రివ్యూ : ఖైదీ – థ్రిల్ చేసాడు..

స్టార్ కాస్ట్ : కార్తి , నరేన్ కుమార్ , హరీష్ ఉత్తమన్ తదితరులు..
దర్శకత్వం : లోకేష్ కనకరాజ్
నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రభు – రాధామోహన్
మ్యూజిక్ : సామ్ సి.ఎస్
విడుదల తేది : అక్టోబర్ 25, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : ఖైదీ – థ్రిల్ చేసాడు..

గత కొంతకాలంగా తమిళ్ హీరో కార్తీ నటించిన ఏ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోతున్నాయి. వరుస పెట్టి ప్లాప్స్ అవుతుండడం తో కార్తీ మార్కెట్ గా బాగా పడిపోయింది. కార్తీ సినిమా అంటే కొనేందుకు కూడా బయ్యర్లు వెనుకంజ వేస్తున్నారు. ఈ క్రమంలో కార్తీ నటించిన ఖైదీ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ చేస్తున్న ఈ ప్రయోగాత్మక చిత్రం దీపావళి కానుకగా ఈరోజు తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదల అయ్యింది.

ఈరోజే విజయ్ నటించిన బిజిల్ కూడా విడుదల అయ్యింది. తమిళనాట విజయ్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో తెలిసి కూడా ఖైదీ ని థియేటర్స్ లలో దింపి సాహసమే చేసారు. తెలుగు విషయానికి వస్తే విజయ్ కంటే ఎక్కువ కార్తీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటి వరాజై విజయ్ నటించిన ఏ చిత్రం కూడా తెలుగులో పెద్ద హిట్ కాలేదు కానీ కార్తీ నటించిన చాల సినిమాలు తెలుగులో మంచి ఆదరణ కనపరిచాయి. అందుకే కార్తీ నుండి వచ్చిన ఖైదీ కి ముందు నుండి అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలకు తగ్గట్లు సినిమా ఉందా..? అసలు ఖైదీ కథ ఏంటి..? కార్తీ ఖైదీ గా ఎందుకు మారాల్సి వస్తుంది..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

డిల్లీ బాబు (కార్తి) యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ ఖైదీ. పదేళ్ల శిక్ష పూర్తయ్యాక.. సత్ ప్రవర్తన కారణంగా ముందే బయటకు వస్తాడు. పోలీసులకు సంబందించిన వందల కోట్ల విలువైన మాదకద్రవ్యాల సరుకును దొంగలు కాజేస్తుండడం తో పోలీసులు బాబు సాయం తీసుకుంటారు. మరి బాబు వారికీ ఎలా సాయం చేస్తాడు..? దొంగలు కాజేసిన మాదకద్రవ్యాలను బాబు ఎలా కనిపెడతాడు..? బాబు ఫ్లాష్ బ్యాక్ ఏంటి..? అనేది సినిమా కథ.

ప్లస్ :

* కార్తీ

* డైరెక్షన్

* చిత్ర నిడివి

మైనస్ :

* సెకండ్ హాఫ్ స్లో

* కథ

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* కార్తీ నటన గురించి చెప్పాల్సిన పని లేదు..కాకపోతే ఈ సినిమాలో కన్నా కూతురిని చూసేందుకు తాపత్రపడే తండ్రి గా ఎంతో ఆకట్టుకున్నాడు.

* కార్తీ కూతురి గా నటించిన అమ్మాయి కూడా బాగా నటించింది.

* ఇక మిగతా నటీనటులంతా కొత్తవారు కావడం వారి తగ్గ పాత్రల్లో మెప్పించారు.

సాంకేతిక విభాగం :

* సామ్ సి.ఎస్ నేపథ్య సంగీతం ఎంతో బాగుంది. ప్రేక్షకుల్లో భావోద్వేగాల్ని రేకెత్తించడంలో కీలక పాత్ర పోషించింది.

* సత్యన్ సూర్యన్ ఛాయాగ్రహణం సినిమాకే హైలైట్ గా నిలిచింది. కథ మొత్తం పూర్తిగా రాత్రి పూట సాగడం తో ఛాయాగ్రాహకుడి కష్టం.. ప్రతిభ కనిపిస్తాయి.

* ఇలాంటి కథతో సినిమా చేయడానికి ముందుకొచ్చి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత ఎస్.ఆర్.ప్రభును అభినందించాలి.

* ఇక డైరెక్టర్ విషయానికి వస్తే..కథ పెద్దగా లేకపోయినప్పటికీ..రెండున్నర గంటలు ప్రేక్షకులను ఆసక్తిగా కుర్చోపెట్టాడు..ప్రతి ఫ్రెమ్ నెక్స్ట్ ఏం జరగబోతుందో అనే ఆత్రుత ను నింపాడు. ఎక్కడా బిగి సడలని రేసీ స్క్రీన్ ప్లే తో.. స్ట్రెయిట్ నరేషన్ తో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ స్లో అయ్యింది. క్లైమాక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా ఖైదీ ఎంతో థ్రిల్ కు గురిచేస్తాడు.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review