రివ్యూ – శైలజా రెడ్డి అల్లుడు – మెప్పించలేకపోయిన అల్లుడు

స్టార్ కాస్ట్ : నాగ చైతన్య , అను ఇమ్మానుయేల్ , రమ్య కృష్ణ తదితరులు..
దర్శకత్వం : మారుతీ
నిర్మాతలు: సితార ఎంటర్టైన్మెంట్స్
మ్యూజిక్ : గోపి సుందర్
విడుదల తేది : సెప్టెంబర్ 13, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : శైలజా రెడ్డి అల్లుడు – మెప్పించలేకపోయిన అల్లుడు

అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై మారుతీ తెరకెక్కించిన చిత్రం శైలజారెడ్డి అల్లుడు. నాగచైతన్యకు అత్తగా రమ్యకృష్ణ నటించడం , మురళీ శర్మ, నరేష్, వెన్నెల కిషోర్, పృథ్వీ ఇతర ముఖ్య పాత్రలు పోషించడంతో ఈ మూవీ ఫై అందరిలో అంచనాలు పెరిగాయి.

ఔట్ అండ్ ఔట్ కామెడీతో పక్కా కమర్షియల్ సినిమా తెరకెక్కిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా ఈరోజు (సెప్టెంబర్ 13న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా చైతు కు ఎలాంటి విజయం అందించిందో ఇప్పుడు చూద్దాం.

కథ :

చైతు (నాగ‌చైత‌న్య‌) ఎలాంటి హడావిడి లేని సాధారణ కుర్రాడు.. ఆయ‌న తండ్రి రావు (ముర‌ళీ శ‌ర్మ‌) మాత్రం చాల తేడా మనిషి. చాల పొగరు కలిగిన వ్యక్తి. తాను అనుకున్నది జరిగిపోవాలనుకునే స్వభావం కలవాడు. తండ్రి ప్రవర్తన నచ్చని చైతు మనసులోకి అలాంటి స్వభావం కలిగిన అను (అనూ ఇమ్మానుయేల్‌) ప్ర్రవేశిస్తుంది.

మొదటి చూపులోని నచ్చిన అనును తన దారిలోకి తీసుకొచ్చేందుకు చాల కష్టపడతాడు. తనలాంటి స్వభావమే అను కు ఉండడం తో చైతు తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకుంటాడు. అను కన్నా ఎక్కువ పొగరు ఆమె తల్లి శైలజా రెడ్డి (రమ్యకృష్ణ ) కి ఉన్న సంగతి చైతు తెలుసుకుంటాడు..ఆ తర్వాత ఎలాంటి కష్టాలు పడ్డాడు.?.వీరి పెళ్లి కి శైలజా ఒప్పుకుంటుందా లేదా..? కథ ఎలా సాగుతుందనేది మీరు తెరఫై చూడాల్సిందే.

ప్లస్ :

* నాగ చైతన్య యాక్టింగ్

* అను ఇమ్మానుయేల్ గ్లామర్

మైనస్ :

* రొటీన్ స్టోరీ

* కామెడీ

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* గత రెండు మూడు సినిమాల దగ్గర నుండి నాగ చైతన్య నటనలో చాల తేడాలు కనిపిస్తున్నాయి..లుక్స్ పరంగానే కాకుండా తన నాటాలోనూ చాల మెరుగులు దిద్దుకుంటూ వస్తున్నాడు. ఇక ఈ మూవీ లో కూడా తన నటన తో సినిమా కు హైలైట్ గా నిలిచాడు. చైతు నటనలో సరికొత్త హావభావాలు ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ లో అద్భుతంగా నటించి శభాష్ అనిపించుకున్నాడు.

* అను రెడ్డి గా నటించిన అను ఇమ్మానుయేల్ గ్లామర్ గానే కాకుండా పొగరు ఉన్న అమ్మాయి గా కనిపించి ఆకట్టుకుంది.

* శైలజా రెడ్డి గా రమ్యకృష్ణ టైటిల్ రోల్ లో నటించి తనదయిన నటన తో ఆకట్టుకుంది. ఇలాంటి పాత్రలు చేయడం రమ్య కృష్ణ కు కొత్త కాదు…గతంలో చాల సినిమాల్లో ఇలాంటి రోల్స్ చేసి ఆకట్టుకుంది.

* చైతన్య కు తండ్రిగా మురళీశర్మ తన పాత్రకు న్యాయం చేశారు.

* మారుతీ సినిమాల్లో కమెడియన్ పృథ్వీ కామెడీ సినిమాకు హైలైట్ గా ఉంటుంది కానీ ఈ సినిమాలో మాత్రం అయన రోల్ పెద్దగా పేలకపోగా బోర్ కొట్టించింది.

* చారి గా వెన్నెల కిషోర్ కామెడీ అక్కడక్క థియేటర్స్ లలో నవ్వులు పోయించింది.

* ఇక సినిమాలో నటించిన మిగతా వారు సైతం తమ తమ పాత్రల్లో నటించి అలరించారు.

సాంకేతిక విభాగం :

* ఈ మధ్య తెలుగు చిత్రాలకు ఎక్కువగా గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తూ వస్తున్నాడు..ఇక ఈ చిత్రానికి కూడా ఆయనే మ్యూజిక్ అందించారు కానీ ఆయన మ్యూజిక్ పెద్దగా అలరించలేకపోయింది. రీ రికార్డింగ్ సైతం గొప్పగా లేదనే చెప్పాలి.

* నైజర్ షఫీ సినిమా ఫొటోగ్రఫీ జస్ట్ ఓకే

* కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ లో కూడా ఇంకాస్త కత్తెర వహిస్తే బాగుండు.

* సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ మారుతీ విషయానికి వస్తే…రొటీన్ కథను ఎంచుకొని ప్రేక్షకులను నిరాశ పరిచాడనే చెప్పాలి..ట్రైలర్ తోనే సినిమా ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకున్న ప్రేక్షకులు , సినిమా చూసి చాల ఫీల్ అవుతున్నారు. కథలో మంచి కామెడీ కి ఆస్కారం ఉన్నప్పటికీ మారుతీ దానిని వినియోగించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలతో సినిమా ఫన్ గా సాగినప్పటికీ, సెకండ్ హాఫ్ విలేజ్ కి షిఫ్ట్ అయ్యేసరికి సినిమా పెద్దగా మెప్పించలేకపోయింది. సినిమా చూస్తున్నంత సేపు ఏదో తెలిసిన సినిమానే చూసినట్లు అనిపిస్తుంది తప్ప కొత్త సినిమా చూసిన ఫీల్ మాత్రం తేలకపోయాడు..

చివరిగా :

ఎన్నో ఆశలు పెట్టుకున్న అక్కినేని ఫ్యాన్స్ కు ఈ చిత్రం నిరాశ పరిచిందనే చెప్పాలి…సినిమా మొత్తం చైతు తన భుజాల ఫై వేసుకున్నప్పటికీ డైరెక్టర్ తన సత్తా చాటలేకపోయాడు. అను గ్లామర్ , చైతు – అను ల మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త బాగున్నప్పటికీ , సినిమా మాత్రం రొటీన్ డ్రామాగా అనిపిస్తుంది.