రివ్యూ : నీవెవరో

స్టార్ కాస్ట్ : ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్ తదితరులు..
దర్శకత్వం : హరినాధ్
నిర్మాతలు: కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌
మ్యూజిక్ : అచ్చు రాజమణి
విడుదల తేది : ఆగస్టు 24, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : నీవెవరో

ఒక `వి` చిత్రం తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది పినిశెట్టి .. గుండెల్లో గోదారి తో మంచి మార్కులు కొట్టేసాడు. ఆ తర్వాత సరైనోడు చిత్రంలో విలన్ గా నటించి యావత్ సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు ఆదిని పలకరించాయి. ఇక రంగస్థలం లో కుమార్ బాబు గా అద్భుతమైన నటన ను కనపరిచి ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించాడు. ఈ నేపథ్యంలో తాజాగా ‘నీవెవరో ‘ అంటూ మరోసారి హీరోగా నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికా సింగ్‌ హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రాన్ని కోన ఫిలిమ్‌ కార్పొరేషన్‌, ఎం.వి.వి.సినిమా పతాకాలపై హరినాథ్‌ డైరెక్ట్ చేసాడు. కోన వెంకట్‌, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. మరి ఈ సినిమా తో సోలో హీరోగా ఆది పినిశెట్టి హిట్ కొట్టాడా…? హరినాథ్‌ డైరెక్షన్ ఎలా ఉంది..? తాప్సి రోల్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

కళ్యాణ్ (ఆది), అను (రితికా సింగ్) చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. కళ్యాణ్ 15 ఏళ్ల వయసులో చూపు పోతుంది. అయినాగానీ బాధ పడకుండా తన లక్ష్యాన్ని ఛేదించాలని అనుకుంటాడు. ఆలా ఓ టాప్ రెస్టారెంట్‌కు ఓనర్ అవుతాడు‌. ఆ రెస్టారెంట్‌లో తానే మాస్టర్‌ చెఫ్ గా పనిచేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటాడు. ఇక జర్నలిస్ట్‌గా పని చేసే అను.. కళ్యాణ్‌ను ప్రేమిస్తుంది. ఓ రాత్రి వేళ రెస్టారెంట్‌కు వచ్చిన వెన్నెల (తాప్సీ) కళ్యాణ్‌ మనసులో స్థానం సంపాదిస్తుంది.

తన ప్రేమ విషయం వెన్నెలకు చెప్పాలనుకున్న సమయంలో వెన్నెల ఓ కష్టంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎలాగైనా వెన్నెల ను ఆ కష్టం నుండి బయటపడేయాలని అనుకుంటాడు. ఈ లోపు కళ్యాణ్ యాక్సిడెంట్ కు గురైవుతాడు. ఈ ప్రమాదం తర్వాత సర్జరీ ద్వారా కళ్యాణ్‌కు చూపు తిరిగి వస్తుంది. కానీ వెన్నెల కనిపించకుండా పోతుంది. వెన్నెల ఆచూకీని కళ్యాణ్ ఎలా కనుగొన్నాడు..? అసలు వెన్నెల కష్టాలు ఏంటి..? ఆ కష్టాలు తీర్చే సమయంలో వెన్నెల గురించి తెలిసిన నిజాలు ఏంటి..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* కథ

* ఆది – తాప్సి నటన

* తక్కువ బడ్జెట్

మైనస్ :

* సెకండ్ హాఫ్

* సాగదీత సన్నివేశాలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* సరైనోడు, నిన్నుకోరి, రంగస్థలం సినిమాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆది పినిశెట్టి …ఈ సినిమాలో చూపు లేని వ్యక్తి గా కళ్యాణ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ లో తనదయిన స్టయిల్ లో నటించి మరోసారి హీరోగా ఫుల్ మార్కులు వేసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంత చూపులేని వ్యక్తి గా , సెకండ్ హాఫ్ లో యాక్షన్ సన్నివేశాల్లో చాల స్టైలిష్ గా నటించాడు.

* ఇక వెన్నెల పాత్రలో నెగెటివ్‌ షేడ్స్‌ లో తాప్సీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమెదే కీలక పాత్ర. ఆది, తాప్సీ ఇద్దరూ పోటీ పడి నటించారు. సెకండాఫ్‌లో తాప్సీ యాక్టింగ్ ఈ సినిమాకు ప్రధాన బలం.

* గురు ఫేం రితికా సింగ్‌ ఈ మూవీ లో జర్నలిస్ట్‌గా చాల గ్లామర్ గా కనిపించి ఆకట్టుకుంది.

* కానిస్టేబుల్ చొక్కారావు పాత్రలో వెన్నెల కిషోర్ కామెడీ అదిరింది. ‘వీడ్ని స్కెచ్‌ వేసి చంపింది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్‌‌ ట్రంప్‌, నార్త్‌ కొరియా ప్రెసిడెంట్‌ కిమ్‌. కిమ్‌ అయినా.. ట్రంప్‌ అయినా లోపలేసి కుమ్ముతా’ అంటూ తనలోని హీరోయిజాన్ని వెన్నెల కిశోర్ చెప్పే తీరు నవ్వులు పూయిస్తుంది.

* ఇతర పాత్రల్లో శివాజీ రాజా, తులసి, సప్తగిరి, ఆదర్శ్‌, దీక్షిత్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :

* ముందుగా చిత్ర నిర్మాణం గురించి మాట్లాడుకోవాలి..తక్కువ బడ్జెట్లోనే సినిమాను రిచ్‌గా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు.

* సాయిశ్రీరామ్‌ కెమెరా వర్క్ బాగుంది.

* ప్ర‌వీణ్ పూడి ఎడిటింగ్ లో కాస్త లోపాలు కనిపించాయి..చాలా సన్నివేశాలు స్లో గా సాగడం తో ప్రేక్షకులకు బోర్ కొట్టించాయి.

* ప్రసన్‌, అచ్చు రాజమణి అందించిన పాటలు బాగున్నాయి. ముఖ్యంగా సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన వెన్నెలా.. పాట విజువల్‌గా ఆకట్టుకుంది.

* ఇక డైరెక్టర్ హరినాధ్ విషయానికి వస్తే..హరినాధ్ కథ బాగున్నా దానిని తెరకెక్కించడంలో విఫలం అయ్యాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథను చాలా వేగంగా నడపాలి..కానీ హరినాధ్ మాత్రం వేగం తగ్గించడం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. ఆది ఇమేజ్‌కు తగ్గట్టుగా కాస్త హీరోయిజం, యాక్షన్‌ యాడ్‌ చేశారు. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించటంలో విఫలం అయ్యాడు.

చివరిగా :

అబ్బాయిల బలహీనతే కొంతమంది ఎలా క్యాష్ చేసుకుంటున్నారో ఈ సినిమా ద్వారా హరినాధ్ చెప్పే ప్రయత్నం చేశారు. ఆది, తాప్సీ నటన, వెన్నెల కిశోర్ కామెడీ.. అన్నీ బాగున్నాయి. కానీ ఎక్కడో సినిమాలో వెలితి కనిపించింది. హీరో కంటే ముందే తాప్సి నిజస్వరూపం ప్రేక్షకులకు తెలియడం , సినిమా చివరి వరకు వచ్చే దాక హీరోకు తెలియక పోవడం ప్రేక్షకులకు విసుగు తెప్పించింది.

Click here for English Review