రివ్యూ : సరిలేరు నీకెవ్వరూ – బొమ్మ బ్లాక్ బస్టర్

స్టార్ కాస్ట్ : మహేష్ బాబు , రష్మిక , విజయశాంతి తదితరులు..
దర్శకత్వం : అనిల్ రావిపూడి
నిర్మాతలు: అనిల్ సుంకర , మహేష్ బాబు , దిల్ రాజు
మ్యూజిక్ : దేవి శ్రీ
విడుదల తేది : జనవరి 11, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3.75/5

రివ్యూ : సరిలేరు నీకెవ్వరూ – బొమ్మ బ్లాక్ బస్టర్

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్‌ రాజు సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్‌, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌లపై నిర్మించబడిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ సంక్రాంతి కానుకగా ఈరోజు (జనవరి 11న ) భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక మహేష్ కు జోడిగా నటించగా..లేడి సూపర్ స్టార్ విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే రావు రమేష్ , ప్రకాష్ రాజ్ , రాజేంద్ర ప్రసాద్ , సంగీత , పోసాని , వెన్నెల కిషోర్ మొదలగు స్టార్ట్ నటి నటులు ఈ చిత్రం లో నటించారు. మరి ఈ భారీ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? సంక్రాంతి బరిలో సక్సెస్ కొట్టిందా..లేదా..? మహేష్ ను అనిల్ రావిపూడి ఏ విధంగా చూపించాడు..? టైటిల్ కు తగ్గట్లే సరిలేరు అనిపించుకుందా..? అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

అజయ్ కృష్ణ (మహేష్ బాబు ) ఆర్మీ లో కీలక పాత్ర పోషిస్తుంటాడు..కొంతమంది తీవ్రవాదులు స్కూల్ పిల్లలను బంధించడం తో ఆ పిల్లలను రక్షించేందుకు తన టీం తో కలిసి రంగంలోకి దిగుతాడు. ఈ ఆపరేషన్ తరువాత మహేష్ కు ఊహించని కొన్ని పరిస్థితులు ఎదురౌతాయి. ఆ తర్వాత అజయ్.. భారతి (విజయశాంతి) ని వెతుక్కుంటూ కర్నూలు వస్తాడు.

అసలు అజయ్ కి మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ అయినా భారతి కి సంబంధం ఏంటి..? అజయ్ వచ్చేటప్పటికి భారతి ఎలాంటి ఇబ్బందుల్లో ఉంటుంది..? భారతి ని కాపాడేందుకు అజయ్ ఎలాంటి సాహసాలు చేస్తాడు..? మంత్రి నాగేంద్ర ప్రసాద్ కు భారతి కి సంబంధం ఏంటి..? అనేది అసలు కథ.

ప్లస్ :

* మహేష్ బాబు

* కామెడీ

* ఫస్ట్ హాఫ్

* నేపధ్య సంగీతం

మైనస్ :

* సెకండ్ హాఫ్ అక్కడక్కడా సాగదీత సన్నివేశాలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* సూపర్ స్టార్ మహేష్ బాబు యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పనే లేదు..ఖలేజా, దూకుడు చిత్రాలతో తనలో కామెడీ యాంగిల్ కూడా ఉందని నిరూపించిన మహేష్..ఈ సినిమాలో కూడా అదే రేంజ్ లో కామెడీ తో అదరగొట్టాడు. ముఖ్యంగా ట్రైన్ సన్నివేశాల్లో మహేష్ చించేసాడు.

అలాగే యాక్షన్ కుమ్మేసాడు..ఇక ఇప్పటివరకు పెద్దగా డాన్సులతో పెద్దగా మార్కులు వేసుకోలేకపోయిన మహేష్ ..ఈ సినిమాలో మాత్రం చించేసాడు. ఈ సినిమాతో డాన్స్ విషయంలో విమర్శలకు చెక్ పెట్టాడు. మైండ్ బ్లాక్ సాంగ్ లో లుంగీ తో థియేటర్స్ లలో ఈలలు వేయించాడు.

* రష్మిక విషయానికి వస్తే..నీకు అర్థం అవుతుందా అంటూ ట్రైలర్ తోనే అంత తన వైపు తిప్పుకున్న ఈ భామ ..సినిమాలో అల్లరి పిల్ల గా మహేష్ వెంట పడే పాత్ర లో బాగా చేసింది. అలాగే గ్లామర్ పరంగానే కాక డాన్స్ లతో కూడా అదరగొట్టింది.

* భారతి పాత్రలో లేడీ అమితాబ్‌ విజయశాంతి అదరగొట్టింది. వచ్చింది గ్యాప్ మాత్రమే నటనలో కాదని మరోసారి రుజువు చేసింది. మహేష్ – విజయశాంతి ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను , అభిమానులకు కట్టిపడేశాయి.

* విలన్ రోల్ లో ప్రకాష్ రాజ్ మరోసారి తన నటనతో అదరగొట్టాడు. ప్రకాష్ – మహేష్ ల మధ్య సన్నివేశాలు ఒక్కడు సినిమాను గుర్తు చేసాయి.

* రాజేంద్ర ప్రసాద్ , రావు రమేష్ , పోసాని కృష్ణ మురళి , సంగీత , సత్య దేవ్ , అజయ్ , సుబ్బరాజ్ , నరేష్ , బండ్ల గణేష్ తదితరులంతా వారి వారి పరిధి లో నటించి మెప్పించారు.

సాంకేతిక విభాగం :

* దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్ తో చించేసాడు. పాటలో రిలీజ్ అయినా మొదట్లో కాస్త జోష్ తగ్గినట్లు అనిపించినా సినిమా రిలీజ్ టైం కు బాగా పాపులర్ అయ్యాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ కూడా అదరగొట్టాడు.

* రత్నవేలు సినిమా ఫొటోగ్రఫీ గురించి చెప్పాల్సిన పనిలేదు..సినిమాలో ప్రతిదీ ఎంతో అందంగా చూపించి తన కెమెరా పనితనాన్ని రుజువు చేసాడు.

* తమ్మిరాజు ఎడిటింగ్ ఫాస్ట్ గా సాగింది. ముఖ్యం గా ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయిందా అనే విధంగా నడిపించాడు.

* నిర్మాణ విలువలు కథ కు మించి ఉండడం తో ప్రతి ఫ్రేమ్ ఎంతో రిచ్ గా ఉంది.

* ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి విషయానికి వస్తే ..మాటల రచయిత గా సినీ కెరియర్ ను మొదలు పెట్టిన అనిల్..పటాస్ చిత్రంతో డైరెక్టర్ గా మారి మొదటి సినిమాతోనే తన సత్తా చాటుకున్నాడు. ఆ తర్వాత వరుస హిట్ల తో తన ప్రయాణాన్ని సాగిస్తూ వస్తున్నాడు. ఇక ఈ సినిమా విషయంలో కూడా అనిల్ తన మార్క్ కనపరిచాడు. దేశభక్తి, వినోదం అనే అంశాలను ఒకేసారి డీల్‌ చేస్తూ దానికి మహేష్ ఎంటర్‌టైనింగ్‌ జోడించి సక్సెస్ అయ్యాడు. బోర్డర్‌ నుంచి అజయ్‌కృష్ణ (మహేశ్‌) అనే ఆర్మీ ఆఫీసర్‌ ఓ బాధ్యతతో కర్నూలు వస్తాడు. ఒక యుద్ధ వాతావరణం నుంచి సాధారణ ప్రజల మధ్యలోకి వచ్చిన అతనికి ప్రజలు అమాయకులుగా కనిపిస్తారు. ఎందుకంటే సరిహద్దుల్లో శత్రువులు వేరు, సమాజంలోని శత్రువులు వేరు. వీరందరూ బాధ్యతతో ఉండాలనేది అజయ్‌కృష్ణ వ్యక్తిత్వం. యుద్ధంలో శత్రువును చంపడం కాదు. శత్రువును మార్చడం ముఖ్యమని ఈ సినిమా ద్వారా చెప్పాడు.

చివరగా :

శ్రీమంతుడు , భరత్ అనే నేను , మహర్షి చిత్రాలతో మహేష్ వరుసగా సందేశాత్మక కథలు చేస్తుండటంతో అయన నుంచి మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను ఫ్యాన్స్‌ కోరుకున్నారు. అయితే అనిల్‌ రావిపూడి అభిమానులు ఏమి కోరుకున్నారో అదే చేసాడు. యాక్షన్ , కామెడీ , డాన్స్ ఇలా అన్ని మహేష్ లో చూపించి ఆకట్టుకున్నాడు. కమర్షల్ కథ కు సరైన కామెడీ జోడించి సంక్రాంతి బరిలో అసలైన బొమ్మ ను చూపించాడు.

తెలుగు మిర్చి రేటింగ్ : 3.75/5

Click here for English Review