రివ్యూ : సూర్యకాంతం – రొమాంటిక్ కాంతం

స్టార్ కాస్ట్ : నిహారిక..విజయ్ తదితరులు..
దర్శకత్వం : ప్రణీత్
నిర్మాతలు: సందీప్ ఎర్రం రెడ్డి, సృజన్ యారబోలు, రామ్ నరేష్
మ్యూజిక్ : మార్క్ కె రాబిన్
విడుదల తేది : మార్చి 29, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : సూర్యకాంతం – రొమాంటిక్ కాంతం

మెగా డాటర్ నిహారిక సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ విజయం మాత్రం దక్కడం లేదు. చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఢమాల్ అవడం తో కాస్త గ్యాప్ తర్వాత మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సూర్యకాంతం గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నిహారిక.. రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకు షార్ట్ ఫిలిమ్స్ ఫేమ్ ప్రణీత్ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్స్ , ప్రోమోస్ కు మంచి స్పందన రావడమే కాదు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇగో అండ్ డామినేషన్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది…? కథ ఏంటి..? నిహారిక కెరియర్ లో హిట్ పడిందా..లేదా..? ప్రణీత్ మొదటి హిట్ కొట్టాడా..లేదా..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

అభి(రాహుల్ విజయ్)కు ఒక యాక్సిడెంట్ ఘటనలో సూర్యకాంతం(నీహారిక) పరిచయమవుతుంది. నిలువెల్లా చలాకీతనం ముక్కుసూటితనం నింపుకున్న సూర్యకాంతం అభికి బాగా నచ్చుతుంది..ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ అభి తో ఉండలేక సూర్యకాంతం దూరమవుతుంది.

కొంత గ్యాప్ తర్వాత అభికి పూజ(పెర్లెన్ బెసానియా)తో ప్రేమ మొదలవుతుంది. అనూహ్యంగా సూర్యకాంతం వెనక్కు వస్తుంది. ఆ తర్వాత అభి ఇద్దరి మధ్య ఇరుక్కు పోతాడు. సూర్యకాంతం పూజాలు పోటీ పడి అభిని ఒకరికి తెలియకుండా మరొకరు తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తారు. మరి ఈ ప్రేమ యుద్ధంలో సూర్యకాంతం ఎలా నెగ్గింది అనేదే కథ.

ప్లస్ :

* నిహారిక యాక్టింగ్

* కామెడీ

* సంగీతం

మైనస్ :

* సెకండ్ హాఫ్

* సాగదీత సన్నివేశాలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* హీరోయిన్ గా నిహారిక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ హీరోయిన్ గా మాత్రం సక్సెస్ అందుకోలేదు. చేసిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశే మిగల్చడం తో కాస్త గ్యాప్ తర్వాత సూర్యకాంతం సినిమా చేసింది. ఈ సినిమాలో నిహారిక తన టాలెంట్ ఏంటో నిరూపించింది. తనలో కామెడీ యాంగిల్ కూడా ఉందని నిరూపించింది.

* పెర్లెన్ భేసానియా గ్లామర్ పరంగానే కాకుండా నటన పరంగా కూడా మంచి మార్కులే వేసుకుంది.

* రాహుల్ విజయ్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇద్దరి మధ్య ప్రేమికుడి గా కామెడీ ని పండించాడు.

* శివాజీ రాజా హీరో తండ్రిగా సత్య అభి ఫ్రెండ్ గా కామెడీ పార్ట్ ని తీసుకున్నారు.

* నిహారిక తల్లి పాత్రలో సుహాసిని రోల్ బాగుంది.

సాంకేతిక విభాగం :

* మార్క్ కె రాబిన్ మ్యూజిక్ ఆకట్టుకుంది..రొమాంటిక్ కామెడీ గా సాగిన ఈ కథకు తనదయిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించి మెప్పించాడు.

* నిర్వాణ సినిమాస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

* హరిజ్ ప్రసాద్ సినిమా ఫొటోగ్రఫీ సినిమాకు సరికొత్త అందాలను తీసుకొచ్చింది.

* రవితేజ గిరిజాల ఎడిటింగ్ ఓకే

ఇక డైరెక్టర్ ప్రణీత్ బ్రమండపల్లి విషయానికి వస్తే షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులను , నెటిజన్లను ఆకట్టుకున్న ప్రణీత్..మొదటిసారి వెండితెర సినిమాకు డైరెక్టర్ గా పరిచమయ్యాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు. ఎంటర్ టైన్మెంట్ కి ప్రాధాన్యత ఇస్తూనే .. కాన్సెప్ట్ యూత్ తో పాటు ఫామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు.

తాను రాసుకున్న పాత్రలను అనుకున్నది అనుకున్నట్టు చూపించడంలో కూడా సక్సెస్ అయ్యారు. కథానుసారం వచ్చే హాస్య సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. ఓవరాల్ గా ప్రణీత్ మొదటి సినిమాతోనే ఫుల్ మార్కులు కొట్టేసారు.