రివ్యూ : మన్మధుడు 2 – కాస్త శృతి మించాడు..

స్టార్ కాస్ట్ : నాగార్జున, రకుల్ , వెన్నెల కిషోర్ తదితరులు..
దర్శకత్వం : రాహుల్ రవీంద్ర
నిర్మాతలు: నాగార్జున
మ్యూజిక్ :చైతన్‌ భరద్వాజ
విడుదల తేది : ఆగస్టు 9, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : మన్మధుడు 2 – కాస్త శృతి మించాడు..

మన్మధుడు చిత్రానికి సీక్వెల్ గా మన్మధుడు 2 తెరకెక్కిన సంగతి తెలిసిందే. చిలసౌ చిత్రంతో డైరెక్టర్ గా మారిన రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి డైరెక్ట్ చేయగా..రకుల్ ప్రీతీ సింగ్ హీరోయిన్ గా నటించింది. సమంత , కీర్తి సురేష్ లు ముఖ్య పాత్రల్లో నటించడం..మన్మధుడు కు సీక్వెల్ గా తెరకెక్కడం తో ఈ మూవీ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని అంత ఫిక్స్ అయ్యారు.

మ‌నం ఎంట‌ర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వ‌యకామ్ 18 స్టూడియోస్ ప‌తాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్(జెమిని కిర‌ణ్‌) ఈ చిత్రాన్ని నిర్మించగా..లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఈ చిత్రం మన్మధుడు చిత్రానికి తగ్గట్లు ఉందా..సీక్వెల్ వర్క్ అవుట్ అయ్యిందా..రాహుల్ సక్సెస్ అందుకున్నాడా..నాగ్ చిత్రానికి టైటిల్ కు సెట్ అయ్యాడా..లేదా అనేది పూర్తీ రివ్యూ లో చూద్దాం.

కథ :

తను ప్రేమించిన అమ్మాయి దూరం కావటంతో సామ్ అలియాస్ సాంబశివరావు ( అక్కినేని నాగార్జున ) ప్లే బాయ్లా మారతాడు. ఏ అమ్మాయి కనిపిస్తే అమ్మాయి ని ఫ్లర్ట్ చేస్తూ హ్యాపీ గా గడుపుతుంటాడు. తన వయసు పెరిగిపోతుండటం తో త్వరగా పెళ్లి చేసుకోమని..పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతారు ఇంట్లో వారు. ఇక ఇంట్లో వాళ్ళ పోరు పడలేక..పెళ్లి సంబంధాలను చెడగొట్టలేక అవంతిక ( రకుల్ ప్రీత్ సింగ్ ) ను కొన్ని రోజుల పాటు తన గర్ల్ ఫ్రెండ్ గా నటించమని ఓ ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఈ ఒప్పందం కారణంగా సామ్ ఎలాంటి ఇబ్బందులు పడతాడు..? అసలు అవంతిక ఈ ఒప్పందం ఎందుకు ఒప్పుకోవాల్సి వస్తుంది..? ఒప్పందం మీద గర్ల్ ఫ్రెండ్ గా వచ్చిన అవంతిక నిజంగా సామ్ ను ఇష్టపడుతుందా..? లేదా..? అసలు కథ ఎలా సాగుతుంది..? అనేది మీరు వెండి తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* ఫస్ట్ హాఫ్

* కామెడీ

* నాగార్జున

మైనస్ :

* కథ

* సెకండ్ హాఫ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* 2002 లో మన్మధుడు చిత్రంలో ఎలాగైతే ఉన్నాడో..మన్మధుడు 2 కూడా అలాగే ఉన్నాడు. తన అందం ముందు రకుల్ తేలిపోయింది. రొమాంటిక్ సీన్లలలో నాగ్ చించేస్తాడనే సంగతి తెలిసిందే. ఈ మూవీ లోను రొమాంటిక్‌ సీన్స్‌లో వావ్ అనిపించాడు. కేవలం రొమాంటిక్ సీన్లలోనే కాదు ఎమోషనల్‌ సీన్స్‌లో కంటతడిపెట్టించాడు. నాగార్జున – రకుల్ ప్రీత్ సింగ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి
.

* రకుల్ ఈ చిత్రంలో అందాల ఆరబోత చేసి కనువిందు చేసింది. ఇండిపెండెంట్‌ అమ్మాయిగా కనిపిస్తూనే ప్రేమ, బాధ, కామెడీ ఇలా అన్ని ఎమోషన్స్‌ను పండించింది.

* వెన్నెల కిషోర్ మరోసారి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచేత్తాడు. సినిమా అంతా హీరో వెంటే కనిపించే పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు.

* ఇతర పాత్రలో లక్ష్మీ, ఝూన్సీ, దివ్య దర్శిని తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. అతిథి పాత్రల్లో కీర్తి సురేష్‌, సమంతలు తళుక్కుమన్నారు.

సాంకేతిక విభాగం :

* మన్మధుడు చిత్రానికి దేవి శ్రీ సంగీతం ప్రాణం పోస్తే..సెకండ్ పార్ట్ లో మాత్రం చైతన్ భరద్వాజ్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నేపథ్య సంగీతం మాత్రం పర్వాలేదు అనిపించింది.

* సుకుమార్ సినిమాటోగ్రఫి సినిమాకు ప్రాణం పోసింది. నాగార్జున ను మరింత గ్లామర్ గా చూపించి శభాష్ అనిపించారు.

* ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ఇక డైరెక్టర్ రాహుల్ విషయానికి వస్తే..ఫస్ట్ హాఫ్ అంత హ్యాపీ గా సరదాగా నడిపించిన ఈయన..సెకండ్ హాఫ్ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. బోరింగ్ సన్నివేశాలు..కథలో వేగం లేకపోవడం కాస్త నిరాశ తెప్పిస్తుంది. కథ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండు. నాగార్జున లోని కామెడీ యాంగిల్‌ను చాలా బాగా ఎలివేట్‌ చేశాడు. అక్కడక్కడ మసాలా డైలాగ్స్‌ కాస్త శ్రుతిమించినట్టుగా అనిపించినా కథలో భాగంగా ఓకే అనిపిస్తాయి. వెన్నెల కిషోర్ కామెడీ బాగా వర్క్ అయ్యింది. ఓవరాల్ గా మొదటి భాగం తో పోలిస్తే రెండో భాగం పెద్దగా వర్క్ అవుట్ చేయలేకపోయాడు.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review