రివ్యూ : సై..సై ‘సైరా’

స్టార్ కాస్ట్ : చిరంజీవి, అమితాబ్‌ బచ్చన్‌, నయనతార, జగపతిబాబు, తమన్నా తదితరులు..
దర్శకత్వం : సురేందర్‌రెడ్డి
నిర్మాతలు: రామ్‌చరణ్‌
మ్యూజిక్ : అమిత్
విడుదల తేది : అక్టోబర్ 02, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3.5/5

రివ్యూ : సై..సై ‘సైరా’

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. గాంధీ జయంతి కానుకగా ఈరోజు (అక్టోబర్‌ 2న) తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో భారీ ఎత్తున విడుదల అయ్యింది.

చిరంజీవి 12 ఏళ్ల కల ఈ చిత్రం..మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంది..? స్వాతంత్ర్య సమరయోధుడి కథను సురేందర్ ఎలా డైరెక్ట్ చేసారు..? నరసింహ రెడ్డి పాత్రలో చిరంజీవి ఎలా మెప్పించారు..? రామ్ చరణ్ నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయి..? నటి నటుల నటన ఎలా ఉంది..? ఎవరెవరు ఏ విధంగా ఆకట్టుకున్నారు ..? అమిత్ మ్యూజిక్ సంగతి ఏంటి..? అసలు సినిమా పరిస్థితి ఏంటి..? ఇవన్నీ ఇప్పుడు పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

రాయలసీమలోని రేనాడు ప్రాంతాన్ని 61మంది పాలెగాళ్ళు పరిపాలన చేస్తుంటారు..వారి మధ్య ఐక్యత అనేది ఉండదు. ఒకరిపై ఒకరికి అస్సలు పడదు. అప్పటి వరకు ఆ ప్రాంతంలోని పన్నులను నిజాం నవాబులు వసూళ్లు చేసేవారు. బ్రిటిష్.. నిజాం నవాబుల మధ్య జరిగిన ఒప్పందంతో.. అక్కడి పన్నులను వసూలు చేసుకునే హక్కును బ్రిటిష్ పాలకులకు అప్పగిస్తుంది. దాంతో వారు ప్రజల నుండి భారీగా పన్నులు వసూళ్లు చేస్తుంటారు.

వర్షాలు లేక ప్రజాలు నానా ఇబ్బందులు పడుతున్నప్పటికీ , తమ పన్నులు కట్టాలని ప్రజలను హింసిస్తుంటారు. ఆ సమయంలోనే సైరా నరసింహారెడ్డి ( చిరంజీవి) బ్రిటిష్ పాలకులపై పోరాటం చేసేందుకు సిద్ధం అవుతాడు. ఆలా సిద్దమైన నరసింహారెడ్డి కి ఆ 61మంది పాలెగాళ్ళు ఎలా సాయం చేసారు..? సైరా బ్రిటిష్ వారిపై ఎలా యుద్ధం చేసాడు..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* చిరంజీవి యాక్టింగ్

* డైరెక్షన్

* కథనం

* మ్యూజిక్

* కెమెరా వర్క్

* నటి నటులు

* సాంకేతిక వర్గం

మైనస్ :

* సినిమా ప్రారంభం

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* మెగా స్టార్ చిరంజీవి మరోసారి తన అద్భుతమైన నటన కనపరిచాడు. ఈ వయసులో కూడా ఆ పోరాట సన్నివేశాలు చేయడం , గుర్రపు స్వారీలు చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సినిమా మొత్తని తన భుజస్కందాలపై వేసుకొని నడిపించాడు. డైలాగ్స్ చెప్పడంలోనూ మరోసారి మెగాస్టార్ అనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.

* నరసింహ రెడ్డి కి గురువుగా గోసాయి వెంకన్నగా అమితాబ్ పాత్ర హుందాగా ఉన్నది.

* రాజా పాండి గా విజయ్ సేతుపతి , అవుకు రాజు గా సుదీప్ , వీర రెడ్డి గా జగపతి , నరసింహ రెడ్డి భార్య సిద్ధమా గా నయనతార , నరసింహ రెడ్డి ప్రియురాలు లక్ష్మి గా తమన్నా , ఝాన్సీ లక్ష్మి గా అనుష్క మొదలగు వారంతా ఎంతో చక్కగా నటించి సినిమాకు ప్రాణం పోశారు.

* సినిమా మొదట్లో పవన్ వాయిస్ , చివర్లో నాగ బాబు వాయిస్ ఓవర్ ఆకట్టుకున్నాయి.

సాంకేతిక విభాగం :

* ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషన్ ఎంతో జాగ్రత్తతో పనిచేసారు. ముందునుండి ఈ సినిమా కు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ మ్యూజిక్ అందిస్తున్నాడంటే అంత ఖంగారు పడ్డారు కానీ సినిమాకు తన సపోర్ట్ బాగా ఇచ్చారు. ముఖ్యంగా అమిత్ బ్యాక్ గ్రౌండ్ సినిమా స్థాయి ని పెంచింది. పోరాట సన్నివేశాల్లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని తీసుకొచ్చింది.

* ఈ సినిమాకు మరో ప్రధాన బలం విజువల్‌ ఎఫెక్ట్స్‌. చారిత్రక కథ కావటంతో ఆ కాలం నాటి పరిస్థితులను, వాతావరణాన్ని చూపించేందుకు గ్రాఫిక్స్‌ను భారీగా వినియోగించారు.

* రత్నవేలు కెమెరాపనితం మరోసారి అందరూ మాట్లాడుకునేలా చేసింది. ఇలాంటి కథ కు ఎలాంటి విజువల్స్ ఇవ్వాలో , కెమెరా వర్క్ ఎలా ఉండాలో అవన్నీ సరిగ్గా చూసుకొని సినిమా స్థాయి ని పెంచారు.

* ఇక ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు సైతం ప్రతిఒక్కరిని కట్టిపడేశాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ అయితే యాక్షన్ సన్నివేశాలు వస్తుంటే ఫుల్ గా ఎంజాయ్ చేసారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ అలాగే రామ్ లక్ష్మణ్ లు మాస్ ప్రేక్షకులకు ఎలాగైతే నచ్చుతుందో అలాంటి పోరాటలు చిరంజీవి తో చెప్పించి ఆకట్టుకున్నారు.

* బుర్రమాధవ్ డైలాగ్స్ థియేటర్స్ లలో ఈలలు వేయించాయి.

* రాజీవన్ ప్రొడక్షన్ డిజైన్ ప్రేక్షకులను బ్రిటిష్ కాలానికి తీసుకెళ్లాయి.

* ఇక రామ్ చరణ్ నిర్మాణ విలువల విషయానికి వస్తే.. తండ్రి కలల ప్రాజెక్ట్ కావటంతో చిరుతనయుడు రామ్‌చరణ్‌ బడ్జెట్ విషయంలో ఏ మాత్రం లెక్కలు వేసుకోకుండా ఖర్చు చేశాడు. భారీ స్టార్‌ కాస్ట్‌తో పాటు అదే స్థాయిలో సెట్స్‌ వేశారు. ఫారిన్‌ లోకేషన్స్‌లో పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. కేవలం ఒక్క వార్‌ ఎపిసోడ్‌ కోసమే ఏకంగా 50 కోట్ల వరకు ఖర్చు చేశాడు చరణ్‌. దీనికి తోడు తారల పారితోషికాలు కలుపుకొని సినిమా బడ్జెట్‌ రూ. 250 కోట్లు పెట్టి తెరపై ప్రతి రూపాయి కనపడేలా సినిమాను నిర్మించి శభాష్ అనిపించుకున్నాడు.

* డైరెక్టర్ సురేందర్ రెడ్డి దగ్గరికి వస్తే.. ఈ సినిమా ఛాన్స్ రాగానే కాస్త సమయం కావాలని చెప్పి..సమయం తీసుకున్నాడు. కానీ అప్పుడు ఎందుకు సమయం అడిగాడో సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్ధమవుతుంది. స్వాతంత్య్రోధ్యమంలో తొలి పోరాటం చేసింది మన తెలుగు వాడే అన్న విషయం చరిత్రలో లిఖించబడలేదన్న విషయం వింటే ప్రతీ తెలుగు వాడికి బాధకలుగుతుంది. ఆ బాధను తీర్చడానికే అన్నట్టుగా సైరా సినిమాను జాతీయ స్థాయిలో తెరకెక్కించాడు సూరి.

సినిమా చూస్తున్నామా..లేక మనమే అక్కడ ఉన్నామా అనే కోణంలో ప్రేక్షకులను సినిమాల్లోకి లీనం చేసాడు. 61 చిన్న చిన్న సంస్థానాలు.. వాళ్ళ మధ్య గొడవలు.. ఐక్యమత్యం లోపించడం.. బ్రిటిష్ పాలకులు పన్నులు వసూలు చేయడానికి రావడం.. ప్రజలను హింసించడం వంటి విషయాలను ఒక్కొక్కటిగా రివీల్ చేసుకుంటూ.. కథలోకి తీసుకెళ్లిన విధానం బాగుంటుంది.

అప్పటి బ్రిటిష్ పాలకులు పన్నుల కోసం ప్రజలను ఎలా హింసించేవారో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. బ్రిటిష్ పాలకులపై పోరాటం చేయాలి అంటే ఒక్కొక్కరుగా పోరాటం చేస్తే కుదరదని, అందరు కలిసి కట్టుగా పోరాటం చేయాలి అని 61 సంస్థానాల మధ్య ఐక్యమత్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు సైరా నరసింహారెడ్డి. అదే సమయంలో బ్రిటిష్ సైనికులతో ఒంటరిగా తన సైనికులతో పోరాటం చేస్తుంటాడు. ఇంటర్వెల్ కు ముందు వచ్చే పోరాట సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకుని విధంగా ఉంటాయి. ఇంటర్వెల్ సమయంలో బ్రిటిష్ అధికారిని చంపడంతో సెకండ్ హాఫ్ లో పై ఉత్కంఠత ఏర్పడుతుంది. సెకండ్ హాఫ్ మొత్తం కూడా పోరాట సన్నివేశాలు , సెంటిమెంట్ ఇలా ప్రతిదీ సినిమాకు ఎక్కడికో తీసుకెళ్లాడు. ఓవరాల్ గా మెగాస్టార్ కలను కల గా కాకుండా నిజం చేసి శభాష్ అనిపించుకున్నాడు.

తెలుగు మిర్చి రేటింగ్ : 3.5/5

Click here for English Review