రివ్యూ : ‘ పంతం ‘ నెగ్గాడు..

స్టార్ కాస్ట్ : గోపీచంద్ , మెహ‌రీన్ తదితరులు..
దర్శకత్వం : కె.చ‌క్ర‌వ‌ర్తి
నిర్మాతలు: కె.కె.రాధామోహ‌న్‌
మ్యూజిక్ : గోపిసుందర్
విడుదల తేది : జులై 05, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : ‘ పంతం ‘ నెగ్గాడు

గోపీచంద్ గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న ఈ హీరో ‘పంతం’ అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నూతన డైరెక్టర్ కె.చ‌క్ర‌వ‌ర్తి దర్శకత్వంలో శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె. రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.

ఈ మూవీలో గోపీచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్‌గా నటించగా.. సంపత్ రాజ్, ముఖేశ్ రుషి, శ్రీనివాస రెడ్డి, పవిత్ర లోకేష్, సత్య కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. మరి గోపీచంద్ ‘పంతం’ నెగ్గడా..లేదా అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

విక్రాంత్ (గోపీచంద్) రాజకీయ నాయకుల ఇళ్లను దోచుకోవడం టార్గెట్ గా పెట్టుకుంటాడు. ఆలా పలువురి రాజకీయ నాయకుల ఇళ్లల్లో దొంగతనాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ తీరుగుతుంటాడు. అసలు ఈ దొంగతనాలు ఎవరు.. ఎలా చేస్తున్నారు..రాజకీయ నాయకులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కాక పోలీసులు తలలు పట్టుకుంటుంటారు. ఈ క్రమం లో ఓ రోజు మినిష్టర్ నాయక్ (సంపత్ ) ఇంట్లో దొంగతనం చేస్తూ పోలీసులకు విక్రాంత్ దొరికిపోతాడు.

విక్రాంత్ ను అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేపడతారు..ఆ విచారణ లో విక్రాంత్ ఎవరో..ఎందుకు ఇలా వరుస దొంగతనాలు చేస్తున్నాడో..రాజకీయ నాయకులను ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుందో..అనే నిజాలు తెలుసుకొని పోలీసులు షాక్ అవుతారు..? ఇంతకు విక్రాంత్ ఎవరు..? ఎందుకు దొంగతనాలు చేస్తున్నాడనేది..? అనేది తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* కథనం

Also Read :   పంతం ఫస్ట్ డే కలెక్షన్స్..

* కామెడీ

* గోపీచంద్ యాక్టింగ్

* సినిమా ఫొటోగ్రఫీ

మైనస్ :

* మ్యూజిక్

* సెకండ్ హాఫ్ లో సాగదీత సన్నివేశాలు

* హీరో – హీరోయిన్ల లవ్ ట్రాక్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* గోపీచంద్ గత సినిమాలతో పోలిస్తే ఈ మూవీ లో అద్భుతమైన నటనను కనపరిచాడు. ముఖ్యం గా డైలాగ్స్ విషయంలో అదరగొట్టాడు. ప్రస్తుత రాజకీయాల గురించి , ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు..అనే విషయాలను కోర్ట్ లో చెపుతుంటే ప్రేక్షకులు థియేటర్స్ లలో క్లాప్స్ కొట్టకుండా ఉండలేరు. అంతలా గోపీచంద్ ఆ సన్నివేశాలలో మెప్పించాడు. ఫైట్స్ ,కామెడీ లలో కూడా గోపీచంద్ తన మార్కు ను కనపరిచాడు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌న‌ప‌డ‌ని క్యారెక్ట‌ర్‌లో గోపీచంద్ కనిపించి అభిమానులను , ప్రేక్షకులను అలరించాడనే చెప్పాలి.

* మెహ‌రీన్ గ్లామర్ కు మాత్రమే వాడుకున్నారు..కథలో ఈమెకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. గోపీచంద్ – మెహ‌రీన్ మధ్య ఇంకాస్త లవ్ ట్రాక్ పెడితే బాగుండు అనిపిస్తుంది.

* పృథ్విరాజ్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి , శ్రీనివాస్ రెడ్డి , వెన్నెల కిషోర్ కామెడీ థియేటర్స్ లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. సినిమా హైలైట్స్ లలో ఒకటిగా వీరి కామెడీ నిలిచింది.

* సాయాజీ షిండే, సంపత్ రాజ్ రోల్స్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

* ముకేశ్ రిషి, అజయ్ , పవిత్ర లోకేష్, హంస నందిని మొదలగు నటి నటులు వారి వారి పరిధి మేరకు నటించారు.

సాంకేతిక విభాగం :

* ముందుగా ప‌్ర‌సాద్ మూరెళ్ల‌ సినిమా ఫొటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ప్రతి ఫ్రేమ్ ఎంతో అందంగా , ఆకట్టుకునే విధంగా చూపించి తన సత్తా చాటుకున్నాడు.

* స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కె.చ‌క్ర‌వ‌ర్తి, జై లవకుశ ఫేమ్ బాబీ ఇద్దరు కూడా కథకు న్యాయం చేసారు. ఫస్ట్ హాఫ్ అంత కామెడీ , ఫైట్స్ హీరో చేసే దొంగతనాలు ఇలా అన్ని స్పీడ్ గా అనిపించాయి. కానీ సెకండ్ హాఫ్ లో కాస్త కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించాయి. కాస్త అక్కడ కొంచం చూసుకునే సరిపోయేది.

Also Read :   రివ్యూ : జంబలకిడి పంబ : ఫలించని జంబలకిడి మంత్రం

* ర‌మేశ్ రెడ్డి డైలాగ్స్ సినిమాకు ప్రాణం పోశాయి. ముఖ్యం గా కోర్ట్ సన్నివేశాల్లో గోపిచంద్ పలికే డైలాగ్స్ అందరి చేత క్లాప్స్ కొట్టిస్తాయి. కథ తగిన విధంగా డైలాగ్స్ రాయడం లో ఈయన సక్సెస్ అయ్యారు.

* శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె.రాధామోహ‌న్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

* గోపీ సుంద‌ర్‌ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కాకపోతే బ్యాక్ గ్రౌండ్ మాత్రం పర్వాలేదు అనిపించింది.

* ఇక డైరెక్టర్ కె.చ‌క్ర‌వ‌ర్తి విషయానికి వస్తే తాను ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ దానికి తగిన సోషల్ ఎలిమెంట్స్ జత చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సమాజం లో జరుగుతున్న పరిణామాలను , రాజకీయ నాయకుల దోపిడీని చూపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. కామెడీ , యాక్షన్ , డైలాగ్స్ ఇలా ప్రతిది సమపాలన ఉండేలా చూసుకున్నాడు. కాకపోతే హీరో – హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ , హీరోయిన్ కు పాత్ర కు కాస్త ప్రాధాన్యత ఉండేలా రాసుకుంటే బాగుండు.

చివరిగా :

గత కొంత కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న గోపీచంద్ కు ఈ మూవీ ఊపిరి పోసినట్లయింది..కథ , కథనం , కామెడీ , యాక్షన్ , సోషల్ మెసేజ్ ఇలా అన్ని కూడా సినిమాకు హైలైట్స్ గా నిలువడం తో సినిమా సక్సెస్ బాటలో నిలిచింది. నూతన డైరెక్టర్ అయినప్పటికీ చ‌క్ర‌వ‌ర్తి అన్ని సమపాలన లో ఉండేలా చూసుకొని సక్సెస్ అయ్యాడు. ఓవరాల్ గా గోపీచంద్ ‘పంతం’ నెగ్గాడని చెప్పాలి.

Tagged: , , , , ,