రివ్యూ : సాహో – యాక్షన్ ఎంటర్టైనర్

స్టార్ కాస్ట్ : ప్రభాస్ , శ్రద్ద కపూర్ , జాకీ ష్రాఫ్‌, నీల్‌ నితిన్‌ తదితరులు..
దర్శకత్వం : సుజిత్
నిర్మాతలు: యువీ క్రియేషన్స్
మ్యూజిక్ : జిబ్రాన్
విడుదల తేది : ఆగస్టు 30, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3.5/5

రివ్యూ : సాహో – యాక్షన్ ఎంటర్టైనర్

దేశ వ్యాప్తంగా ‘సాహో’ మేనియా నడుస్తోంది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన అత్యంత భారీ చిత్రం సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడం..పాన్ ఇండియా మూవీ గా రాబోతుండడంతో బాలీవుడ్‌తో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ విపరీతమైన హైప్ మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మరి సినిమా ఎలా ఉంది..? ట్రైలర్ లో చూపెట్టినట్లు సినిమా ఉందా..? ప్రభాస్ యాక్షన్ ఎలా ఉంది..? బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్ యాక్టింగ్ ఎలా ఉంది…? అసలు ఈ చిత్ర కథ ఏంటి..? మన ఆడియన్స్ కు సినిమా నచ్చుతుందా..లేదా..? అనేది ఇప్పుడు పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

రెండు వేలకోట్ల రూపాయలకు సంబంధించిన కథ సాహో. ఓ పెద్ద గ్యాంగ్ స్టార్ అయినా పృథ్వీ రాజ్‌ (టిను ఆనంద్‌) తన సామ్రాజ్యానికి తన కొడుకు దేవరాజ్‌ (చుంకీ పాండే)ను వారసుణ్ని చేయాలనుకుంటాడు. కానీ రాయ్‌ (జాకీ ష్రాఫ్‌) క్రైం సిండికేట్‌ను నడిపిస్తూ తన కొడుకును ప్రపంచాన్ని పాలించే ఓ పెద్ద డాన్ గా చూడాలని ఆశ పడుతుంటాడు. ఓ రోడ్డు ప్రమాదంలో రాయ్ మరణిస్తాడు.

ఈ నేపథ్యంలో రాయ్‌ కొడుకు విశ్వక్‌ (అరుణ్‌ విజయ్‌) గ్యాంగ్‌స్టర్‌ సామ్రాజ్యంలోకి వారసుడిగా ఎదుగుతాడు. అదే సమయంలో విశ్వక్‌ కు చెందిన రూ. రెండు లక్షల కోట్లతో వస్తున్న ఓ షిప్‌ పేలిపోతుంది. దీంతో రెండు వారాల్లో పోయిన డబ్బునంతా సంపాదించాలని ఫిక్స్ అవుతాడు. మరి విశ్వక్‌ ఆ డబ్బును సంపాదిస్తాడా..? లేదా..? ఈ కథ కు అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) కి సంబంధం ఏంటి..? అసలు అశోక్‌ చక్రవర్తి ఎవరు..? అమృతా నాయర్‌ (శ్రద్ధ కపూర్‌)..అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) ఎందుకు కలుస్తారు..? అసలు రాయ్‌ చంపబడ్డాడా..? లేక ఎవరైనా చంపారా..? ఈ ప్రశ్నలాంటికి సమాదానాలు కావాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* యాక్షన్ సన్నివేశాలు

* నేపధ్య సంగీతం

* నిర్మాణ విలువలు

* కథలో వచ్చే ట్విస్టులు

మైనస్ :

* పాటలు

* కామెడీ

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘సాహో’. ‘బాహుబలి’తో ఇండియన్ సినిమాతో పాటు వరల్డ్ సినిమా హిస్టరీలో ప్రభాస్ తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు. ఇక ఈ చిత్రం లోను అదే నటన తో ఇంకాస్త పేరు తెచ్చుకున్నాడు. సాహో మొత్తం తన భుజాల ఫై వేసుకొని తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టుకు పెంచారు.

అండర్‌ కవర్‌గా కాప్‌గా ప్రభాస్ చాల స్టయిలిష్ గా కనిపించడమే కాదు తనదయిన స్టయిల్ యాక్షన్ చెంచేసాడు. అసలు తెలుగు హీరోను చూస్తున్నామా..హాలీవుడ్ హీరోను చూస్తున్నామా అని ప్రతి ఒక్కరు అనుకోవడం ఖాయం. కేవలం యాక్షన్ మాత్రమే కాదు శ్రద్ద కపూర్ తో రొమాన్స్ లో కూడా డార్లింగ్ అనిపించాడు.

* ఈ చిత్రంతో తెలుగు స్క్రీన్ ఫై పరిచమైన శ్రద్ద కపూర్ ..ప్రభాస్ తో పోటీ పడింది. యాక్షన్ సన్నివేశాల్లో చించేసింది. ప్రభాస్ – శ్రద్ద ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ బాగా వర్క్ అవుట్ అయ్యింది.

* గ్యాంగ్‌స్టర్‌ నాయకుడిగా చుంకీ పాండే స్టయిలిష్ డాన్ లుక్ లో ఆకట్టుకున్నాడు.

* కల్కిగా మందిరా బేడీ బాగా నటించింది.

* జాకీ ష్రాఫ్‌, టిను ఆనంద్‌, అరుణ్‌ విజయ్‌, నీల్‌ నితిన్‌ ముఖేశ్‌, మురళీ శర్మ మొదలగు వారంతా తమ పాత్రల మేరకు బాగా నటించారు.

* శ్రీలంక హాట్ బ్యూటీ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ ఐటెం సాంగ్ కుర్రకారుకు కిక్ ఇస్తుంది.

సాంకేతిక విభాగం :

* ముందుగా జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పుకోవాలి. ఇలాంటి యాక్షన్ భరిత చిత్రాలకు నేపధ్య సంగీతం చాల ముఖ్యం. ఏ మాత్రం తేడా వచ్చిన సినిమా కే దెబ్బ. అలాంటిది పెద్దగా పేరులేని జిబ్రాన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా డైరెక్టర్ ఎంచుకొని సక్సెస్ అయ్యాడు. తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా కు ప్రాణం పోసాడు. కాకపోతే పాటలే ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి.

* భారీ యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. హాలీవుడ్‌ స్టంట్ మాస్టర్లు కెన్నీ బేట్స్‌, పెంగ్‌ జాంగ్‌, స్టీఫెన్‌ రిట్చెర్‌, బాబ్‌ బ్రౌన్‌తోపాటు దిలీప్‌ సుబ్బరాయన్‌, స్టంట్‌ శివ, రామ్‌ లక్ష్మణ్‌ కేక పుట్టించారు. ప్రతి ఫైట్ హాలీవుడ్ సినిమాను తలపిస్తాయి. ఎడారిలో భారీకాయులతో ప్రభాస్‌ చేసిన ఫైట్‌ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ముంబయి నగరంలో శ్రద్ధ కపూర్‌తో కలసి చేసిన గన్‌ ఫైట్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

* శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ సినిమాకు ప్లస్ అయ్యింది. ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా జాగ్రత్త పడ్డాడు.

* సినిమాటోగ్రాఫర్‌ మది మరోసారి తన కెమెరా పనితనాన్ని చూపించాడు. అందరి కంటే ఎక్కువ కష్టపడింది ఈయనే అని చెప్పాలి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో గాని దుబాయ్ లొకేషన్లలో ఇలా అది ఇది అని కాకుండా సినిమా మొత్తం కూడా చాల కలర్ ఫుల్ గా చూపించాడు.

* కమల్‌ కణ్నన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌, సాబు సిరిల్‌ ప్రొడక్షన్‌ డిజైనింగ్ బాగుంది.

* ఇక యువీ క్రియేషన్స్ నిర్మాణ విలువల గురించి ఎంత చెప్పిన తక్కువే..సినిమా నిర్మించాలని అందరికి ఆశ ఉంటుంది. కానీ ఎంత పెట్టుబడి పెట్టి ఓ తెలుగు సినిమాను నిర్మించడం అంటే వారి ధైర్యానికే ముందుగా హ్యాట్సప్ చెప్పాలి. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా తగ్గకుండా రూపాయి కి రూపాయి పెంచుకుంటూ సినిమాను హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గకుండా నిర్మించి సినిమా పట్ల వారికీ ఎంత ఇష్టం ఉందో తెలిపారు. వీరు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది.

* ఇక డైరెక్టర్ సుజిత్ విషయానికి వస్తే..కేవలం ఒకే ఒక సినిమాను డైరెక్ట్ చేసిన ఇతడిని నమ్మి దాదాపు రూ. 350 కోట్లు పెట్టడం పెద్ద సాహసమే. నిర్మాతలు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు సుజిత్. తాను ఎలా అయితే రాసుకున్నాడో అదే ప్రకారం సినిమాను తెరకెక్కించారు.

కాకపోతే కథలో కొత్తదనం లేదు. సినిమా మొదలైన కాసేపటికే యాక్షన్ మూవీ అని..గ్యాంగ్ స్టార్ల మధ్య సాగే పోరాటం అని తెలుస్తుంది. ప్రభాస్ ఎంట్రీ..తో సినిమా వేగం పెరుగుతుంది. డైలాగ్స్, కామెడీ , స్క్రీన్ ప్లే విషయంలో సుజిత్ ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండు. కేవలం యాక్షన్ మీదనే ఫోకస్ పెట్టాడు. సినిమా ఆఖరులో వచ్చే ప్రభాస్‌ పాత్రలో రెండో షేడ్‌ ఆసక్తికరంగా ఉండడం అందరికి షాక్ ఇచ్చింది. ఓవరాల్ గా సుజిత్ సినిమాకు న్యాయం చేసాడు.

తెలుగు మిర్చి రేటింగ్ : 3.5/5

Click here for English Review