రివ్యూ : సీత – పొగరెక్కువ

స్టార్ కాస్ట్ : కాజల్ , బెల్లం కొండ శ్రీనివాస్ తదితరులు..
దర్శకత్వం : తేజ
నిర్మాతలు: అనిల్ సుంకర
మ్యూజిక్ : అనూప్
విడుదల తేది : మే24, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : సీత – పొగరెక్కువ

తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌న్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం `సీత‌`. ‘లక్ష్మీకళ్యాణం’ చిత్రంతో కాజల్ అగర్వాల్‌ను ఇండస్ట్రీ కి పరిచయం చేసిన తేజ.. మొదటి సినిమాతోనే అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చాడు. అప్పుడు లక్ష్మి గా పరిచయం చేసిన ఈయన..ఇప్పుడు సీత గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా..పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్స్‌గా పనిచేశారు. లేడీ ఓరియెంటెడ్‌ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సీత గా కాజల్ ఎలా ఆకట్టుకుంది..? గత కొంతకాలంగా యాక్షన్ కే ప్రాధాన్యత ఇస్తున్న బెల్లం కొండ శ్రీనివాస్ కు ఈ చిత్రం ఏ మేరకు సక్సెస్ ఇచ్చిందో..? పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

ఎంతో పొగరు ఉన్న సీత (కాజల్ ) తాను అనుకున్నది సాధించే వరకు ఎంతకైనా తెగిస్తుంది..డబ్బు కోసం ఏ పనైనా చేసే స్వభావం కలది. ఓ పెద్ద హోట‌ల్ క‌ట్టాల‌నే ఉద్దేశంతో ఓ స్థ‌లాన్ని డ‌బ్బుల‌కు కొంటుంది. ఇక అక్క‌డుండే జ‌నాల‌ను త‌రిమేయ‌డానికి ఎమ్మెల్యే బ‌స‌వ‌రాజ్ గౌడ్‌(సోనూసూద్‌) స‌హాయం కోరుతుంది. ఇద్దరి మధ్య ఓ ఒప్పందం కుదురుతుంది. ఆ ఒప్పందం కారణంగా సీత కు కష్టాలు మొదలవుతాయి.

అదే సమయంలో అమాయకుడైన రఘురామ్(బెల్లంకొండ శ్రీనివాస్) గురించి ఓ నిజం తెలుసుకొని సీత అతడి దగ్గరికి వెళ్తుంది. రఘురామ్ అమాయకత్వాన్ని వాడుకోవాలని ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? బసవ కష్టాల నుండి సీత తప్పించుకుంటుందా ..లేదా .? సీత కష్ఠాలను రఘురామ్ తీరుస్తాడా..లేదా..? అనేది అసలు కథ.

ప్లస్ :

* కాజల్ యాక్టింగ్

* అక్కడక్కడా కామెడీ

మైనస్ :

* కథ – కథనం

* సెకండ్ హాఫ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ‘లక్ష్మీకళ్యాణం’ సినిమాతో కాజల్ అగర్వాల్‌ను తేజ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. తొలి సినిమాతోనే కాజల్‌కు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. సుమారు 12 ఏళ్ల క్రితం కాజల్‌ను లక్ష్మిగా పరిచయం చేసిన తేజ.. ఇప్పుడు ఆమెను సీతగా చూపించారు.

సినిమా కథ అంత ఆమె చుట్టూనే తిరగడం తో కాజల్ రోల్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. పొగరు ఉన్న అమ్మాయి గా కాజల్ బాగా నటించడమే కాదు గ్లామర్ యాంగిల్ కు కూడా మునపటి కంటే ఎక్కువ మార్కులే కొట్టేసింది. ప్రతీ సన్నివేశంలోనూ తన సహజ నటన కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

* అమాయక చక్రవర్తి పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ ఓకే అనిపించాడు. కథ అంతే హీరోయిన్ చుట్టూనే తిరగడం తో శ్రీనివాస్ పాత్ర కు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. క్లైమాక్స్ లో మాత్రం శ్రీనివాస్ అదరగొట్టాడు.

* తీన్మార్ ఫేమ్ బిత్తిరి సత్తి అక్కడక్కడా తన కామెడీ తో కాస్త నవ్వించే ప్రయత్నం చేసాడు.

* బసవ పాత్రలో నటించిన సోను సూద్ మరోసారి తన విలనిజాన్ని చూపించి ఆకట్టుకున్నాడు.

* రూప పాత్రలో మన్నారా చోప్రా పర్వాలేదు అనిపించింది.

* ఇన్స్పెక్టర్ అభిషేక్ గా అభిమన్యు సింగ్ అదరగొట్టాడు

* ఆర్ఎక్స్ బ్యూటీ పాయల్ ఐటెం సాంగ్ లో చించేసింది..అమ్మడు తెర ఫై కనిపించగానే థియేటర్స్ అంత మారుమోగిపోయింది.

* మిగతా పాత్రల్లో నటించిన పలువురు వారి వారి పాత్రల మేరకు బాగానే చేసారు.

సాంకేతిక విభాగం :

* అనూప్ ఇచ్చిన మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రెండు పాటలు జస్ట్ ఓకే అనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మామూలుగానే ఉంది.

* వెంకటేశ్వర రావు కోటగిరి ఎడిటింగ్ సోసోగా ఉంది. సినిమాలో ఇంకా కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేయాల్సింది.

* అనిల్ సుంకర పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఇక డైరెక్టర్ తేజ విషయానికి వస్తే.. సినిమా కథ అంత హీరోయిన్ యాంగిల్ లోనే నడిపించాడు. ఫ‌స్టాఫ్‌లో కాజ‌ల్‌, త‌నికెళ్ల‌భ‌ర‌ణి, సోనూసూద్ మ‌ధ్య స‌న్నివేశాలు బావున్నాయి.

కాజ‌ల్‌, సోనూసూద్ పాత్ర‌ల‌ను ఎంట‌ర్‌టైనింగ్‌గా మ‌లిచాడు. సెకండాఫ్ విష‌యంలో తేజ కాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. సినిమాలో సెకండాఫ్ సాగ‌దీత‌గా అనిపిస్తుంది. సీత పాత్రపై పెట్టిన దృష్టి.. కథనం మీద చూపించి ఉంటే సినిమా మరింత బాగా వచ్చేది. ఓవరాల్ గా పొగ‌రుబోతు సీత.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review