రివ్యూ : రూలర్ – బాలయ్య వన్ మాన్ షో

స్టార్ కాస్ట్ : బాలకృష్ణ , వేదిక , సోనాల్ , భూమిక తదితరులు..
దర్శకత్వం : కె ఎస్ రవికుమార్
నిర్మాతలు: సి కళ్యాణ్
మ్యూజిక్ : చిరంతన్‌ భట్
విడుదల తేది : డిసెంబర్ 20, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : రూలర్ – బాలయ్య వన్ మాన్ షో

ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు ప్లాప్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ నుండి వచ్చిన చిత్రం రూలర్‌. తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు (శుక్రవారం ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ లో బాలకృష్ణ కు జోడిగా సోనాల్ చౌహాన్‌, వేదిక లు నటించగా.. సీ కళ్యాణ్ సినిమాని నిర్మించారు. జయసుథ, భూమిక, ప్రకాష్ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. చిరంతన్‌ భట్ సంగీతమందించాడు.

గతంలో బాలకృష్ణ – కేయస్‌ రవికుమార్‌ కలయికలో వచ్చిన జైసింహా వచ్చి హిట్ కాగా..ఇప్పుడు మరోసారి వీరిద్దరి కలయికలో రూలర్ రావడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు..మరి ఆ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉందా..జై సింహ తర్వాత మరో హిట్ పడినట్లేనా..అసలు ఈ సినిమా కథ ఏంటి…అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

గతం మరచిపోయి ప్రాణాపాయ స్థితి లో ఉన్న బాలకృష్ణ ను జయసుధ (సరోజినీ ప్రసాద్) కాపాడుతుంది. ఆ తర్వాత అతడికి అర్జున్ ప్రసాద్ గా పేరు పెట్టి అమెరికా పంపించి బిజినెస్ మెన్ గా మారుస్తుంది. అర్జున్ ప్రసాద్ (బాలకృష్ణ) అమెరికా లోనే టాప్ వన్ పొజిషన్ కు సరోజినీ కంపెనీ ని తీసుకొస్తాడు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్ లో ఆపేసిన ఓ ప్రాజెక్ట్ ను తిరిగి మొదలుపెట్టాలని అనుకుంటాడు.

ఈ లోపు అక్కడ తన తల్లికి జరిగిన అవమానం గురించి తెలుసుకొని తన తల్లిని అవమానించిన వారిని చంపాలని అనుకుంటాడు. కానీ అక్కడ .. ఎప్పుడెప్పుడు పోలీస్ ఆఫీసర్ ధర్మా అక్కడికి వస్తాడా..ఎప్పుడెప్పుడు చంపుదామా అని మినిస్టర్ భవాని సింగ్ ఠాగూర్ ఎదురుచూస్తుంటాడు.

ఈ క్రమంలో అర్జున్ ప్రసాద్ అక్కడికి రావడం తో ఠాగూర్ షాక్ అవుతాడు..? ఇంతకీ ఠాగూర్ అర్జున్ ప్రసాద్ ను చూసి ఎందుకు షాక్ అవుతాడు..? అసలు ధర్మ ఎవరు..? ధర్మ కు , అర్జున్ ప్రసాద్ కు సంబంధం ఏంటి..? ఠాగూర్ ఎందుకు ధర్మ ను చంపాలని అనుకుంటాడు..? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* బాలకృష్ణ

* ఎమోషనల్ సన్నివేశాలు

మైనస్ :

* కథ

* సెకండ్ హాఫ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ఈ మూవీ లో మరోసారి బాలకృష్ణ రెండు షేడ్స్ లలో కుమ్మేసాడు. పంచ్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలలో బాలకృష్ణ తన మార్కుతో అదరగొట్టాడు. ఈ వయసులో కూడా బాలయ్య ఆ యాక్షన్ చూసి అభిమానులు షాక్ అవుతారు. బాలయ్య స్టైలిష్ లుక్ అండ్ యాక్షన్ తో అదరగొట్టాడు.

* హీరోయిన్స్ గా నటించిన వేదిక, సోనాల్ చోహన్ తమ నటన ఎలా ఉన్నా.. తమ గ్లామర్ తో మాత్రం బాగానే ఆకట్టుకుంటారు.

* ఇతర కీలక పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్, భూమిక, జయసుధ ఉత్తమమైన నటనను కనబర్చారు.

సాంకేతిక విభాగం :

* చిరంతన్ భట్ అందించిన సంగీతం ఫర్వాలేదని అనిపిస్తుంది.

* పరుచూరి మురళి అందించిన కథ, కథనాలు ఏమాత్రం కొత్తగా అనిపించవు.

* కెమెరావర్క్ బాగుంది.

* నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

* డైరెక్టర్ రవి కుమార్ పాత కథతోనే బాలయ్య ను చూపించాడు. కాస్త కొత్తగా ఆలోచిస్తే బాగుండేది. ఎప్పటి కాలం నాటి కథకి యుపీ బ్యాక్ గ్రాప్ ని యాడ్ చేసి బాలకృష్ణని ఓ కొత్త లుక్ లో ప్రెజెంట్ చేశాడు డైరెక్టర్. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ ని ద్రుష్టిలో పెట్టుకొని కథ, కథనాలు రాసుకున్నట్టుగా కనిపిస్తుంది. మొదటి భాగం పర్వాలేదు అనిపిస్తే రెండవ భాగం మొత్తానికే తేలిపోయింది. అన్నీ ఉహించిన సన్నివేశాలే ఉండడంతో
బోర్ కొట్టిస్తుంది.

సెకండ్ హాఫ్ లో రైతుల గురించి బాలకృష్ణ చెప్పే సంబాషణలు, దానికి తాలూకు సన్నివేశాలు సినిమాకు హైలైట్ ఉన్నాయి. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీకి సి.ఈ.వో గా బాలకృష్ణని యాంగ్ లుక్ లో చూపించడానికి డైరెక్టర్ గట్టిగానే శ్రమ పడ్డాడు. ఓవరాల్ గా అభిమానులు బాలయ్య ను స్టైలిష్ లుక్ లో యాక్షన్ సన్నివేశాలు చూసి ఎంజాయ్ చేయవచ్చు.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review