రివ్యూ : ‘రాక్షసుడు`- సైకిక్ థ్రిల్లర్

స్టార్ కాస్ట్ : బెల్లం కొండ శ్రీనివాస్ , అనుపమ తదితరులు..
దర్శకత్వం : ర‌మేష్ వ‌ర్మ పెన్మెత్స‌
నిర్మాతలు: కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌
మ్యూజిక్ : జిబ్రాన్
విడుదల తేది : ఆగస్టు 2, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : ‘రాక్షసుడు`- సైకిక్ థ్రిల్లర్

డిఫ‌రెంట్ కాన్సెప్ట్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్న యంగ్‌ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క‌థానాయ‌కుడిగా, ర‌మేష్ వ‌ర్మ పెన్మ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా తెరకెక్కిన చిత్రం `రాక్షసుడు`. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘రాచ్చసన్’ సినిమాను ‘రాక్షసుడు’ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు.

సాయి శ్రీనివాస్ కు జోడిగా అనుపమా పరమేశ్వరన్ నటించింది. ట్రైలర్‌తో సినిమాపై ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా కథ ఏంటి..? రాక్షసుడు అనే టైటిల్ కు కథ కు సంబంధం ఏంటి..? సాయి శ్రీనివాస్ ఈ చిత్రం తో హిట్ అందుకున్నాడా..లేదా..? తమిళ రీమేక్ కు మన ఆడియన్స్ కనెక్ట్ అవుతారా లేదా..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

అరుణ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) చిన్నప్పటి నుండి సినిమాలంటే చాల ఇష్టం. ఎలాగైనా డైరెక్టర్ కావాలని..ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ తో కూడిన సినిమా చేయాలనీ కలలుకంటుంటాడు. కానీ తన తల్లి మాత్రం పోలీస్ జాబ్ చేయాలనీ పట్టుబడుతుంది. కానీ అరుణ్ మాత్రం తల్లి మాటను వినకుండా సినిమా ఛాన్సుల కోసం ఎంతగానో ప్రయత్నిస్తుంటాడు. కానీ ఎక్కడ కూడా అరుణ్ కు సినిమా ఛాన్సులు రాకపోయేసరికి తన తల్లి చెప్పినట్లే పోలీస్ జాబ్లో చేరుతాడు.

ఇక అరుణ్ కు మేనకోడలు సిరి అంటే ప్రాణం..ఈ నేపథ్యంలో అరుణ్ కు `15 ఏళ్లలోపు పిల్లల హత్యలకు సంబందించిన కేసు వస్తుంది. ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరు అనే తెలుసుకుంటున్న సమయంలో తనకు ప్రాణమైన సిరి కూడా హత్య కు గురిఅవుతుంది. ఇంతకీ ఆ హత్యలు చేస్తుంది ఎవరు..? ఎందుకు చేస్తున్నాడు..? `15 ఏళ్ల లోపు పిల్లలనే ఎందుకు హత్య చేస్తున్నాడు..? ఆ హంతకుడిని అరుణ్ ఎలా కనిపెడతాడు..? కృష్ణ వేణి (అనుపమ ) కి అరుణ్ కు సంబంధం ఏంటి..? అసలు ఎవరు ఈ కృష్ణవేణి..? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* కథ -స్క్రీన్ ప్లే

* నేపధ్య సంగీతం

* బెల్లం కొండ శ్రీనివాస్ నటన

మైనస్ :

* హీరోయిన్ రోల్

* కామెడీ

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

శ్రీనివాస్ తన నటనతో ఆకట్టుకున్నాడు.. గత సినిమాలతో పోలిస్తే ఇందులో ఆయన నటన చాలా బాగుంది. యాక్షన్‌ సీన్స్‌తోపాటు, ఎమోషనల్‌ సీన్స్‌లోనూ బాగా నటించాడు. ఇంతకుముందు కూడా పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పోషించినా.. ఈ మూవీలో మాత్రం ఇంటెన్సిటీతో నటించి ప్రేక్షకులను అలరించాడు.

* కృష్ణవేణి పాత్ర లో నటించిన అనుపమ కు కథ పరంగా ప్రాముఖ్యత దక్కలేదు. ఏదో హీరోయిన్ ఉండాలి అన్నట్లు ఆమెను పెట్టినట్లు అనిపిస్తుంది.

* పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో రాజీవ్‌ కనకాల మెప్పించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో తన అనుభవాన్ని చూపించాడు.

* కాశీ విశ్వనాథ్‌ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. కీలకమైన క్రిస్టోఫర్‌ పాత్రలో శరవణన్‌ నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :

* జిబ్రాన్ మ్యూజిక్ సినిమా హైలైట్ గా నిలిచింది.

* దేవి తమ్ముడు సాగర్ ఈ చిత్రంతో డైలాగ్ రైటర్ గా పరిచయమయ్యాడు. రైట‌ర్‌గా ఒక‌ట్రెండు చోట్ల చ‌మ్మ‌క్కుమ‌నిపించారు. అమ్మాయిల బలాల‌ను వారికి గుర్తుచేసే సంద‌ర్భంలో రాసిన డైలాగులు బావున్నాయి.

* వెంకట్‌ సి దిలీప్‌ ఛాయాగ్రహణం ఆకట్టుకుంది. ఎడిటింగ్‌ అన్నీ సినిమాకు చక్కగా కుదిరాయి.

* నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.

* డైరెక్టర్ రమేష్ వర్మ విషయానికి వస్తే..తమిళ్ చిత్రం ఎలా ఉందో అలాగే దించేసాడు. కాకపోతే తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు అక్కడక్కడ చిన్న చిన్న చేంజెస్ చేసాడు. స‌మాజంలో నిత్యం ప‌త్రిక‌ల్లో క‌నిపించే అమ్మాయిల అత్యాచారాలను కూడా ప్ర‌స్తావించారు. పాఠ‌శాల‌లో చ‌దువుకోవ‌డానికి వ‌చ్చిన పిల్ల‌ల ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించే కీచ‌క ఉపాధ్యాయుడిని కూడా ఇందులో చూపించారు.

ఎక్క‌డో త‌న‌కు జ‌రిగిన అవ‌మాన్నాన్ని దృష్టిలో పెట్టుకుని, సైకో చేసే కార్య‌క‌లాపాల వ‌ల్ల అభం శుభం తెలియ‌ని వాళ్లు ఎలా బ‌లైపోతారో బాగా చూపించారు. సినిమా మొదలైనప్పటి నుండి పూర్తీ అయేవరకు ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఆత్రుత కలిగేలా తెరకెక్కించి విజయం సాధించారు. అలాగే శ్రీనివాస్ సైతం సినిమాకు కరెక్ట్ గా సరిపోవడం తో ఆయన ఖాతాలో విజయం పడినట్లు అయ్యింది.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review