రివ్యూ : మజిలీ – చక్కటి కుటుంబ కథ

స్టార్ కాస్ట్ : నాగ చైతన్య , సమంత , దివ్యాంశ కౌషిక్‌ తదితరులు..
దర్శకత్వం : శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
మ్యూజిక్ : గోపి సుందర్
విడుదల తేది : ఏప్రిల్ 05, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

రివ్యూ : మజిలీ – చక్కటి కుటుంబ కథ

‘ఏ మాయ చేసావే’ చిత్రంతో తెరపై బెస్ట్ కపుల్స్ అనిపించుకున్న నాగ చైతన్య-సమంతలు..నిజ జీవితంలో కూడా కపుల్స్ అయ్యారు. ‘ఏ మాయ చేసావే’ ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట.. పెళ్లి తరువాత మజిలీ చిత్రంతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

‘నిన్నుకోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించడంతో పాటు.. టీజర్‌, ట్రైలర్, సాంగ్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి కనపరుస్తున్నారు. మరి వారి ఆసక్తికి తగ్గట్లు సినిమా ఉందా..లేదా..? గత కొంతకాలంగా హిట్ లేని చైతు కు ఈ సినిమా ఎంతవరకు కలిసొచ్చింది..? నిన్ను కోరి తో హిట్ కొట్టిన శివ..మజిలీ తో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడు..? అసలు
ఈ సినిమా కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

పూర్ణ..మంచి క్రికెటర్ ఎలాగైనా రైల్వేస్‌ జట్లలో స్థానం సంపాదించాలని తెగ కష్టపడుతుంటాడు..ఈ నేపథ్యంలో పూర్ణ కు అన్షు (దివ్యాంశ కౌశిక్‌)తో ప్రేమ మొదలవుతుంది. కానీ వీరి ప్రేమకు పెద్దలు అడ్డు చెప్తారు. అయినాగానీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. ఈ నేపథ్యంలో అన్షును ఆమె తల్లిదండ్రులు దూరంగా తీసుకెళ్లిపోతారు. దీంతో పూర్ణ మద్యానికి బానిసవుతాడు.

కొడుకు ఆలా అవడం చూసిన పూర్ణ తల్లితండ్రులు..పెళ్లి చేస్తే మారతాడని భావించి.. శ్రావణి (సమంత)ని ఇచ్చి పెళ్లి చేస్తారు. కానీ ఏ రోజూ శ్రావణిని భార్యగా దగ్గరికి తీసుకోడు పూర్ణ. శ్రావణి మాత్రం తన భర్త ఏ రోజుకైనా మారతాడన్న నమ్మకంతో ఉంటుంది. మరి ఆ నమ్మకాన్ని పూర్ణ నిలబెట్టుకున్నాడా..? శ్రావణి ని భార్య గా అంగీకరిస్తాడా..లేదా..? తనలోని క్రికెటర్ ను బయటకు తీస్తాడా లేదా అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* సమంత – నాగ చైతన్య నటన

* స్క్రీన్ ప్లే

* డైలాగ్స్

మైనస్ :

* అక్కడక్కడా కాస్త స్లో అవ్వడం

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ఈ చిత్రానికి ప్రాణం పోసింది సమంత – చైతు లే అనిచెప్పాలి. ‘ఏ మాయ చేసావే’ చిత్రంలో బ్యూటిఫుల్ లవర్స్‌గా తెరపై రొమాన్స్ పండించిన వీరు..ఆ తర్వాత ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ వంటి చిత్రాలతో మెప్పించారు. రియల్ లైఫ్ లో భార్య భర్తలైన వీరు..రిల్ లైఫ్ లో కూడా భార్య భర్తలాగా ఎంతో చక్కగా నటించారు.

* ఇక నాగ చైతన్య విషయానికి వస్తే సినిమా సినిమాకు తనలోని నటనకు బయటకు తీస్తున్న చైతు..ఈ సినిమాలో రెండు విభిన్న కోణాలున్న పాత్రలో చాలా బాగా నటించాడు. ఫస్ట్‌ హాఫ్‌లో యువకుడిగా ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న చైతూ, సెకండ్‌ హాఫ్‌లో మధ్య వయసు వ్యక్తిగా సెటిల్డ్‌ పర్ఫామెన్స్‌తో మెప్పించాడు.

* సమంత సైతం భర్త మనసు తెలుసుకున్న భార్య గా ఎంతో అనుకువగా..ఓర్పుగా నటించి ఫుల్ మార్కులు వేసుకుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి.

* మోడల్ నుండి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఢిల్లీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్.. తెలుగులో ‘మజిలీ’ చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. అంతకు ముందు ఫెయిర్ అండ్ లవ్ లీ, హీరో హోండా బైక్ వాణిజ్య ప్రకటనల్లో మెరిసింది. మజిలీ చిత్రంలో ‘అన్షు’ పాత్ర ద్వారా నాగ చైతన్యకి గర్ల్ ఫ్రెండ్‌గా నటించింది. క్యూట్, అండ్ హాట్ పెర్ఫామెన్స్‌తో మెస్మరైజ్ చేసింది .

* ఇతర పాత్రల్లో రావూ రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, అతుల్‌ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం :

* ప్రేమ కథా చిత్రాలకు పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా చాల అవసరం. సీన్ పండాలన్నా.. ఎమోషన్స్ క్యారీ చేయాలన్నా సంగీతం కరెక్ట్ గా సెట్ కావాలి. నిన్నుకోరి, మజ్ను, గీతగోవిందం వంటి మ్యూజికల్ హిట్స్ అందించిన గోపీ సుందర్ ఈ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు.

ఇక చివరి నిమిషంలో గోపి సుందర్ ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ ఇవ్వలేకపోయినప్పటికీ..ఆ బాధ్యతను తీసుకున్న థమన్ తన టాలెంట్ అంత చూపించాడు. ఎమోషనల్ గా సాగిన కథకు చక్కటి బ్యాక్ గ్రౌండ్ ఇచ్చి థమన్ సక్సెస్ అయ్యాడు.

* విష్ణు శర్మ అందించిన సినిమా ఫొటోగ్రఫీ సినిమా హైలైట్స్ లలో ఒకటిగా నిలిచింది. సినిమా అంత ఎంతో అందంగా చూపించారు.

* ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా ఎక్క‌డా బోర్ కొట్టకుండా ప‌ర్ఫెక్ట్ కుదిరింది.

* ఇక నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి.

* ఇక స్క్రీన్ ప్లే – డైరెక్షన్- మాటలు ఇవన్నీ శివ చూసుకున్నాడు. ఏ దానిలో కూడా తక్కువ కాకుండా అన్ని సమానంగా చూసుకొని మరోసారి సక్సెస్ అయ్యాడు. నిన్ను కోరి చిత్రాన్ని ఎలాగైతే కమర్షియల్‌ హంగులకు పోకుండా తెరకెక్కించి సక్సెస్ సాధించాడో..ఈ చిత్రాన్ని కూడా అదే పద్దతిలో రియలిస్టిక్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. కథనం నిన్నుకోరి తరహాలోనే అనిపించినా ప్రేక్షకుడిని కట్టి పడేయటంలో మరోసారి సక్సెస్‌ అయ్యాడు.

ఫస్ట్ హాఫ్‌.. చైతూ, దివ్యాంశల మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలు, ఫ్రెండ్స్‌ తో కలిసి చైతూ చేసే అల్లరితో సరదాగా నడిపించిన శివ.. సెకం‍డ్‌ హాఫ్ అంతా ఎమోషనల్‌గా కథ నడిపించి సక్సెస్ అయ్యాడు. పెళ్లికి ముందు గుండెల్లో గుడిక‌ట్టుకున్న ప్రేయ‌సి, పెళ్లి త‌ర్వాత ఇంట్లో కొలువైన ఇల్లాలు.. వీరిద్ద‌రి మ‌ధ్య స‌త‌మ‌త‌మ‌య్యే యువకుడి మాన‌సిక సంఘ‌ర్ష‌ణగా ఈ సినిమాను రూపొందించాడు. ఓవరాల్ గా చాల రోజుల తర్వాత చైతు కు ఓ మంచి హిట్ పడిందనే చెప్పాలి.

తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

Click here for English Review