రివ్యూ : ఓ బేబీ – శభాష్ బేబీ

స్టార్ కాస్ట్ : సమంత, లక్ష్మీ, నాగశౌర్య, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు..
దర్శకత్వం : నందిని రెడ్డి
నిర్మాతలు: సురేష్ బాబు
మ్యూజిక్ : మిక్కీ
విడుదల తేది : జులై 05 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3.5/5

రివ్యూ : ఓ బేబీ – శభాష్ బేబీ

క్రేజీ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి డైరెక్ట్ చేసిన చిత్రం ‘ఓ బేబీ’. దక్షిణ కొరియా బ్లాక్ బస్టర్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీ ని సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై సురేష్ బాబు దగ్గుబాటి, సునీత తాటి, టీజీ విశ్వప్రసాద్, హ్యున్యూ థామస్ కిమ్ సంయుక్తంగా నిర్మించారు.

రాజేంద్ర ప్రసాద్, లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, తేజ, అడివి శేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ
ఈరోజు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్స్ , పోస్టర్స్ , స్టిల్స్ , మేకింగ్ లతో ఆకట్టుకున్న ఈ మూవీ థియేటర్ లో ఈమేరకు ఆకట్టుకుంది..? ఒక వయసు మళ్ళిన భామ..యుక్తవయసు అమ్మాయిగా ఎలా మారుతుంది..? ఎందుకు మారాల్సి వస్తుంది..? ఈ పాత్రలో సమంత ఎలా నటించింది..? నందిని రెడ్డి డైరెక్షన్ ఎలా ఉందనేది..పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

సావిత్రి అలియాస్ బేబి (లక్ష్మీ) కి కాస్త చాదస్తం ఎక్కువ..ఆమె చాదస్తం మూలంగా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతుంటారు. ఎంతకాలం ఈ ఇబ్బంది అని ఆమెను ఓ వృద్దాశ్రమంలో వేస్తారు. ఆలా వృద్దాశ్రమంలో మనస్థాపానికి గురి అవుతుంది. తన యవ్వనం తిరిగి వస్తే బాగుండు..యవ్వనం లో చేయాల్సిన వాన్ని చేస్తే ఎంత బాగుండో..ఒక్కసారి ఆ యవ్వన వయసు ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటుంది. ఆమె కోరిక దేవుడు తిరిగిస్తాడు. అలా తిరిగి పడుచు పిల్లగా మారుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? యవ్వన వయసు లో ఏం చేస్తుంది..? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

ప్లస్ :

* స్టోరీ

* స్క్రీన్ ప్లే – డైరెక్షన్

* సమంత

మైనస్ :

* పెద్దగా ఏమీలేవు..జస్ట్ అక్కడక్కడా కాస్త స్లో అయినట్లు అనిపిస్తుంది

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* సినిమా హైలైట్ అంటే సమంత అనే చెప్పాలి..ఇప్పటికే ఆమె యాక్టింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే..కానీ ఈ సినిమా చూసినా తర్వాత స్టార్ హీరో కూడా ఈమె నటన ముందు తక్కువే అని అనకుండా ఉండలేరు. ఎమోషనల్ , లవ్ , కామెడీ ఇలా ప్రతి యాంగిల్ లో సామ్ తన సత్తా చాటుకుంది.

* సావిత్రి గా బేబీ గా లక్ష్మి తన నటనతో ఆకట్టుకుంది.

* చంటి ఆ రాజేంద్ర ప్రసాద్ తన నట విశ్వరూపాన్ని కనపరిచాడు. బేబీ ఫ్రెండ్ గా ఈయన రోల్ ఆకట్టుకుంది. సమంత – ఈయన మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

* బేబీ కొడుకు పాత్ర లో రావూ రమేష్‌ ఆకట్టుకున్నారు.

* నాగశౌర్యకు పెద్దగా నటనకు అవకాశం లేకపోయినా ఉన్నంతలో తనవంతుగా మెప్పించాడు.

* బాలనటుడుగా సుపరిచితుడైన తేజ ఈ సినిమాతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చాడు.

* అతిథి పాత్రల్లో జగపతి బాబు, అడవి శేష్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

* ఇక మిగిలిన నటి నటులంతా వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

సాంకేతిక విభాగం :

* మిక్కీ జే మేయర్‌ మరోసారి ఆకట్టుకున్నాడు..పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథకు తగ్గట్లు ఇచ్చి తన టాలెంట్ చూపించారు.

* రిచర్డ్ ప్రసాద్ కెమెరాపనితం ఆకట్టుకుంది. ప్రతీ ఫ్రేమ్‌ను కలర్‌ఫుల్‌గా చూపించటంలో సినిమాటోగ్రాఫర్‌ విజయం సాధించారు.

* ఎడిటింగ్ కూడా బాగుంది..ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా సాగింది. సెకండ్ హాఫ్ లో కాస్త అక్కడక్కడా స్లో అయినట్లు అనిపిస్తుంది కానీ అది పెద్దగా ఇబ్బంది పెట్టదు.

* నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ నందిని రెడ్డి విషయానికి వస్తే.. కొరియన్ చిత్రానికి రీమేక్ అయినప్పటికీ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దీనిని మార్చేశారు. పక్కా ఎంటర్టైనర్ గా సినిమాను తీర్చిదిద్దారు. వయసులో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయామో..వయసు మళ్ళిన సమయంలో ఆలా చేస్తే బాగుండు..ఇలా చేస్తే బాగుండు అని ప్రతి ఒక్కరు అనుకుంటారు. మరోసారి ఆ వయసు వస్తే ఎంత బాగుండో అని కోరుకుంటారు. కానీ అది జరగదు..కాకపోతే ఈ సినిమాలో ఆలా జరుగుతుంది..పూర్వ వయసు వచ్చాక తన కోర్కెలను ఎలా తీర్చుకుందనేది నందిని రెడ్డి ఏంతో చక్కగా తెరకెక్కించారు. కామెడీ , ఎమోషనల్ , లవ్ ఇలా ప్రతి సన్నివేశాన్ని హృదయానికి అత్తుకునేలా తెరకెక్కించారు.

ఫస్ట్ హాఫ్‌ అంత కామెడీ గా సాఫీగా నడిపించి..అప్పుడే ఇంటర్వెలా అనిపించేలా నడిపించింది. సెకండ్ హాఫ్ లో కాస్త కామెడీ తగ్గించి ఎమోషనల్‌ సీన్స్‌తో నడిపించారు. క్లైమాక్స్ కాస్త బాగాలేదని రిలీజ్ కు ముందు ప్రచారం సాగింది కానీ క్లైమాక్స్ హైలైట్ గా నిలిచింది. ఓవరాల్ గా నందిని మరోసారి తన మార్క్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకుంది.

తెలుగు మిర్చి రేటింగ్ : 3.5/5

Click here for English Review