రివ్యూ : ఓ పిట్టకథ – సస్పెన్స్‌ పిట్ట

స్టార్ కాస్ట్ : సంజయ్‌ రావ్‌, విశ్వంత్‌, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ తదితరులు..
దర్శకత్వం : చందు ముద్దు
నిర్మాతలు: ఆనంద్ ప్రసాద్
మ్యూజిక్ : ప్రవీణ్ లక్కరాజు
విడుదల తేది : మార్చి 06, 2020
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : ఓ పిట్టకథ – సస్పెన్స్‌ పిట్ట


గోపీచంద్ , బాలకృష్ణ లతో సినిమాలను నిర్మించిన భవ్య క్రియేషన్స్‌ తాజాగా ‘ఓ పిట్ట కథ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చందు ముద్దు ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయం అవ్వగా.. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజరురావు, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు ఈ మూవీ లో నటించారు. టాప్ స్టార్స్ తో ప్రమోషన్ చేయించడం తో సినిమా ఫై అందహరిలో ఆసక్తి పెరిగింది. మరి వారి ఆసక్తి తగ్గట్లు సినిమా ఉందా..లేదా..అసలు ఈ చిత్ర కథ ఏంటి..కథ కు పిట్ట కు సంబంధం ఏంటి..అసలు ఆ పిట్ట ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

కాకినాడలోని వెంకటలక్ష్మి థియేటర్‌ యజమాని వీర్రాజు..తన కూతురు వెంకటలక్ష్మి (నిత్యాశెట్టి) అంటే ఎంతో ఇష్టం. తల్లి లేని బిడ్డ అని చిన్నప్పట్నుంచి గారాబంగా పెంచుతాడు. అదే థియేటర్‌లో పనిచేసే ప్రభు (సంజయ్‌ రావ్‌)కు థియేటర్‌ అన్న వెంకటలక్ష్మి అన్న ఎంతో ఇష్టం. అయితే చైనా నుంచి వచ్చిన వీర్రాజు మేనల్లుడు క్రిష్ (విశ్వంత్‌) కూడా వెంకటలక్ష్మిని ప్రేమిస్తాడు. అయితే ఫ్రెండ్స్‌తో కలిసి అరకు వెళ్లిన వెంకటలక్ష్మి కిడ్నాప్‌కు గురవుతుంది.

దీంతో ఈ కేసును ఎస్సై బ్రహ్మాజీ టేకప్ చేసి..అస్లు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం మొదలుపెడతాడు. ముందుగా విశ్వంత్ – వెంకటలక్ష్మిల ప్రేమకథ వింటాడు. విశ్వంత్ వెళ్తూ వెళ్తూ ప్రభు (సంజయ్ రావ్) మీద తనకు అనుమానం ఉందని చెబుతాడు. ఇక ఎస్సై ప్రభును విచారించడం మొదలుపెట్టాక వెంకటలక్ష్మితో తనకు కూడా ప్రేమ కథ ఉందని తెలుసుకుంటాడు. ఆ కథ మొత్తం విన్నాక ఎస్సైకు కిడ్నాప్ కు సంబంధించిన క్లూ దొరుకుతుంది. మరి ఆ క్లూ ఏంటి ..? అసలు వెంకటలక్ష్మి ని ఎవరు కిడ్నాప్‌ చేస్తారు..? ఎలా బయటపడుతుంది..? ఆమె ఎవర్ని ప్రేమిస్తుంది అనేది సినిమా కథ.

ప్లస్ :

* సంజయ్‌, విశ్వాంత్‌ల యాక్టింగ్

* స్క్రీన్‌ ప్లే

* నిత్యాశెట్టి గ్లామర్

* మ్యూజిక్

మైనస్ :

* స్లో నేరేషన్

* పోలీస్‌ స్టేషన్‌ సీన్లు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* విశ్వంత్ నటుడిగా ఇప్పటికే పలు సినిమాలు చేసాడు. ఈ చిత్రంలో కూడా అతనికి పలు వేరియేషన్స్ చూపించగలిగే పాత్ర వచ్చింది. నటుడిగా మంచి మార్కులే కొట్టేసాడు.

* నిత్యా శెట్టి గ్లామర్ పరంగానే కాదు యాక్టింగ్ పరంగా కూడా మంచి మార్కులు వేసుకుంది.

* సంజయ్ రావ్ కు ఇది మొదటి సినిమానే అయినా మెప్పించాడు. ఇంకా ఎమోషన్స్ పండించే విషయంలో మెరుగవ్వాల్సి ఉన్నా తొలి సినిమా కాబట్టి డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినట్లే.

* బ్రహ్మాజీకి ఎస్సైగా కీలక పాత్ర పడింది. అవలీలగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు.

* ఇక పండు పాత్ర విశేషంగా ఆకట్టుకుంటుంది. తనతో పండించిన కామెడీ సినిమాకే హైలైట్. ఇతరులు మాములే.

* మిగతా తారగణం వారి పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :

* ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ , నేపధ్య సంగీతం ఆకట్టుకుంది.

* సినిమాటోగ్రఫీ హైలైట్ గా ఉంది .

* డైలాగ్స్ ఓకే. స్క్రీన్ ప్లే బాగున్నాయి

* ఎడిటింగ్ లో లోపాలు ఉన్నాయి. వాటిని చూసుకుంటే బాగుండు.

ఫైనల్ :

చందు ముద్దు దర్శకత్వం పరంగా మంచి మార్కులే వేయించుకున్నాడు. హీరోహీరోయిన్ల ఎంట్రీ, లవ్‌ సీన్స్‌, అక్కడక్కడా నవ్వించే కామెడీతో ఫస్టాఫ్‌ అంతా సాదా సీదాగా నడిపించిన..సెకండ్ హాఫ్ అద్యంతం ఆసక్తిగా, ఆశ్చర్యంగా, అసలేం ఏం జరుగుతుంది అనే కన్ఫ్యూజన్‌ గా ఉంది. అనుభవం లేని యువ డైరెక్టర్‌ చెందు ముద్దు పక్కా స్క్రీన్‌ ప్లే మ్యాజిక్‌తో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఎక్కడా సస్పెన్స్‌ రివీల్‌ చేయకుండా క్లైమాక్స్‌ వరకు ప్రేక్షకుడికి డిఫరెంట్‌ థ్రిల్‌ను కలిగించాడు. కాకపోతే సినిమా కాస్త స్లో గా సాగుతుంది. అలాగే పోలీస్ స్టేషన్ సన్నివేశాలు కూడా కాస్త బోర్ గా ఉన్నాయి. ఆ రెండిటి మీద ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review