రివ్యూ : కాంచన 3 – రొటీన్ హర్రర్

స్టార్ కాస్ట్ : రాఘవ లారెన్స్‌, వేదిక‌, ఓవియా, నిక్కీ తంబోలి తదితరులు..
దర్శకత్వం : రాఘవ లారెన్స్‌
నిర్మాతలు: ఠాగూర్ మధు
మ్యూజిక్ : థమన్
విడుదల తేది : ఏప్రిల్ 19, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : కాంచన 3 – రొటీన్ హర్రర్

కాంచ‌న‌, కాంచ‌న‌-2 తో హార్ర‌ర్ కామెడీ చిత్రాలతో భారీ స‌క్స‌ెస్ తో పాటు ఒక ట్రెండ్ సృష్టించిన రాఘ‌వ లారెన్స్ హీరోగా, స్వీయ ద‌ర్శ‌కత్వం లో కాంచన సిరీస్ నుంచి వ‌స్తున్న హార్ర‌ర్ కామెడీ చిత్రం కాంచ‌న‌-3. మొదటి రెండు భాగాలూ సూపర్ హిట్స్ కావడం తో మూడో భాగం ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

భారీ అంచనాల మధ్య ఈరోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా…లేదా..? కాంచన 3 కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

రాఘ‌వ‌ (రాఘ‌వ‌లారెన్స్‌), అత‌ని త‌ల్లి (కోవై స‌ర‌ళ), వ‌దిన‌ (దివ్య ద‌ర్శిని), అన్న కూతురుతో కలిసి హ్యాపీ గా ఉంటారు. ఓ ఫంక్షన్ నిమిత్తం వారంతా కార్ లో వరంగల్ బయలుదేరతారు.మార్గమద్య లో ఓ చెట్టు దగ్గర ఆగి..ఆ చెట్టుకున్న మేకులు పీకేస్తారు..ఆ మేకులు వారున్న కారులో పడిపోతాయి. ఆ తర్వాత వారంతా ఆ ఫంక్షన్లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. రాఘవ త‌న మ‌ర‌ద‌ళ్లు (వేదిక‌, ఓవియా, నిక్కీ తంబోలి)ల‌తో సంతోషంగా ఆడిపాడుతుంటాడు.

రాత్రి కాగానే ఎవ‌రో తిరుగుతున్న‌ట్లు.. ఏడుస్తున్న‌ట్లు శ‌బ్దాలు వినిపిస్తుంటాయి. దాంతో ఇంట్లో వారు భ‌య‌ప‌డి అఘోరాను పిలిపిస్తారు. అత‌ను ఏవో పూజ‌లు చేసి దెయ్యం వెళ్లిపోయింద‌ని చెబుతాడు. కానీ ఓ దెయ్యం మాత్రం ఆ ఇంట్లోనే ఉంటుంది. ఆ ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తుంటుంది. దీంతో మరోసరి వేరే మాంత్రికుడి దగ్గరకు వెళ్తారు. ఆ ఇంట్లో జరిగే విషయాలు..సంఘటనలు అన్ని చెపుతారు. అది విన్న మాంత్రికుడు రాఘవ కుటుంబానికి ఏం చెపుతాడు..? అస‌లు కాళి ఎవ‌రు..? కాళికి రాఘవ కు సంబంధం ఏంటి..? రాఘవ ఇంట్లో ఉంది దెయ్యం ఎలా బయటకు వెళ్తుంది..? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* హర్రర్ కామెడీ

* రాఘవ యాక్టింగ్

మైనస్ :

* మ్యూజిక్

* రొటీన్ కథ

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* కాంచన , కాంచన 2 లలో ఎలాగైతే తన నటనతో ఆకట్టుకున్నాడో..అదే మాదిరిగా ఈ మూడో పార్ట్ లో కూడా అలాగే నటించి అలరించాడు. తనదైన కామెడీ…డాన్స్ , భయం తో ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాడు. ఇంత‌కు ముందు చిత్రాల్లో ముగ్గురు, న‌లుగురు ఆత్మ‌లున్న వ్య‌క్తిగా ఒకేసారి న‌టించిన లారెన్స్ ఈ సారి మాత్రం రెండు ఆత్మ‌లున్న శ‌రీరం ఎలా ఉంటుంద‌నే దాన్నే న‌ట‌న రూపంలో చూపించాడు.

* ఇక కామెడీ స‌న్నివేశాల్లో కోవై స‌ర‌ళ‌, దేవ‌ద‌ర్శిని, శ్రీమాన్ న‌ట‌న సూప‌ర్బ్‌గా ఉంది. ముఖ్యంగా దెయ్యం ఇంట్లో ఉందా? లేదా? అని క‌ని పెట్టే సన్నివేశాల్లో కామెడీ థియేటర్స్ లలో నవ్వులు పోయించింది.

* వేదిక‌, ఓవియా, నిక్కీ తంబోలి పేరుకు ఈ ముగ్గురున్న కూడా కేవలం పాటలకు మాత్రమే పరిమితం అయ్యారు.

* విలన్ రోల్ నటించిన క‌బీర్ దుహ‌న్ సింగ్‌ అదరగొట్టాడు.

* ఇక మిగతా పాత్రల్లో నటించిన వారు వారి వారి పరిధిలో నటించారు.

సాంకేతిక విభాగం :

* థమన్ మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మామూలుగానే ఉంది.

* స‌ర్వేష్ మురారి , వెట్రి ప‌ళ‌నిస్వామి కెమెరా వర్క్ సినిమాకు ప్రాణం పోశాయి.

* ఎడిటింగ్ విషయానికి వస్తే..ఫస్ట్ హాఫ్ బాగా స్లో గా సాగింది.

* రాజేష్ మాటలు యావరేజ్ గా పేలాయి

* ఇక డైరెక్షన్ విషయానికి వస్తే..డ్యాన్స‌ర్‌గా సినీ కెరియర్ మొదలు పెట్టిన లారెన్స్.. న‌టుడు, కొరియోగ్రాఫ‌ర్‌, నిర్మాత‌, ద‌ర్శ‌కుడు.. ఇలా ఓ రేంజ్‌కు ఎదిగాడు. కెరీర్ ప్రారంభంలో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసినా.. ఆ తర్వాత హార‌ర్‌కు కామెడీని మిక్స్ చేసి తెర‌కెక్కించిన ముని సినిమా పెద్ద స‌క్సెస్ అయ్యింది. అక్క‌డ నుండి ముని సిరీస్‌లో వ‌రుసగా కాంచ‌న‌ , గంగ‌(కాంచన 2) సినిమాల‌తో యాక్ట‌ర్‌గా, ద‌ర్శ‌కుడిగా స‌క్సెస్ అయ్యాడు. ఇప్పుడు అదే జాబితాలో కాంచన 3 గా వచ్చాడు.

కథలో కొత్తదనం ఏమి లేదు..కాంచన 2 లో అలాగైతే ఉందొ కాస్త దానినే అటు ఇటు మార్చి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ మంత్రిని చంప‌డ‌మే దెయ్యం ల‌క్ష్యంగా సాగుతుంది. చివ‌ర్లో దెయ్యానికి కూడా దేవుడి హెల్ప్ అవ‌స‌రం కావ‌డం.. దేవుడు స‌పోర్ట్ చేయ‌డంతో శ‌త్రువుల‌ను మట్టికల్పించడంతో సినిమా పూర్తి అవుతుంది. ఓవరాల్ గా గత సినిమాలను చూసిన ఫీలింగే కలుగుతుంది తప్ప..కొత్త గా చూసిన ఫీలింగ్ రాదు. అక్కడక్కడా రాఘవ ఓవర్ యాక్షన్..చిరాకు పెట్టించే పాటలు..ఇలా కాంచన 3 రొటీన్ కాంచన అనిపిస్తుంది.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review