రివ్యూ : పేపర్ బాయ్ – రొమాంటిక్ డ్రామా…

స్టార్ కాస్ట్ : సంతోష్ శోభ‌న్, రియా సుమ‌న్, తాన్యాహోప్ తదితరులు..
దర్శకత్వం : జయ శంకర్
నిర్మాతలు: సంపత్ నంది
మ్యూజిక్ : భీమ్స్
విడుదల తేది : ఆగస్టు 31, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : పేపర్ బాయ్ – రొమాంటిక్ డ్రామా…

సంతోష్ శోభ‌న్ హీరోగా తెర‌కెక్కిన పేపర్ బాయ్ చిత్రం ఈరోజు ( ఆగ‌స్ట్ 31న ) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలయ్యింది. సంతోష్ శోభ‌న్ కు జోడీగా రియా సుమ‌న్, తాన్యా హోప్ నచగా , జ‌య శంక‌ర్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కించారు. విడుద‌లైన ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ రావడం , మిలియ‌న్ వ్యూస్ కూడా దాటడం తో సినిమా ఫై అందరిలో క్రేజ్ పెరిగింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఈ చిత్రానికి క‌థ ఇవ్వ‌డ‌మే కాకుండా త‌న సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ పై నిర్మించడం విశేషం. మరి ఇన్ని విశేషాలు ఉన్న సినిమా ప్రేక్షకులను ఎలా అలరించిందో ఇప్పుడు చూద్దాం.

కథ :

రవి (సంతోష్‌ శోభన్‌) ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు బాగుండకపోవడం తో పేపర్ వేయడం మొదలు పెడతాడు. ఓ రోజు ధరణి (రియా సుమన్) ని చూసి ఇష్టపడతాడు. కోటీశ్వరుడి కూతురైన ధరణి , రవి ఆలోచన విధానం నచ్చి అతడ్ని ప్రేమిస్తుంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు ఒకే చెపుతారు. ఇక పెళ్లి తంతే అనే సమయానికి మేఘ (తాన్యా హోపే) వచ్చి రవి – ధరణి లను దూరం చేస్తుంది..దీంతో ఇద్దరు విడిపోతారు..? ఆ తరువాత కలుసుకుంటారా..లేదా..? ఇంతకీ మేఘ ఎవరు..? ఆమెకు రవిలకు సంబంధం ఏంటి..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* హీరో

* డైలాగ్స్

* మ్యూజిక్

మైనస్ :

* సెకండ్ హాఫ్

* క్లైమాక్స్

* స్లో నేరేషన్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* పేపర్ బాయ్ పాత్రలో సంతోష్ ప్రేమ సన్నివేశాల్లో యూత్ ను ఆకట్టుకుంటూనే , ఫ్యామిలీ ఆడియన్స్ చేతే కంటతడి పెట్టించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు.

* హీరోయిన్‌ రియా సుమన్‌ తెరపై అందంగా కనిపించడమే కాదు నటన పరంగా కూడా ఫుల్ మార్కులు వేసుకుంది.

* తాన్య హోపే తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.

* బిత్తిరి స‌త్తి కామెడీ థియేటర్స్ నవ్వులు పోయించింది.

* పోసాని కృష్ణ‌మురళి, అభిషేక్ మ‌హ‌ర్షి, విద్యాల్లేక రామ‌న్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, స‌న్నీ, మ‌హేశ్ విట్ట త‌దిత‌రులు వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతిక విభాగం :

* భీమ్స్ సిసిరేలియో సంగీతం ఆకట్టుకుంది.

* సౌంద‌ర్ రాజ‌న్ సినిమా ఫొటోగ్రఫీ తెరఫై ఎంతో అందంగా ఉంది.. హీరో , హీరోయిన్లనే కాదు లొకేషన్లను కూడా చాల చక్కగా చూపించి తన సత్తా చాటుకున్నాడు.

* త‌మ్మిరాజు ఎడిటింగ్ పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ లో కాస్త స్లో గా సాగింది. అది కాస్త చూసుకుంటే బాగుండు.

* నిర్మాణ విలువలు బాగున్నాయి.

* సంపత్ నంది కథ పాతదే అయినా ..దర్శకుడు జయ శంకర్ దానిని తెరపై కాస్త విభిన్నంగా చూపించి సక్సెస్ సాధించాడు. డైలాగ్స్ , సన్నివేశాలు అంత బాగానే చూసుకున్నాడు కానీ సెకండ్ హాఫ్ లో కాస్త స్లో గా సాగడం ప్రేక్షకులకు కాస్త విసుగు తెప్పించింది. క్లైమాక్స్ సైతం కాస్త కొత్తగా ఆలోచిస్తే ఇంకాస్త బాగుండేది.

చివరిగా :

సంతోష్ శోభ‌న్ సినిమాను తన భుజాల ఫై వేసుకున్నాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేయడం , బీమ్స్ సంగీతం , కామెడీ ఇదంతా కూడా సినిమాకు హెల్ప్ అయ్యాయి. ఓవరాల్ గా రొమాంటిక్ డ్రామా గా ఈ పేపర్ బాయ్ నిలిచింది.