రివ్యూ: కవచం

సినిమా టైటిల్ : కవచం
తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజల్‌, మెహరీన్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌ తదితరులు
సంగీతం : తమన్‌
నిర్మాత : నవీన్‌ శొంఠినేని
దర్శకత్వం : శ్రీనివాస్‌ మామిళ్ల
రేటింగ్ : 2.5/ 5

”అల్లుడు శీను” సినిమాతో భారీ ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. అయితే ఆయనికి భారీ హిట్ పడింది మాత్రం’ జయ జానకి నాయక’ సినిమాతోనే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. మంచి వసూళ్లు తెచ్చి పెట్టింది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ చేసిన యాక్షన్ సన్నీవేషాలు ప్రేక్షులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత సహజంగానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌  కొత్త సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ‘కవచం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీనివాస్‌ మామిళ్ల దర్సకత్వం వహించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ కవచంలో ఏముందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి  వెళ్ళాల్సిందే.

కథ :
కవచం ఓ కిడ్నాప్ డ్రామా. అయితే దీనికి హైవోల్తేజ్ యాక్షన్ మిక్స్ , సస్పెన్స్ మిక్స్ చేశారు. కధలోకి వెళితే విజయ్‌ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌)  సబ్‌ ఇన్స్‌పెక్టర్‌. నిజాయితీ పరుడు. కాజల్‌తో ప్రేమలో పడతాడు. కానీ ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పే లోపే ఆ అమ్మాయికి పెళ్లి కుదరటంతో విజయ్‌కి దూరమవుతుంది. తరువాత ఓ ప్రమాదం నుంచి సంయుక్త(మెహరీన్‌) అనే అమ్మాయిని కాపాడతాడు విజయ్‌. ఆ తరువాతి రోజు విజయ్‌ తల్లికి యాక్సిడెంట్ కావటంతో సంయుక్త డబ్బు కోసం కిడ్నాప్‌ నాటకం ఆడదామని సలహా ఇస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్న విజయ్ కిడ్నాప్‌ చేసినట్టుగా సంయుక్త మామయ్యకు ఫోన్‌ చేసి యాబై లక్షలు తీసుకుంటాడు. కానీ ఆ మరుసటి రోజు సంయుక్త నిజంగానే కిడ్నాప్‌ అయ్యిందని, ఎస్‌ఐ విజయ్‌ కిడ్నాప్‌ చేశాడని మీడియాలో వస్తుంది. ఇక్కడితో కధ మలుపులు తిరుగుతుంది. నిజాయితీ పరుడు అయిన పోలీసు నిందితుడు కావాల్సివస్తుంది. ఐతే దిని వెనుక పెద్ద స్కెచ్ ఉటుంది. మరి అ స్కెచ్ ఏమిటి ? ఈ కిడ్నాప్ డ్రామా ఏమిటి ? సంయుక్త ఎవరు ? ఈ కేసు ను విజయ్ ఎలా చేదించాడు అనేద కధ.

విశ్లేషణ
యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకి ప్రధాన బలం ట్విస్ట్ లు. ఈ సినిమాలో ఆ ట్విస్ట్ లు అదిరిపోయాయి. పేపర్ వర్క్ చక్కగా చేసుకున్నాడు దర్శకుడు. ఎక్కడా లేగ్ లేకుండా సీన్ బై సీన్ ఆసక్తిని పెంచుకుంటు వెళ్ళాడు.

ఫస్ట్‌ హాఫ్‌లో కిడ్నాప్‌ సీన్‌, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఆకట్టుకుంటాయి. అయితే మొదటి సగంలో జరిగిన కొన్ని సన్నీవేషాలు కొంచెం సహనాన్ని పరీక్షిస్తాయి. సెకండ్‌ హాఫ్‌లో కథనం స్పీడందుకుంటుంది. క్లైమాక్స్‌ యాక్షన్‌ సూపర్ గా డిజైన్ చేశారు. కధలో ఒకొక్క మలపు చక్కగా తీర్చిదిద్దాడు. ఇలాంటి సినిమాలకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. యాక్షన్  కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా ఇంకా నచ్చుతుంది.

తొలిసగం కధలోకి ఎంటర్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు. ఐతే ఒక్కసారి కధలోకి వెళ్ళగానే సినిమా జోరు అందుకుంటుంది. సెకండ్ అఫ్ లో నడిచే మైండ్ గేమ్ కూడా ఆసక్తికరంగా ఉటుంది. సెకండ్ అఫ్ లో వచ్చే ట్విస్ట్లు ఈ సినిమాకి ప్రధాన బలం.

ఎవరెలా చేశారు :
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ యాక్షన్ ఎప్పటిలాగే ఆదరగొట్టాడు.యాక్షన్ సన్నీవేషాల్లో మంచి ఈజ్ కనబరిచాడు. ఐతే డైలాగ్ డేలివెరి దగ్గర ఇంకా మెరుగుపడాలి. కాజల్ అందంగా వుంది. ఆమె గ్లామర్ తగ్గలేదు. మెహరిన్ ది కీలక పాత్ర. కధను మలుపు తిప్పే పాత్ర. ఆమెకు కూడా చక్కని అభినయం కనబరిచింది.

టెక్నికల్ వాల్యూస్ :
పాటలకు పెద్ద అవకాశం లేదు. తమన్ నేపధ్య సంగీతం ఆకట్టుకుంతుంది.  సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్‌ సీన్స్‌లో కెమెరా పనితనం బాగుంది. మంచి నిర్మాణ విలువలు కనిపిస్తాయి.

ప్లస్‌ పాయింట్స్‌ ;
* కథలో మలుపులు
* యాక్షన్‌ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ ;
* ఫస్ట్‌ హాఫ్‌ సాగదీత
* అనవసరమైన పాటలు

ఫైనల్ టచ్ : కవచం.. యాక్షన్ ప్రియుల కోసం