కథానాయకుడిగా శివాని శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై డైనమిక్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మించిన చిత్రం ‘కల్కి’. ‘అ!’ చిత్రంతో విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గరుడవేగా చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న రాజశేఖర్ ..కల్కి తో ఎలా ఆకట్టుకున్నాడు..? అసలు ఈ కథ ఏంటి..? ప్రశాంత్ కమర్షియల్ సక్సెస్ సాదించాడా..? లేదా..? అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

1980 నేపథ్యంలో సాగిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ఇది. రెండు ఊర్ల మధ్య జరుగుతున్న పగ..గొడవల మధ్య ఆ ఊర్ల ప్రజలు బిక్కు బిక్కు మంటూ బ్రతుకుంటుంటారు. ఆ ఊర్ల రాజులను ఎదురించలేక..తమకు జరిగియే అన్యాయం ఫై ఏదో ఒక రోజు ఒకడు వస్తాడు అంటూ ఎదురుచూస్తుంటారు. అదే సమయంలో కల్కి(రాజశేఖర్‌) ఆ ఉరుకు వస్తాడు..మరి ఆలా వచ్చిన కల్కి..ఆ ఊర్ల గొడవలను ఎలా ఆపుజేసాడు..? అసలు ఆ గొడవలకు కారణం ఏంటి..? కల్కి కి ఆ ఊర్లకు సంబంధం ఏంటి..? రెండు ఊర్ల మధ్య అసలు గొడవలు ఎందుకు వస్తాయి..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* స్క్రీన్ ప్లే

* బ్యాక్ గ్రౌండ్ స్కోర్

* క్లైమాక్స్

మైనస్ :

* స్లో నేరేషన్

* ఫస్ట్ హాఫ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* గురుడ వేగా సక్సెస్ తో మంచి ఊపు మీదున్న రాజశేఖర్..అదే ఊపును ఈ సినిమాలోనూ చూపించాడు. పోలీస్ అధికారి పాత్రలో ప్రాణం పోసాడు. తనదైన యాక్షన్ చూపించి మరోసారి అభిమానులను ఆకట్టుకున్నారు.

* అదా శర్మ రోల్ పెద్దగా ఏమిలేదు. కేవలం ఓ పాట లో మాత్రం ఆలా కనిపించింది.

* నందితా శ్వేత మరోసారి తన నటన ఎలా ఉంటుందో నిరూపించింది. కథలో ఎక్కువ పాత్ర తనదే కావడం తో తన యాక్టింగ్ అంత కనపరిచింది.

* ఎప్పుడు కామెడీ గా కనిపించే రాహుల్ రామకృష్ణ ..ఇందులో కాస్త సీరియస్ పాత్ర లో నటించాడు.

* నాజర్, అశుతోష్ రాణా, సిద్ధూ జొన్నలగడ్డ, శత్రు, చరణ్ దీప్, వేణుగోపాల్, ‘వెన్నెల’ రామారావు, డి.ఎస్.రావు, సతీష్ (బంటి) మొదలగు వారంతా వారి వారి పాత్రల్లో నటించారు.

సాంకేతిక విభాగం :

* దాశరథి శివేంద్ర సినిమా ఫొటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది .

* శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ కన్నా నేపధ్య సంగీతం ప్రాణం పోశారు. కథ కు తగ్గ బాక్గ్రౌండ్ తో ఆకట్టుకున్నారు.

* స్క్రిప్ట్ విల్లే స్క్రీన్ ప్లే హైలైట్ గా ఉంది..ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కథలో ట్విస్ట్ లతో థ్రిల్ చేసారు.

* సి కళ్యాణ్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ ప్రశాంత్ దగ్గరికి వస్తే ..ఇదొక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ. సీరియస్ స్టోరీలైన్‌కు కాస్త కామెడీని జోడించి ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. డిఫరెంట్ స్క్రీన్‌ప్లే, థ్రిల్లింగ్‌ ట్విస్ట్‌లతో మంచి కథా కథనాలను సిద్ధం చేసినప్పటికీ..కథ రెండున్నర గంటలకు సరిపడా కథ లేకపోవటంతో కథనాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు. కొన్ని సన్నివేశాల్లో అర్థంకాని స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను తికమకపెడుతుంది.

ముఖ్యంగా ఫస్ట్‌ హాఫ్‌లో చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగడం ప్రేక్షకులకు బోర్ కొట్టించాయి. హీరో హీరోయిన్ల ప్రేమకథ ఎందుకు పెట్టారో అర్ధం కాలేదు.సెకండ్ హాఫ్ లో మాత్రం థ్రిల్లింగ్‌ ట్విస్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. క్లైమాక్స్ మాత్రం థియేటర్ లో ఈలలు వేయించాయి. ఓవరాల్ గా చూస్తే ఫస్ట్ కాస్త నెమ్మదిగా సాగిన సెకండ్ హాఫ్ దానిని మరచిపోయేలా చేస్తుంది.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review