రివ్యూ : మీకు మాత్రమే చెప్తా – కామెడీ మాత్రమే..

స్టార్ కాస్ట్ : తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్ తదితరులు..
దర్శకత్వం : షమీర్ సుల్తాన్
నిర్మాతలు: విజయ్ దేవరకొండ
మ్యూజిక్ : శివ‌కుమార్‌
విడుదల తేది : నవంబర్ 01, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : మీకు మాత్రమే చెప్తా – కామెడీ మాత్రమే..

క్రేజీ స్టార్ గా అతి తక్కువ టైంలోనే గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ..తాజాగా నిర్మాత గా మరి మీకు మాత్రమే చెప్తా అనే సినిమా నిర్మించాడు. ఈ చిత్రం లో తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తుండగా ..షమీర్ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నారు. అవంతికా మిశ్రా హీరోయిన్ కాగా అభినవ్ గోమటం, నవీన్ జార్జ్ థామస్, అనసూయ, వాణి భోజన్, పావని గంగిరెడ్డి కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది ..? విజయ్ నిర్మాతగా సక్సెస్ సాదించాడా..లేదా ..? హీరోగా తరుణ్ ఎలా మెప్పించాడు..? అనేది పూర్తీ రివ్యూ లో చూద్దాం.

కథ :

రాకేష్‌(త‌రుణ్ భాస్క‌ర్‌), కామేష్‌(అభిన‌వ్ గోమ‌టం) మంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి ఓ టీవీ ఛానల్ లో పనిచేస్తుంటారు. ఆ ఛానల్ టిఆర్పి రేటింగ్ కోసం రకరకాల వీడియోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హనీమూన్ అనే ఓ షో చేస్తారు..ఇది బయటకు రాకముందే రాకేష్‌ కు పెళ్లి సెట్ అవుతుంది.

త‌న భ‌ర్త సిగ‌రెట్స్‌, మందు, అమ్మాయిల‌కు దూరంగా ఉండాల‌ని అనుకుంటుంది. అయితే అన్ని అల‌వాట్లున్న రాకేష్.. ప్రేమ కోసం అబ‌ద్ధం చెబుతాడు. పెళ్లి తేది ఖ‌రార‌వుతుంది. అదే స‌మ‌యంలో రాకేష్ హనీమూన్ వీడియో బయటకొస్తుంది. ఆ వీడియో తో రాకేష్ ఎలాంటి కష్టాలు పడ్డాడు..? ఆ వీడియో లో ఏముంటుంది..? రాకేష్ పెళ్లి అవుతుందా కదా..? ఈ కథ కు సంయుక్త (అనసూయ ) కు సంబంధం ఏంటి..? అనేది అసలు కథ.

ప్లస్ :

* కామెడీ

* ఫస్ట్ హాఫ్

* తరుణ్ యాక్టింగ్

మైనస్ :

* సెకండ్ హాఫ్

* ప్రొడక్షన్ వాల్యూ

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచమైన తరుణ్ భాస్కర్..తనలో ఓ మంచి నటుడని ఈ సినిమాతో నిరూపించాడు. సహజమైన నటన తో అందరిని ఆకట్టుకున్నాడు.

* అభిన‌వ్ గోమ‌టం న‌ట‌న సినిమాకు ప్ల‌స్ అయ్యింది. త‌న‌దైన నటన తో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాడు.

* ట్రైలర్ లో అన‌సూయ ను చూసి సినిమాలో ఈమె పాత్ర ఓ రేంజ్ లో ఉంటుందని అంత అనుకున్నారు..కానీ సినిమా లో ఈమె రోల్ ఏమాత్రం లేదు..ఏదో అలా వచ్చి పోయేలా ఉంది అంతే.

* సేఫ్టీ గా వాణి..కామేష్ లవర్ గా పావని గంగిరెడ్డి పాత్రలు పర్వాలేదు అనిపించింది.

* ఇక మిగతా పాత్రల్లో నటించిన నటి నటులంతా ఒకే అనిపించారు.

సాంకేతిక విభాగం :

* మ‌ద‌న్ గుణ‌దేవా కెమెరా వ‌ర్క్‌ బావుంది.

* శివ‌కుమార్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా కథ కు తగ్గట్లు ఉంది.

* నిర్మాణ విలువలు మాత్రం పెద్దగా లేవు..తక్కువ బడ్జెట్ లో సినిమాను పూర్తి చేసాడు కానీ ఆ లోటు తెరపై కనిపించింది.

* డైరెక్టర్ షమీర్ విషయానికి వస్తే..కథ పెద్దగా లేకపోయినా సన్నివేశాల్లో కామెడీ జోడించి నడిపించాడు. ఫస్ట్ హాఫ్ అంత కూడా కామెడీ గా సాగింది. కాకపోతే సెకండ్ హాఫ్ బోరింగా..సాగదీసాడు. కథలో ట్విస్ట్ లు రాసుకోలేదు..క్లైమాక్స్ కాస్త బాగుంది. తరుణ్ లో ఓ నటుడు ఉన్నాడని నిరూపించాడు. సినిమా మొత్తం కూడా ఓ వీడియో పైనే నడిచేలా రాసుకున్నాడు. ఓవరాల్ గా గొప్ప సినిమా అనలేం కానీ జస్ట్ అలా టైం పాస్ కోసం చూడొచ్చు.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review