రివ్యూ : పెంగ్విన్ – సస్పెన్స్‌ థ్రిలర్

స్టార్ కాస్ట్ : కీర్తి సురేష్, ఆదిదేవ్, లింగ, అద్వైత్, హరిణి, నిత్య తదితరులు..
దర్శకత్వం : ఈశ్వర్ కార్తీక్
నిర్మాతలు: కార్తీక్ సుబ్బరాజ్, కార్తికేయన్ సంతానం
మ్యూజిక్ : సంతోష్ నారాయణ్
విడుదల తేది : జూన్ 19, 2020
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : పెంగ్విన్ – సస్పెన్స్‌ థ్రిలర్

లాక్ డౌన్ కారణంగా సినిమా థియేటర్స్ బంద్ కావడం తో చాల సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లలో రిలీజ్ అవుతూ అలరిస్తున్నాయి. తాజాగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ చిత్రం ఈరోజు అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఈశ్వర్ కార్తీక్ డైరెక్ట్ చేసారు. మరి ఈ సినిమా ఎలా ఉంది..కీర్తి నటన ఎలా ఉంది..అసలు ఈ సినిమా కథ ఏంటి అనేది చూద్దాం.

కథ :

రిథమ్( కీర్తి సురేష్ ) రఘు ( లింగ) లకు అద్వైత్ అనే ఒక కొడుకు ఉంటాడు. కొడుకు అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. అయితే, ఓరోజు మిగతా స్కూల్ పిల్లలతో కలిసి ఆడుకోవడానికి బయటకు వెళ్తాడు. అలా వెళ్లిన కొడుకు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఖంగారు పడతారు. ఎంతసేపటికి ఇంటికి రాకపోయేసరికి కొడుకు ఏమై ఉంటాడని వెతకడం స్టార్ట్ చేస్తారు.

అయితే అద్వైత్ కనిపించకుండా పోవడానికి కీర్తి సురేష్ కారణం అని చెప్పి భర్త లింగ ఆమెనుంచి విడాకులు తీసుకుంటాడు. అయినప్పటికీ కీర్తి సురేష్ తన కొడుకు గురించిన అన్వేషణను ఆపదు. అదే సమయంలో కీర్తికి గంగరాజ్ దగ్గరవుతాడు. ఆమెను వివాహం చేసుకుంటాడు. కానీ, కీర్తి నిత్యం కొడుకు అద్వైత్ గురించే ఆలోచిస్తుంటుంది. కొడుకును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లిన కీర్తికి కొడుకు అద్వైత్ కనిపిస్తాడు. అసలు అడవిలోకి ఎలా వచ్చాడు..? అద్వైత్ అడవి లో ఉన్న సంగతి కీర్తి కి ఎలా తెలుస్తుంది..? అనేది అసలు కథ.

ప్లస్ :

* కీర్తి సురేష్ యాక్టింగ్

* ఫస్ట్ హాఫ్

* స్క్రీన్ ప్లే

మైనస్ :

* క్లయిమాక్స్

* సెకండ్ హాఫ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* మహానటి చిత్రంతో తన నటన ఎలా ఉంటుందో రుజువు చేసిన కీర్తి..ఈ సినిమాలోనూ అదరగొట్టింది. థ్రిల్లర్ జానర్లో నటించడం ఈమెకు మొదటిసారి అయినప్పటికీ తన నటనతో ఆకట్టుకుంది. కథ మొత్తం ఆమె చుట్టూనే నడుస్తుంది. మూడు వైవిధ్యభరితమైన పాత్రల్లో కీర్తి అదరగొట్టింది. ఇక మిగతా నటీనటులు తమ పరిధిమేరకు మెప్పించారు.

సాంకేతిక విభాగం :

* మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ అద్భుతంగా మ్యూజిక్ అందించాడు. థ్రిల్లర్ జానర్ చిత్రాలకు ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో అలాంటి మ్యూజిక్ ఇచ్చి అదరగొట్టాడు.

* కార్తీక్ సినిమా ఫొటోగ్రఫీ సైతం సినిమాకు హైలైట్ గా నిలిచింది. లొకేషన్ల పరంగానే కాక సన్నివేశాలను సైతం ఎంతో అందంగా చూపించారు.

* డైరెక్టర్ విషయానికి వస్తే. మొదటి ఫ్రేమ్ లోనే అసలు కథలో ఏం చెప్పబోతున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశాడు. అక్కడి నుంచి ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేయడంలో దర్శకుడు కొంత సఫలం అయ్యాడు. విషయాన్ని సూటిగా చెప్తూనే సస్పెన్స్ ను క్రియేట్ అయ్యేలా చేశాడు. పిల్లలను కిడ్నాప్ చేసిన విధానం, అక్కడి నుంచి కీర్తి సురేష్ వారిని వెతుక్కుంటూ వెళ్లిన విధంగా చాలా థ్రిల్ గా తెరకెక్కించారు.

ఫస్ట్ హాఫ్ , స్క్రీన్ ప్లే ఇలా అన్ని బాగా చూసుకున్న డైరెక్టర్..సెకండ్ హాఫ్ లో మాత్రం తన మార్క్ చూపించలేకపోయారు. క్లైమాక్స్ సైతం సింపుల్ గా పూర్తి చేసాడు. ఈ రెండింటిని కాస్త చూసుకుంటే బాగుండు.

ఓవరాల్ గా థ్రిలర్ జోనర్ ను ఇష్టపడే వారికీ ఈ చిత్రం బాగా నచ్చుతుంది.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review