రివ్యూ: ‘సుబ్రహ్మణ్యపురం’

సినిమా టైటిల్ : ‘సుబ్రహ్మణ్యపురం’
తారాగణం : సుమంత్‌, ఈషా రెబ్బా, తదితరులు
నిర్మాణం: బీరం సుధాకర్ రెడ్డి
దర్సకత్వం: సంతోష్‌ జాగర్లపూడి
రేటింగ్ : 1.5 /5

సుమంత్ మంచి నటుడు. అక్కినేని మెచ్చిన నటుడు. ”నా తర్వాత అంత అండర్ ప్లే చేయగలిగే నటుడు మా కుటుంబంలో ఎవరైనా వున్నారా అంటే.. అది సుమంతే” అని ఓ సందర్భంలో అక్కినేని చేత కితాబు అందుకున్న నటుడు. అయితే ఎంతటి నటుడుకైన అంతిమ లక్ష్యం విజయం. విజయం ఉంటేనే ఇక్కడ మనుగడ. అయితే ఈ విజయమే సుమంత్ కు కలసిరావడం లేదు. ”సత్యం” తర్వాత ఆ స్థాయి విజయాన్ని మళ్ళీ అందుకోలేకపోయాడు సుమంత్. చాలా కాలం సినిమాలకు విరామం కూడా తీసుకున్నాడు.

అయితే ఈ మధ్య ‘మళ్ళీ రావా’ తో హిట్ కొట్టాడు. ఈ సినిమాతో మళ్ళీ వెలుగులోకి వచ్చాడు సుమంత్. ఇప్పుడు ‘సుబ్రహ్మణ్యపురం’. అనే థ్రిల్లర్ చేశాడు. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా కట్ చేశారు. ట్రైలర్ లో డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. చందూ మొండేటి తీసిన కార్తికేయ థీమ్ కనిపించింది ట్రైలర్స్ లో. ఈ రోజు సినిమా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమాలో ఏముందో తెలుసుకోవాలంటే ‘సుబ్రహ్మణ్యపురం’ రివ్యూలోకి వెళ్ళాసిందే.

కధ: ఈ సినిమా ట్రైలర్ చుసిన వారికి కధ గురించి చెప్పనక్కర్లేదు, ట్రైలర్ లోనే కధను చెప్పే ప్రయత్నం చేశారు. ‘సుబ్రహ్మణ్యపురం’ అనే వూరిలో ఓ దేవాలయం. ఆ దేవాలయం చుట్టూ ఓ మిస్టరీ. ఇదీ బేసిగ్గా ‘సుబ్రహ్మణ్యపురం’ కధ. ‘సుబ్రహ్మణ్యపురం’ విలేజ్ లో వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఆ ఆత్మహత్యలకు కారణం తెలియదు. దారుణంగా చనిపోతుంటారు. ఆ చావులకి ‘సుబ్రహ్మణ్యపురం’లోని దేవాలయానికి లింక్ ఏమిటో తెలుసుకోవడం కధానాయకుడి వంతు. బేసిగ్గా ఇలాంటి థ్రిల్లర్ సినిమాల కధలను రివ్యూలో ఇంతకంటే చెప్పకూడదు. అందుకే టూకీగా ఇదే కధే.

విశ్లేషణ:

‘ఈ ప్రాజెక్టులో నన్ను ఎక్కువ ఆకర్షించింది సుబ్రహ్మణ్యపురం’
”డబ్బు ఉండే సరికి నాలుగు గోడలు లేపేసి జనాలకు భక్తి ఉంది కాదా అని ఏదో ఒక రాయిని విగ్రహంగా పెట్టేస్తే.. అది దేవాలయం అవుతుందా చెప్పు’
‘దేవుడి మహిమా? లేక మానవ మేధస్సా? చూద్దాం’
‘ఈ దేవాలయంలో ఏమైనా అద్భుతాలు జరిగాయా కార్తీక్‌?’
‘నీకు దేవుడంటే నమ్మకం లేకపోతే అది నీ కర్మ’
‘గెలవడానికి ఆ భగవంతుడి సాయం కావాలని నేను నమ్ముతాను. కానీ నువ్వు ఆ భగవంతుడ్నే గెలుస్తాను అంటున్నావ్‌’

‘సుబ్రహ్మణ్యపురం’ ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్ ఇవి. సరిగ్గా అర్ధం చేసుకుంటే సినిమా ఇక్కడే అర్ధం ఉటుంది. దేవుడికి మనిషి మేదస్సుకి మధ్య జరిగిన కధ ఇది. దేవుడంటే విశ్వాసానికి, అవిశ్వాసానికి మధ్య నడిచే కధ ఇది.

పాయింట్ బావుంది కానీ దిన్ని డీల్ చేయడంలో తడబాటు కనిపిస్తుంది. చందూ మొండేటి తీసిన కార్తికేయ ఛాయలు అక్కడక్కడ కనిపిస్తాయి. అయితే కార్తికేయ ఇచ్చిన థ్రిల్ ఈ సినిమా ఇవ్వలేకపొయిందనే చెప్పాలి. థ్రిల్లర్ సినిమా చెబుతున్నాపుడు ట్విస్ట్లు టర్నింగులతో ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేయాలి. ఐతే ‘సుబ్రహ్మణ్యపురం’లో ఆ థ్రిల్ మిస్ అయ్యింది. ‘సుబ్రహ్మణ్యపురం’లో జరుగుతున్న వరుస ఆత్మహత్యలు ఆసక్తిని పెంచిన ఆ మిస్టరీని చెందించే విధానం విసుగు తెప్పిస్తుంది. అది అంత థ్రిల్లింగ్ వుండదు.
ఇలాంటి సినిమాలకు మూడ్ అవసరం. అయితే ఆ మూడ్ ని పాడు చేసినట్లు సుమంత్, ఇషాల ట్రాక్ ఉటుంది. దీంతో కధతో డిస్ కనెక్ట్ అవుతాం. ఇందులో కామెడి చేయాలనీ ప్రయత్నిచారు. కాని అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇలాంటి సినిమాలకి ప్రేక్షకుడు వినోదం కంటే సస్పెన్స్ కోసం వస్తాడు. అయితే అది ఇవ్వడంలో దర్శకుడు తడబడ్డాడు.

ఎవరెలా చేశారు ?
సుమంత్ నటనకు ఫుల్ మార్కులు పడతాయి. ఆయన నటనకు వంక పెట్టలేం. చాలా సెటిల్డ్ గా చేశాడు. తన పాత్ర మేరకు చక్కని ప్రతిభ కనబరిచాడు. ఇషా రెబ్బా అందంగా వుంది. పరిధి మేర నటించింది. ఇషా రెబ్బా తండ్రి పాత్ర పోషించిన సురేష్ కూడా ఒకే అనిపిస్తాడు.

టెక్నికల్ వాల్యూస్ :

ఈ సినిమాలో నిర్మాణ విలువలు లోపం అని చెప్పాలి. కొన్ని సన్నివేశాలు చుట్టేశారు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. సుమంత్ తప్పితే ఇతర తారాగణం పెద్దగా కనిపించదదు. డీవోపీ ఓకే. మ్యూజిక్ సోసో మార్కులు పడతాయి. నిర్మాణం చెప్పుకోదగ్గగా వుండదు.

ఫైనల్ టచ్ : ‘సుబ్రహ్మణ్యపురం’.. అంత మేటర్ లేదు