రివ్యూ : రణరంగం – సృష్టించలేకపోయింది..

స్టార్ కాస్ట్ : శర్వానంద్‌, కళ్యాణీ ప్రియదర్శన్‌, కాజల్‌ అగర్వాల్‌ తదితరులు..
దర్శకత్వం : సుధీర్‌ వర్మ
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ
మ్యూజిక్ : ప్రశాంత్‌ పిళ్లై
విడుదల తేది : ఆగస్టు 15, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : రణరంగం – సృష్టించలేకపోయింది..

శర్వానంద్ – కాజల్ జంటగా సుధీర్ వర్మ డైరెక్షన్లో హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ తెరకెక్కించిన రణరంగం చిత్రం స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది…? శర్వా కు హిట్ వచ్చిందా..రాలేదా..? అసలు ఏ సినిమా కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

వైజాగ్ కు చెందిన దేవ (శర్వానంద్) తన ఫ్రెండ్స్ తో (రాజా చెంబోలు, ఆదర్శ్ బాలకృష్ణ, సుదర్శన్) కలిసి బ్లాక్‌లో సినిమా టికెట్లు అమ్ముకుంటూ డబ్బులు సంపాదిస్తుంటారు. అదే టైంలో రాష్ట్రంలో మద్య నిషేధం అమలులోకి వస్తుంది. బ్లాక్‌లో లిక్కర్‌కు ఫుల్ గిరాకీ..దాంతో ఒరిస్సా నుంచి లిక్కర్‌ను దొంగతనంగా తీసుకొచ్చి వైజాగ్ లో అమ్మితే ఫుల్ గా సంపాదించవచ్చని ప్లాన్ చేస్తారు. ఆలా ప్లాన్ చేసి అదే ప్రకారం దేవ తన మిత్రులతో లిక్కర్ వ్యాపారం మొదలుపెడతాడు.

ఆలా మొదలు పెట్టి అతి తక్కువ టైంలోనే ఓ రేంజ్ కు ఎదుగుతాడు..అప్పటి వరకు లిక్కర్ మాఫియా చేసిన వారంతా దేవా కంటే వెనుకపడిపోతారు. ఇదే క్రమంలో లోకల్ ఎమ్మెల్యే సింహాచలం (మురళీశర్మ)కు శత్రువుగా మారతాడు. అదే సమయంలో గీత(కళ్యాణీ ప్రియదర్శిణి)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దేవా.. ఓ పాప పుట్టిన తరువాత దేవా స్పెయిన్‌కు వెళ్తాడు..ఆలా వెళ్లిన దేవా స్పెయిన్ లో ఏంచేస్తాడు..? గీత ఏమైంది..? అసలు దేవా స్పెయిన్ కు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది…? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* శర్వానంద్ యాక్టింగ్

* మ్యూజిక్

మైనస్ :

* కథ – కథనం

* కామెడీ

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* శర్వానంద్‌ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు..ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి నటిస్తాడు. ఇక ఈ సినిమాలో కూడా అదే నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా మొత్తం కూడా తన భుజాల ఫై మోశాడు. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లో శర్వా నటన అద్భుతం. స్పెయిన్‌లో గ్యాంగ్ స్టర్‌గా శర్వా నటన హుందాగా అనిపించింది.

* కళ్యాణీ ప్రియదర్శన్‌ నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అందర్నీ కట్టిపడేస్తాయి.

* కాజల్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఎమ్మెల్యే పాత్రలో నటించిన మురళీ శర్మ తన నటనలోని రెండో కోణాన్ని చూపించారు.

* రాజా చెంబోలు, ఆదర్శ్ బాలకృష్ణ, సుదర్శన్, మహేష్, బ్రహ్మాజి, అజయ్, నర్రా శ్రీను తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం :

* సినిమా హైలైట్ లలో ప్రశాంత్ పిళ్లై మ్యూజిక్ ఒకటి. ప్రతీ సన్నివేశాన్ని తన నేపథ్య సంగీతంతో మరో లెవల్‌కు తీసుకెళ్లాడు.

* దివాకర్ మణి సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు మరో హైలైట్. స్పెయిన్ అందాలను ఎంత బాగా చూపించారో.. 1980ల కాలాన్ని గుర్తుకుతెచ్చేలా విశాఖపట్నాన్ని కూడా అంతే బాగా చిత్రీకరించారు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు సినిమాటోగ్రాఫర్ స్టామినాను చెబుతాయి.

* ఎడిటింగ్‌కు ఇంకాస్త పదును పెడితే బాగుండేదనే ఫీలింగ్‌ కలుగుతుంది.

* సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ విషయానికి వస్తే..సుధీర్ రాసుకున్న కథ కొత్తగా ఏమి లేదు. దానిని కూడా తెరకెక్కించడంలో విఫలమయ్యాడు. ఫస్ట్‌ హాఫ్‌ ఆసక్తికరంగా సాగగా.. సెకండాఫ్‌ను ఆ స్థాయిలో చూపించలేకపోయాడు. ఫ్లాష్‌ బ్యాక్‌లో వచ్చే సన్నివేశాలు, రొమాంటిక్‌ సీన్స్‌ను అందంగా.. అందరికీ కనెక్ట్‌ అయ్యేలా తెరకెక్కించడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. కథ – కథనం బాగుంటే రిజల్ట్ మరోలా ఉండేది. అలాగే కామెడీ ఫై ఏమాత్రం శ్రద్ద పెట్టలేదు. అది కూడా సినిమాకు మైనస్ అయ్యింది.

ఇక డైలాగ్స్ విషయంలో మాత్రం మెచ్చుకునేలా రాసుకున్నాడు. సినిమాకు డైలాగులు మరో బలం. ‘‘వ్యాపారం పెరగడంతో కరెన్సీకి ఇన్ని కలర్లు ఉంటాయని ఇప్పుడే తెలిసింది’’, ‘‘పవర్ ఉంటే సరిపోదు, అది ఎప్పుడు ఎవడిమీద వాడాలో తెలియాలి’’, ‘‘కింద పడితే దెబ్బలు మాత్రమే తగులుతాయి, తొందర పడితే ఎదురు దెబ్బలు తగులుతాయి’’, ‘‘దేవుడిని నమ్మాలంటే భక్తి ఉంటే సరిపోతుంది.. మనిషిని నమ్మాలంటే ధైర్యం కావాలి’’, ‘‘ఏదో కామెడీగా కారు ఆపి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాననుకున్నావేమో’’ వంటి డైలాగులు బాగా పేలాయి. ఓవరాల్ గా రణరంగం టైటిల్ కు తగ్గట్లు రణరంగం సృష్టించలేకపోయింది .

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review