రివ్యూ : ఎన్టీఆర్ – కథానాయకుడు

స్టార్ కాస్ట్ : బాలకృష్ణ , విద్యాబాలన్ , సుమంత్ తదితరులు..
దర్శకత్వం : క్రిష్
నిర్మాతలు: నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
మ్యూజిక్ : కీరవాణి
విడుదల తేది : జనవరి 09, 2019

తెలుగోడి వాడిని వేడిని ప్రపంచానికి చాటిచెప్పిన స్వర్గీయ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ నిర్మించి, నటించిన ఈ సినిమాలో బసవతారకమ్మ పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటించారు. జాతీయ అవార్డు గ్రహీత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందించగా, సాయి మాధవ్ బుర్రా డైలాగ్‌లు రాశారు. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది..? అసలు క్రిష్ ఏం చూపించాడు..అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

స్వర్గీయ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి జీవితం చాలామంది తెలియదు..ఆయన ఎలా సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాడు..ఆలా ఎందుకు రావాల్సి వచ్చింది..ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన తర్వాత ఈయన ఎలా ఎదిగాడు..ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది ఈ చిత్రం లో చూపించారు. ఎన్టీఆర్ పాత్రల్లో బాలయ్య బాబు ఎలా నటించాడు..? బసవతారకమ్మ పాత్రలో విద్యా బాలన్ ఎంతవరకు ఆకట్టుకుంది..? ఎన్టీఆర్ సినీ జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు ఏంటి..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటన

* ఎన్టీఆర్ – బసవతారకం మధ్య వచ్చే సన్నివేశాలు

* క్రిష్ డైరెక్షన్

* దివిసీమ ఎపిసోడ్

మైనస్ :

* ఫస్ట్ హాఫ్

* నిడివి

* ఎన్టీఆర్ పాత్రలు వెంటవెంటనే రావడం

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ ప్రాణం పోసాడని చెప్పాలి. ఎన్నో గెటప్స్ లలో కనిపించి ఆకట్టుకున్నాడు. కృష్ణుడు, వెంక‌టేశ్వ‌ర‌స్వామి పాత్ర‌ల్లో బాల‌కృష్ణ అదరగొట్టాడు. కాకపోతే ఎన్టీఆర్ యువకుడి గెటప్ లోనే అంతగా ఆకట్టుకోలేకపోయాడు.

* ఇక బసవతారకం రోల్ లో నటించిన విద్యాబాలన్ ఆ పాత్రకు ప్రాణం పోసింది. సినిమా అంత కూడా ఆమె తోనే మొదలు కావడం తో ఆమె ఎంతో అద్భుతంగా నటించింది. ఎన్టీఆర్ – బసవతారకం మధ్య వచ్చే సన్నివేశాల్లో బాలకృష్ణ , విద్యాబాలన్ ఎంతో చక్కగా నటించి ఆకట్టుకున్నారు.

* అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గా నటించిన సుమంత్ ఆ పాత్రకు కరెక్ట్ గా సరిపోయాడు. కొన్ని కొన్ని సన్నివేశాల్లో నాగేశ్వ‌ర‌రావునే చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఎన్టీఆర్ – నాగేశ్వ‌ర‌రావు ల మధ్య సన్నివేశాలు సైతం ప్రేక్షకులను , అభిమానులను బాగా ఆకట్టుకుంటాయి.

* ఇక మిగతా నటి నటుల పాత్రలు ఆలా వచ్చి వెళ్లిపోతాయి..కాని ఆలా వచ్చి వెళ్లిన కానీ వారు సైతం తమ పాత్రలకు నాయ్యం చేసారు.

* ఇక చివర్లో చంద్రబాబు గా వచ్చిన రానా సెకండ్ పార్ట్ ఫై అంచనాలు పెంచాడు.

* సినిమాల్లో ఎంతమంది నటి నటులు , దర్శక , నిర్మాతలు కనిపిస్తారు..వారిందరని చూపించడంలో క్రిష్ విజయం సాధించాడు.

సాంకేతిక విభాగం :

* ఈ విషయంలో ముందుగా డైరెక్టర్ క్రిష్ నే మెచ్చుకోవాలి…కేవలం రెండు నెలల్లో ఎన్టీఆర్ బయోపిక్ కథ సిద్ధం చేయడం , ఆ బయోపిక్ లో ఎంతమంది నటి నటులను ఎంపిక చేయడం , వారికీ తగ్గట్లే పాత్రలు రాయడం అంటే మాములు విషయం కాదు. ముఖ్యం గా సినిమాలోని దివిసీమ ఎపిసోడ్, క్లైమాక్స్‌లో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించే సన్నివేశాలు క్రిష్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించి ఆకట్టుకున్నారు. అలాగే సెంటిమెంట్ సన్నివేశాలకు సైతం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు.

* ఎం.ఎం. కీర‌వాణి అందించిన పాట‌లు, నేప‌థ్య సంగీతం సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

* బుర్రా సాయిమాధ‌వ్ రాసిన మాటలు సినిమాకు ఆయువుప‌ట్టుగా నిలిచాయి. ప్ర‌తి స‌న్నివేశంలో ఒక మెరుపులాంటి సంభాష‌ణ ఉంటుంది. ఎన్టీఆర్ ఉద్యోగం కోసం వెళ్లిన‌ప్పుడు లంచం అడిగితే ఎవ‌డి ఇంటికి వాడు య‌జ‌మాని. లంచం తీసుకునేవాడి ఇంటికి ఎంత‌మంది య‌జ‌మానులు అనే డైలాగ్ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాయి. ఇలా ఇదొక్కటే కాదు ఇలాంటి డైలాగ్స్ సినిమాలో నిండుగా ఉన్నాయి.

* జ్ఞాన శేఖ‌ర్ సినిమాటోగ్ర‌ఫీ చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ప్ర‌తి ఫ్రేమూ చాలా అందంగా చూపించారు.

* ఇక నిర్మాణ విలువల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు…వారు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. సినిమాను ఎంతో రిచ్ గా నిర్మించారు.

చివరిగా :

సినిమా అంత కూడా ఓ రైతు బిడ్డ సినిమా ఇండస్ట్రీ లోకి ఎలా వచ్చాడు..ఎలా ఎదిగాడు..ఆ ఎదగడానికి తోడ్పడిన సంఘటనలు ఏంటి..ఓ పక్క సినిమా , మరోపక్క కుటుంబం ఈ రెండిటిని ఎన్టీఆర్ ఎలా చూసుకున్నాడు..ఎన్టీఆర్ విజయాల వెనుక బసవతారకం ఎలా నిలబడింది..చిత్ర పరిశ్రమ లో అత్యున్నత స్థానానికి ఎదిగిన ఎన్టీఆర్ , రాజకీయాల వైపు ఎందుకు వెళ్లాల్సిన వచ్చింది..ఇవ్వన్నీ కూడా ఎంతో చక్కగా చూపించి క్రిష్ విజయం సాధించాడు. కాకపోతే ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. అలాగే ఎన్టీఆర్ పాత్రలు సైతం ఎక్కువగా ఉండడం కాస్త నిరాశ పరిచింది. మిగతావన్నీ కూడా ఎంతో బాగున్నాయి.

నోట్ :

సినిమాను థియేటర్స్ లలో చూడండి..పైరసీ చేసి సినిమా ఇండస్ట్రీని నాశనం చేయకండి. ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది కేవలం మన ఆనందం కోసమే..అలాంటి ఆనందాన్ని పైరసీ లో చూడకండి.

Click here for English Review