రివ్యూ : ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ – ఆపరేషన్‌ దెబ్బకొట్టింది

స్టార్ కాస్ట్ : ఆది సాయి కుమార్‌, అబ్బూరి రవి, శ‌షా చెట్రి తదితరులు..
దర్శకత్వం : సాయికిరణ్‌ అడివి
నిర్మాతలు: వినాయకుడు టాకీస్
మ్యూజిక్ : శ్రీచరణ్ పాకాల
విడుదల తేది : అక్టోబర్ 18, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ – ఆపరేషన్‌ దెబ్బకొట్టింది

ప్రేమకావాలి , లవ్లీ మూవీలతో సూపర్ హిట్స్ తో కెరియర్ మొదలు పెట్టిన సాయి కుమార్ తనయుడు ఆది..మొదటి రెండు సినిమాలు హిట్లయినప్పటికీ ఆ తర్వాత మాత్రం వరుస అపజేయలు ఎదురువుతున్నాయి. రీమేక్ కథలు చేసిన..స్ట్రయిట్ సినిమాలు చేసిన హిట్ మాత్రం మనోడి తలుపు తట్టడం లేదు. కొన్ని రోజుల క్రితం ‘బుర్ర కథ’ అంటూ ఓ ప్రయోగం చేసాడు. కానీ ఆ కూడా డిజాస్టర్ గా నిలిచింది.

ఇప్పటివరకు ఆది పదమూడు సినిమాలు చేసినప్పటికీ అందులో తొమ్మిది ఫ్లాపులే.. రెండు మాత్రమే హిట్లు. రీసెంట్ గా ‘జోడి’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పరిచాడు. ఈ సినిమా మొదటి షో కే రొటీన్ కంటెంట్ అంటూ టాక్ వచ్చేసింది. దీంతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర డీలా పడ్డాడు ఆది. తాజాగా ఆది ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘వినాయకుడు’ ఫేం సాయి కుమార్ అడివి డైరెక్ట్ చేసాడు. మరి ఈ సినిమాతోనైనా ఆది హిట్ కొట్టాడా..? అసలు ఈ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లో ఏముంది..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

కశ్మీర్‌ పండిట్‌లు కాశ్మీర్ నుండి పంపించేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని పాకిస్థాన్ ప్లాన్ చేస్తుంది. వారిపై దాడులు చేసి అక్కడి నుండి పంపేయాలని ఘాజీబాబా (అబ్బూరి రవి) స్కెచ్ వేసి ఆయన నేతృత్వంలో దాడులు చేస్తారు. కొంతకాలం తర్వాత ఘాజీబాబా హైదరాబాద్ కు వస్తాడు. ఇది తెలుసుకున్న ఎన్.ఎస్.జి కమాండో కెప్టెన్‌ అర్జున్‌ (ఆది‌‌) పక్కా వ్యూహంతో అతడిని అరెస్ట్‌ చేస్తాడు. ఆ తర్వాతకోర్టు ఘాజీబాబా కు ఉరిశిక్ష ఖరారు చేస్తుంది. ఇది తెలుసుకున్న ఘాజీబాబా ముఖ్య అనుచరుడు ఫరూఖ్‌ (మనోజ్‌ నందం) ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ ప్రారంభిస్తాడు.

అందులో భాగంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఏకే శర్మ (రావు రమేశ్‌) కూతురు నిత్యను కిడ్నాప్‌ చేసి భారత ప్రభుత్వాన్ని బెదిరించాలనేది ఫరూఖ్‌ ప్లాన్‌..మరి ఆ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యిందా..? ఘాజీబాబా ను ఉరి తీస్తారా..? అసలు ఈ ‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ ఎలా జరుగుతుంది..? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* స్టోరీ లైన్

* యాక్షన్

* క్లైమాక్స్

మైనస్ :

* స్లో నేరేషన్

* కథనం

* కాలేజీ సన్నివేశాలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ఇప్పటివరకు ప్రేమకథ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది..ఈసారి మాత్రం దేశ రక్షణ కోసం కాపాడే సైనికుడి గా కనిపించాడు. కమాండో ఆపరేషన్‌లలో తనదైన యాక్షన్ తో రక్తి కట్టించాడు.

* మొదటిసారి స్క్రీన్‌పై విలన్‌గా కనిపించిన రచయిత అబ్బూరి రవి ఆకట్టుకున్నాడు. కేవలం అబ్బూరి రవి మాత్రమే కాదు చాలామంది సాంకేతిక వర్గం వారు ఈ మూవీ లో కనిపించి వారిలోను నటులు ఉన్నారని నిరూపించారు.

* తీవ్రవాదిగా కనిపించిన మనోజ్‌ నందం ఆ పాత్రకు అంతగా సెట్ కాలేదు.

* హీరోయిన్లుగా నటించిన శషా చెట్రి, నిత్య పర్వాలేదనిపించారు.

* కార్తీక్‌ రాజు, పార్వతీశంలు కాస్త నవ్వించే​ ప్రయత్నం చేశారు.

* రావు రమేశ్‌ కేంద్ర మంత్రిగా తన నటన తో మరోసారి కట్టిపడేసాడు.

* కృష్ణుడు కనిపించింది కాసేపైనా చివర్లో కంటతడిపెట్టిస్తాడు.

* ఇక మిగతా నటి నటులంతా వారి వారి పరిధి లో ఓకే అనిపించారు.

సాంకేతిక విభాగం :

* శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

* జైపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించింది.

* ఎడిటింగ్ లో లోపాలు ఉన్నాయి. చాల సన్నివేశాలు స్లో గా ఉండడం తో ప్రేక్షకులకు బోర్ కొట్టించాయి.

* నిర్మాణ విలువలు కూడా జస్ట్ ఓకే

* ఇక డైరెక్టర్ విషయానికి వస్తే..వినాయకుడు సినిమాతో చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అందించిన సాయి కిరణ్..ఈ మూవీ కథంతా మాత్రం ఉగ్రవాదం ఫై రాసుకున్నాడు. ఈయన రాసుకున్న లైన్ బాగున్నప్పటికీ..దానిని స్క్రీన్ ఫై చూపించడం లో విఫలం అయ్యాడు. రోటీన్‌ స్క్రీన్‌ ప్లేతో ప్రేక్షకులు విసిగిపోతారు. సెకండ్ హాఫ్ ఇంట్రస్ట్ లేని ట్రీట్మెంట్ తో అనవసరమైన సీన్స్ తో బాగా సాగతీయడం, అన్నిటికి మించి మెయిన్ స్టోరీలోనే బలహీనమైన లోపాలు ఎక్కువుగా ఉండటం వంటి అంశాలు సినిమా రిజల్ట్ ని దెబ్బ తీశాయి.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review