రివ్యూ : రొటీన్ ‘లవర్ ‘

స్టార్ కాస్ట్ : రాజ్ త‌రుణ్‌, రిద్ధికుమార్, రాజీవ్ కనకాల తదితరులు..
దర్శకత్వం : అనీశ్ కృష్ణ‌
నిర్మాతలు: హ‌ర్షిత్ రెడ్డి
మ్యూజిక్ : అంకిత్ తివారి, అర్కో, రిషి రిచ్‌, అజ‌య్ వాస్‌, సాయి కార్తీక్‌, త‌నిష్క్ బాగ్చి
విడుదల తేది : జులై 20, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

రివ్యూ : రొటీన్ ‘లవర్ ‘

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా దిల్ రాజు కు ఎంతో పేరుంది..ఈయన బ్యానర్ నుండి ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు వచ్చి ప్రేక్షకులను అలరించాయి. అలాగే ఎంతో మంది కొత్త దర్శకులు ఈ బ్యానర్ ద్వారా పరిచయమై సక్సెస్ సాధించారు. దీంతో ఈయన బ్యానర్‌లో సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. తాజాగా ఆయన నిర్మించిన చిత్రం ‘లవర్’.

‘అలా ఎలా’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గత కొంతకాలం గా వరస ఫ్లాపులతో సతమతమవుతోన్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ మూవీ లో హీరో గా నటించాడు. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుంది..? రాజ్ తరుణ్ కు ఎంత ఉపయోగపడిందనేది..ఇప్పుడు చూద్దాం.

కథ :

రాజ్‌(రాజ్‌తరుణ్‌) ఓ బైక్ మెకానిక్..స్వంతగా గ్యారేజ్‌ నడుపుతూ తన ఫ్రెండ్స్ తో హ్యాపీగా గడుపుతుంటాడు. అన్నయ్య జగ్గూ (రాజీవ్‌ కనకాల) కి ఓ ప్రమాదం వస్తుంది. తనని కాపాడే ప్రయత్నంలో రాజ్‌ గాయపడతాడు. దీంతో గవర్నమెంట్‌ హాస్పిటల్‌ చేరతాడు. అక్కడ నర్స్ గా పనిచేసే చరిత (రిద్ధి కుమార్‌) ను చూసి ప్రేమలో పడతాడు. తన చేష్టలతో ఆమెను తన ప్రేమలో పడేస్తాడు. హాస్పిటల్‌ లో ఏ చిన్న తప్పు జరిగిన ఎదిరించి మాట్లాడే చరిత, లక్ష్మీ అనే అమ్మాయిని వరదరాజులు (శరత్‌ కేడ్కర్‌) నుండి కాపాడుతుంది.

దీంతో చరిత ను చంపాలనుకుంటాడు వరదరాజులు. ఈ క్రమం లో రాజ్ చరితను కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఇంతకీ వరదరాజులు..లక్ష్మి ని ఎందుకు చంపాలనుకున్నాడు..? అసలు ఎవరి ఈ లక్ష్మి..? చరిత కు లక్ష్మి కి సంబంధం ఏంటి..? అనే విషయాలు మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* సినిమా ఫొటోగ్రఫీ

* హీరో – హీరోయిన్ల యాకింగ్

* మ్యూజిక్

* నిర్మాణ విలువలు

మైనస్ :

* రొటీన్ కథ

* ఫస్ట్ హాఫ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* గత సినిమాలతో పోలిస్తే రాజ్ తరుణ్ ఈ మూవీ కోసం బాగానే కష్టపడ్డాడు అనిపిస్తుంది. ఇప్పటివరకు లవర్ పాత్రలోనే కనిపించిన రాజ్..ఇందులో కాస్త యాక్షన్ హీరోగా ట్రై చేసాడు. ప్రేమించిన అమ్మాయిని కాపాడుకునే ప్రేమికుడిగా రాజ్‌తరుణ్‌ ఈజ్‌తో ఎనర్జిటిక్‌గా నటించాడు.

* హీరోయిన్ రిద్ధి కుమార్‌కు మొదటి సినిమానైనా ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. తెర మీద అందంగా కనిపించడమే కాదు నటన పరంగా ఆకట్టుకుంది. అన్యాయాన్ని ఎదిరించే పాత్రలో చరిత పాత్రలో రిద్ధి కుమార్ బాగా నటించింది.

* జగ్గూబాయ్‌ పాత్ర రాజీవ్ కనకాల సెకండాఫ్‌లో కీలకంగా కనపడింది. ఈయన నటన గురించి
కొత్తగా చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. చాలా రోజుల తరువాత ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో కనిపించిన రాజీవ్‌ తనదైన ఎమోషనల్‌ పర్ఫామెన్స్‌ తో ఆకట్టుకున్నాడు.

* విలన్స్‌ గా అజయ్‌, సుబ్బరాజులు రొటీన్‌ పాత్రల్లో కనిపించారు. మెయిన్‌ విలన్‌గా నటించిన శరత్‌ కేడ్కర్‌ తెర మీద కనిపించేది కేవలం రెండు మూడు సీన్స్ లలోనే ఉంది.. అసలు ఈయనని అతిధి పాత్రే అని చెప్పాలి.

* ఇక హీరో ఫ్రెండ్స్‌గా నటించిన సత్య, ప్రవీణ్‌, సత్యం రాజేశ్‌ కామెడీ ట్రాక్‌ ప్రేక్షకులను నవ్వించేంత గొప్పగా లేదు. చాలా సినిమాల్లో కనపడే రొటీన్‌ కామెడీ ట్రాక్‌లానే ఉంది.

సాంకేతిక విభాగం :

* సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధానబలంగా మారింది. సెకండాఫ్‌లో కేరళ ఏపిసోడ్‌ను లాగకుండా సింపుల్‌గా తెరకెక్కించిన తీరు బావుంది.

* ఈ చిత్రానికి అంకిత్ తివారి, రిషి రిచ్‌, అర్కో, త‌నీశ్ బాగ్చి, సాయికార్తీక్‌ లు మ్యూజిక్ అందించారు. కానీ సినిమాలో మాత్రం రెండు , మూడు పాటలు మాత్రమే బాగున్నాయి. ‘నాలో చిలిపి కళ…’, ‘అంతే కదా మరి…’ అనే సాంగ్స్ ఆకట్టుకున్నాయి.

* జె.బి బ్యాక్ గ్రౌండ్ పర్వాలేదు అనిపించింది.

* ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ విషయం లో ఫస్ట్ హాఫ్ లో శ్రద్ద పెడితే బాగుండు.. ఫస్ట్ హాఫ్ లో వచ్చే సన్నివేశాలు చాల వరకు బోరు కొట్టించాయి. ఆ సన్నివేశాలకు కాస్త కత్తెరకు పనిచెపితే బాగుండు.

* విజ‌య్‌, వెంక‌ట్‌ ఫైట్స్ యావరేజ్ గానే ఉన్నాయి.

* హ‌ర్షిత్ రెడ్డి నిర్మాణ విలువలు బాగున్నాయి. కాకపోతే కాస్త కథలో కొత్తదనం ఉండేలా చూసుకుంటూ బాగుండు.

* ఇక డైరెక్టర్ అనీష్‌ కృష్ణ విషయానికి వస్తే..నాలుగేళ్ల విరామం తరువాత దర్శకుడిగా అనీష్‌ కృష్ణ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాకపోతే కొత్తదనం కథ ను కాకుండా రొటీన్‌ కథ కథనాలతో ప్రేక్షకుల ముందుకు రావడం అందర్నీ బాధ పెట్టింది.

ఫస్ట్‌ హాప్‌ ను కామెడీ, లవ్‌ స్టోరితో నడిపించిన దర్శకుడు అసలు కథ మొదలు పెట్టడానికి చాలా టైం తీసుకున్నాడు. కామెడీ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటం కాస్త నిరాశపరుస్తుంది.

చివరిగా :

ఈ లవర్-ప్రేక్షకులకు రొటీన్ లవర్ అనిపించుకున్నాడు.