రివ్యూ : @నర్తనశాల

స్టార్ కాస్ట్ : నాగ‌శౌర్య‌, క‌శ్మీర ప‌ర‌దేశి, యామినీ భాస్క‌ర్‌ తదితరులు..
దర్శకత్వం : శ్రీనివాస్ చ‌క్ర‌వ‌ర్తి
నిర్మాతలు: ఐరా క్రియేష‌న్స్‌
మ్యూజిక్ : మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్
విడుదల తేది : ఆగస్టు 30, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2/5

రివ్యూ : @నర్తనశాల

ఊహలు గుసగుసలాడే సినిమాతో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న నాగ శౌర్య..ఆ తర్వాత వరుస సినిమాలతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక సొంత బ్యానర్ లో ఛలో సినిమా చేసి మరింతగా ఆకట్టుకున్నాడు.. ప్రస్తుతం @నర్తనశాల అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీనివాస్ చక్రవర్తి డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కింది. మరి ఛలో తో సూపర్ హిట్ అందుకున్న శౌర్య..ఈ మూవీ తో ఎలాంటి హిట్ అందుకున్నాడు..? అసలు నర్తనశాల కథ ఏంటి..? నాగ శౌర్య ఈ సినిమాలో ఎలాంటి రోల్ చేసాడు..? అది సినీ జనాలకు నచ్చుతుందా..లేదా..? అనేది చూద్దాం.

కథ :

కళామందిర్‌ కల్యాణ్ (శివాజీ రాజా)..ఆడ పిల్లలు అంటే ఎంతో ప్రాణం..ఎలాగైనా ఓ ఆడ పిల్లను కని తన తండ్రి చేతిలో పెట్టాలని అనుకుంటాడు. కానీ వారికి మ‌గ పిల్లాడు రాధకృష్ణ (నాగ‌శౌర్య‌) పుడ‌తాడు. హార్ట్ పేషెంట్ అయిన తండ్రి కోసం కొడుకును కూతురుగా పెంచుతాడు కళ్యాణ్. పెద్ద‌యిన త‌ర్వాత మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ ఇచ్చే విద్య‌ల్లో ట్ర‌యినింగ్ ఇస్తుంటాడు. ఈ నేపథ్యం లో ఓ రోజు స‌న్యాసి కావాల‌నుకునే అమ్మాయి మానస (కశ్మీర ప‌ర‌దేశి) ని ఓ ప్రమాదం నుండి రాధకృష్ణ కాపాడతాడు. దీంతో ఆమె రాధకృష్ణ ను ఇష్టపడుతుంది. రాధకృష్ణ సైతం మనసును ఇష్ట పడతాడు.

కానీ ఈ విషయం తెలియక జయప్రకాశ్‌ రెడ్డి కూతురు సత్య(యామిని భాస్కర్‌) ని రాధకృష్ణ కు ఇచ్చి పెళ్లి చేయాలనీ కళ్యాణ్ సంబంధం కుదుర్చుకుని వస్తాడు.. దీంతో ఏం చేయాలో తెలియక , ఎలాగైనా ఈ పెళ్లి నుండి తప్పించుకోవాలని తాను అసలు మగవాడిని కాదని , నేనో ‘గే’నని చెప్తాడు రాధాకృష్ణ..ఆ తర్వాత రాధాకృష్ణ ఎలాంటి కష్టాలు పడతాడు..? చివరకు ఎవర్ని పెళ్లి చేసుకుంటాడు..? అసలు ఈ కథ ఎటు వెళ్తుంది అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* నాగ శౌర్య ‘గే ‘ రోల్ చేయడం..

* మ్యూజిక్

* నిర్మాణ విలువలు

* అక్కడక్కడ కామెడీ

మైనస్ :

* బోర్ కొట్టించే సన్నివేశాలు

* కథా కథనాలు

* క్లైమాక్స్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ఇప్పటి వరకు లవర్‌బాయ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగశౌర్య తొలిసారి గే పాత్రను ఎంచుకోవడం హెలైట్ . సాధారణంగా ఇలాంటి పాత్రలను ఎంపిక చేసుకోవడానికి చాలా మంది ఆలోచిస్తారు. కానీ, నాగశౌర్య మాత్రం ఈ రోల్ ను సవాల్ గా తీసుకొని ఆకట్టుకున్నాడు. రెండు షేడ్స్ లలో శౌర్య కనిపించాడు. ఒక‌టి నార్మ‌ల్ క్యారెక్ట‌ర్ అయితే.. మరొక‌టి గే పాత్ర‌. ఈ రెండు పాత్రలకు న్యాయం చేసాడు. అయితే తన పూర్తి స్థాయిని ప్రూవ్ చేసుకునే సన్నివేశాలు దక్కలేదు.

* హీరోయిన్లు క‌శ్మీర ప‌ర‌దేశి, యామినీ భాస్క‌ర్‌ కేవలం పాటలకు మాత్రమే పరిమితం అయ్యారు తప్ప కథ తగ్గ రోల్స్ మాత్రం వీరికి దక్కలేదు.

* చాల రోజుల తర్వాత అజయ్‌ కు ఫుల్లెన్త్ రోల్ దక్కించింది. సెకండ్ హాఫ్ మొత్తం ఎక్కువగా ఈయనే కనిపిస్తారు. అజయ్ – నాగ శౌర్య మధ్య వచ్చే సన్నివేశాలు బాగా అలరిస్తాయి.

* శివాజి రాజా- జయ ప్రకాష్ రెడ్డి ఇద్దరి పాత్రలకు కూడా బాగున్నాయి. వారి రోల్స్ కు న్యాయం చేసారు.

* సత్యం రాజేశ్‌ కాస్త పర్వాలేదు అనిపించింది.

* సుధ‌, ప్రియ‌, జెమిని సురేష్‌, రాకేట్ రాఘ‌వ‌, రాఘ‌వ‌, ఉత్తేజ్‌, తిరుప‌తి ప్ర‌కాష్‌, ప‌ద్మ జ‌యంతి, మాధురి త‌దిత‌రులు..వారి వారి పాత్రల మేరకు బాగానే చేసారు.

సాంకేతిక విభాగం :

* మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కథ తగ్గట్లు ఉంది.

* విజ‌య్ సి.కుమార్‌ ఓకే

* కొట‌గిరి వెంక‌టేశ్వ‌రావు ఎడిటింగ్ లో లోపాలు కనిపించాయి. సెకండ్ హాఫ్ లో చాల సన్నివేశాలు బోరు కొట్టించాయి.

* నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ విషయానికి వస్తే తాను రాసుకున్న పాయింట్ బాగున్నప్పటికీ తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. ఫస్ట్‌హాఫ్‌లో హీరో హీరోయిన్ల లవ్‌ స్టోరి.. కొన్ని కామెడీ సీన్స్‌ ఆకట్టుకున్నా ద్వితీయార్థం మరింత రొటీన్‌గా అనిపిస్తుంది. కథనం ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సాగుతూ నిరాశపరుస్తుంది. గే ఎపిసోడ్‌ అంతా సెకండ్ హాఫ్ కే కేటాయించాడు. చాల సన్నివేశాలు బోర్ కొట్టించాయి. క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

చివరిగా :

నాగ శౌర్య ఎంచుకున్న రోల్ కొత్తదే అయినప్పటికీ , దానిని సరిగా ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ విఫలం అయ్యాడు. అలాగే కామెడీ కి స్కోప్ ఉన్నప్పటికీ దానిని వాడుకోలేక , నిరాశ పరిచారు. ఫస్ట్ హాఫ్ హీరో- హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ తో నడిపించి , సెకండ్ హాఫ్ మొత్తం గే పాత్ర కు సాగదీసాడు. ఓవరాల్ గా అనుకున్న విధంగా మాత్రం నర్తనశాల ఆకట్టుకోలేకపోయింది.

Click here for English Review