రివ్యూ : నోటా – పొలిటికల్ డ్రామా

స్టార్ కాస్ట్ : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ‌రీన్‌, స‌త్య‌రాజ్‌, నాజ‌ర్‌ తదితరులు..
దర్శకత్వం : ఆనంద్ శంకర్
నిర్మాతలు: కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా
మ్యూజిక్ : సి.ఎస్‌.శామ్‌
విడుదల తేది : అక్టోబర్ 05, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2.25/5

రివ్యూ : నోటా – పొలిటికల్ డ్రామా

పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో తన సత్తా చాటిన విజయ్ దేవరకొండ..తన మార్కెట్ ను సైతం పెంచుకున్నాడు. కేవలం మూడు సినిమాలతోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరి స్టార్ హీరో స్టేటస్ సంపాదించుకున్నాడు. ఈ మూడు సినిమాల తర్వాత విజయ్ నుండి వచ్చిన చిత్రం నోటా.

స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌ పై జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేయగా , మెహ్రిన్ హీరోయిన్ గా నటించింది . ఈరోజు( అక్టోబర్ 5 న ) ఈ చిత్రం విడుదల వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలయ్యింది. వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న విజయ్ కి ఈ నోటా ఏ మేరకు ఫలితాన్ని ఇచ్చింది..? ఈ నోటా కూడా తన హిట్ల జాబితాలో చేరిందా..? లేదా..? అసలు నోటా కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

సీఎం వాసుదేవన్ (నాజర్) ఓ సమస్య కారణంగా తన ముఖ్యమంత్రి పదవి కి రాజీనామా చేసి , తన పెద్ద కుమారుడు వరుణ్ (విజయ్ దేవరకొండ ) ను సీఎం కుర్చీలో కుర్చోపెడతాడు. అప్పటివరకు అసలు రాజకీయాలంటే తెలియని వరుణ్ ను సీఎం సీట్లో కూర్చుపెట్టేసరికి అందరూ షాక్ అవుతారు. వరుణ్ సైతం సీఎం అంటే ఎలా ఉండాలి..ప్రజల దృష్టిలో సీఎం స్థానం ఎలా ఉంటుంది..ప్రజలు ఎలా గౌరవిస్తారు లాంటి విషయాలేవీ తెలియదు. తన తండ్రి మాట కాదనలేక ఆ కుర్చీలో కూర్చుంటాడు. ఆలా సీఎం అయినా వరుణ్ కు అసలైన కష్టాలు మొదలవుతాయి. వాటిని ఎలా ఎదురుకోవాలో కూడా తెలియని పరిస్థితి లో ఉంటాడు.

ఈ నేపథ్యం లో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ మహేంద్ర (సత్యరాజ్) వరుణ్ కు సాయం చేస్తూ ఆ సమస్యల నుండి బయటపడేలా చేస్తాడు. ఆ తర్వాత వరుణ్ సీఎం గా ఎలా కొనసాగాడాడు.? ఎలాంటి కష్టాలు అనుభవించాడు..? వాటిని ఎదురుకున్నాడా..లేదా..? అసలు వాసుదేవన్ , వరుణ్ ను ఎందుకు సీఎం కుర్చీలో పెట్టడానికి కారణం ఏంటి ..? మొదలగు ప్రశ్నలకు సమాదానాలు కావాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* ఫస్ట్ హాఫ్

* విజయ్ దేవరకొండ

* స్టోరీ లైన్

మైనస్ :

* మ్యూజిక్

* కథనం

* బోరింగ్ సన్నివేశాలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ఇప్పటివరకు రౌడీ లవర్ బాయ్ గా ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంటూ వచ్చిన విజయ్ దేవరకొండ..ఈ నోటా లో స్టైలిష్ ముఖ్య మంత్రి గా ఆకట్టుకున్నాడు. ఓ పక్క పొలిటికల్ లీడర్ గా నటిస్తూనే , మరోపక్క ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేసాడు. వ‌ర‌ద‌ల స‌మయంలో యువ‌త‌ను ప్రేరేపించే స‌న్నివేశం.. ఎల‌క్ష‌న్స్‌లో ప్ర‌త్య‌ర్థులు త‌న‌పై వేసిన అభాండాన్ని తెలివిగా త‌ప్పించుకునే స‌న్నివేశం ఇలాంటి స‌న్నివేశాల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఓవరాల్ గా తన పాత్రకు న్యాయం చేసి మరోసారి తన సత్తా చాటుకున్నాడు.

* జనరలిస్ట్ పాత్రలో మెహ్రిన్ కనిపించింది కానీ ఆ పాత్ర కు సరిగా సెట్ కాలేదు. విజయ్ – మెహ్రిన్ మధ్య సన్నివేశాలు సైతం పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

* సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ మహేంద్ర పాత్రలో సత్యరాజ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. హీరోకు ప్రతీ విషయంలో సాయం చేసే పాత్రలో ఆయన ఒదిగిపోయారు.

* పార్టీ నాయకుడిగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నాజర్‌ నటన సినిమాకు హైలైట్ గా ఉంది.

* హీరోయిన్‌ యాషిక పాత్ర చాల చిన్నపాటిదే.

* ఇతర పాత్రల్లో నటించిన నటరాజన్‌, ప్రియదర్శి, ఎంఎస్‌ భాస్కర్‌ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు .

సాంకేతిక విభాగం :

* సి.ఎస్‌.శామ్‌ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నేపధ్య సంగీతం కాస్త పర్వాలేదు అనిపించింది.

* స‌ంతాన కృష్ణ‌న్‌, ర‌విచంద్ర‌న్‌ సినిమా ఫొటోగ్రఫీ సినిమాకు ప్రత్యేకంగా నిలిచి ఆకట్టున్నాయి.

* కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా నిర్మాణ విలువలు కథ తగినట్లే ఉన్నాయి.

* ఇక డైరెక్టర్ ఆనంద్ విషయానికి వస్తే..గతంలో ఈయన తెరకెక్కించిన సినిమాలు పెద్ద విజయాలు కానప్పటికీ ఆనంద్ చెప్పిన లైన్ నచ్చి ఈ సినిమాను విజయ్ చేయడం జరిగింది. స్టోరీ లైన్ బాగున్నప్పటికీ దానిని పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా తెరకెక్కించడం లో విఫలం అయ్యాడు.

ఫస్ట్ హాఫ్ హుషార్ గా నడిపించినప్పటికీ , సెకండ్ హాఫ్ మాత్రం చాల బోర్ కొట్టించాడు. ముఖ్యం గా తమిళనాట రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని కథ రాసినట్లు అనిపిస్తుంది. వ‌ర‌ద‌లతో న‌గ‌రం మునిగిపోయే సీన్‌లో .. గ‌తంలో చెన్నై న‌గ‌రం వర్షాల కార‌ణంగా ప‌డ్డ ఇబ్బందుల‌ను తెర‌పై చూపించారు. కొన్ని సన్నివేశాలకు మంచి డైలాగ్స్ రాసి ఆకట్టుకున్నాడు.

విజయ్ ను ప్లేబాయ్‌ల పరిచయం చేస్తూ సినిమాను మొదలు పెట్టి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వెంటనే వరుణ్ పాత్ర సీఎం కావటం తరువాత రాజకీయ పరిణామాలతో ఫస్ట్‌ హాఫ్‌ హ్యాపీగా అనిపించింది. విజయ్ నటన, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఇలా ఫస్ట్‌ హాఫ్ , సెకండ్ హాఫ్ ఆత్రుత కలిగించించేలా రాసుకున్నాడు. అయితే సెకండ్‌ హాఫ్‌ను అదే స్థాయిలో తెరకెక్కించటంలో ఆనంద్ విఫలం అయ్యాడు. సెకండ్ హాఫ్ కథనం నెమ్మదించటం ప్రేక్షకులను ఇబ్బంది పెట్టింది. క్లైమాక్స్ సైతం పెద్దగా ఆకట్టుకోలేకపోవడం వల్ల అభిమానులు , ఫ్యాన్స్ నిరాశకు గురైయ్యారు.

చివరిగా :

ఇప్పటివరకు లవర్ బాయ్ గా చూసిన విజయ్ ను సరికొత్త పొలిటికల్ లీడర్ గా చూసి ఎంజాయ్ చేయవచ్చు. విజయ్ డైలాగ్స్ , నటన ఇవన్నీ అభిమానులకు బాగా నచ్చుతాయి. కాకపోతే కథను నడిపించడంలోనే డైరెక్టర్ నిరాశ పరిచాడు.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.25/5

Click here for English Review