రివ్యూ : తేజ్ ఐ లవ్యూ – ప్రేమను పంచలేకపోయాడు

స్టార్ కాస్ట్ : సాయి ధరమ్ తేజ్ , అనుపమ తదితరులు..
దర్శకత్వం : కరుణాకరన్
నిర్మాతలు: కె.ఎస్‌.రామారావు
మ్యూజిక్ : గోపిసుందర్
విడుదల తేది : జులై 06, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

రివ్యూ : తేజ్ ఐ లవ్యూ – ప్రేమను పంచలేకపోయాడు

గత రెండేళ్లుగా ఐదు ప్లాపులతో ఇబ్బంది పడుతున్న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్.. తాజాగా తేజ్ ఐ లవ్ యు అంటూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన రావడం తో సినిమా ప్రమోషన్లను భారీగా చేశారు. మెగా ఫ్యామిలీ అంతా ఈ సినిమాకు బాసటగా నిలిచి తేజ్ కు సపోర్ట్ చేయడం , మొదటిసారి ప్రేమ కథతో సాయి ప్రేక్షకుల ముందుకు రావడం తో సినిమా ఫై భారీ అంచనాలే పెట్టుకున్నాడు.

మరి ప్రేమ కథలకు దిట్టగా పేరున్న కరుణాకరన్ ఈ సినిమాతో ఎలాంటి కొత్త ప్రేమను ప్రేక్షకులకు అందించాడు..? భారీ అంచనాలను అందుకోవడంలో తేజ్ ఐ లవ్ యు సక్సెస్ అయ్యాడా..ఫెయిల్ అయ్యాడా..? అసలు కథ ఏంటి..? వరుస ప్లాప్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాడా..లేదా..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

తేజ్ (సాయి ధరమ్ తేజ్ ) పెద‌నాన్న(జ‌య‌ప్ర‌కాష్‌) ఇంట్లో ఉంటాడు..ఓ రోజు తన చెల్లెలు ఓ వ్యక్తిని ప్రేమించిన విషయాన్నీ తేజ్ తెలుసుకుంటాడు.. ఆ తర్వాత తన చెల్లెలి ప్రేమలో నిజాయితీ ఉందని ఆ విషయాన్నీ కుటుంబ సబ్యులకు చెపుతాడు. కానీ వారు మాత్రం ఈ పెళ్లి కి నిరాకరిస్తారు. అయినాగానీ తేజ్ తన చెల్లెలు ప్రేమించిన అతడితో పెళ్లి చేస్తాడు. దీంతో పెద‌నాన్న , తేజ్ ను ఇంటినుండి బయటకు పంపేస్తాడు. దాంతో హైద‌రాబాద్‌లోని బాబాయ్ (పృథ్వి) ఇంట్లో ఉంటూ, కాలేజీలో కొంత మంది స్నేహితుల‌తో క‌లిసి ఓ రాక్ బ్యాండ్‌ని ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ చేస్తుంటాడు.

ఓ రోజు నందిని (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్‌) తో తేజ్ కు పరిచయం ఏర్పడుతుంది. వీరిద్దరి మధ్య స్నేహం చిగురిస్తుంది. అయితే అనుకోకుండా ఓ అగ్రిమెంట్ కార‌ణంగా 15 రోజులు ఆమెకు అత‌ను బాయ్ ఫ్రెండ్‌గా న‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతాడు. అగ్రిమెంట్ కారణంగా వీరిద్దరూ ప్రేమికులుగా నటించాల్సి వస్తుంది. ఈ క్రమంలో తేజ్ కు నందిని ఫై నిజమైన ప్రేమ పుడుతుంది. ఈ విషయాన్నీ ఆమెకు చెపితే ఏమంటుందొ అనే సందేహం లో ఉంటాడు. ఈ లోపు నందినికి యాక్సిడెంట్ ఆయె, గతం మరచిపోంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? తేజ్ , నందినికి గతం గుర్తు తెచ్చేందుకు ఏం చేసాడు..? తేజ్ తన ప్రేమను నందికి చెప్పాడా..లేదా..? అసలు నందినికి ఎలా యాక్సిడెంట్ అవుతుంది..? నందిని ని ఎవరు చంపాలనుకుంటారు..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* సాయి ధరమ్ తేజ్ – అనుపమలా యాక్టింగ్

* సినిమా ఫొటోగ్రఫీ

* లొకేష‌న్స్, కాస్ట్యూమ్స్

మైనస్ :

* రొటీన్ కథ

* మ్యూజిక్

* స్క్రీన్ ప్లే

* కామెడీ

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ఇప్పటివరకు యాక్షన్ చిత్రాలతో అలరించిన సాయి ధరమ్ తేజ్ , మొదటిసారి ప్రేమకథను నమ్ముకొని ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాను నమ్మిన కథ కు పూర్థిస్థాయిలో న్యాయం చేసాడు. డైలాగ్స్ , డాన్స్ , ప్రేమ సన్నివేశాల్లో ఇలా ప్రతి ఫ్రెమ్ లో అదరగొట్టాడు. చిరంజీవి, నాగ‌బాబుని అక్క‌డ‌క్క‌డా ఇమిటేట్ చేస్తూ మెగా అభిమానులను అలరించాడు.

* అనుప‌మ మరోసారి తన నటనతో ఆకట్టుకుంది. కరుణాకరన్ ప్రతి సినిమాలో హీరోయిన్ ను చాల అందంగా చూపిస్తారని చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్రం లో కూడా అనుప‌మ ను చాల అందంగా చూపించి సక్సెస్ అయ్యాడు.

* చాల రోజుల తర్వాత వైవా హర్ష తెరఫై కనిపించి సందడి చేసాడు. ఇతడి కామెడీ సన్నివేశాలు బాగానే అలరించాయి.

* సాయిధ‌ర‌మ్ తేజ్ పెద‌నాన్న‌, పెద్ద‌మ్మ పాత్ర‌ల్లో జ‌య‌ప్ర‌కాష్‌, ప‌విత్ర లోకేష్‌లు కనిపించారు. కానీ వారి పాత్రలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

* పథ్వీ, సురేఖా వాణి, జోష్‌ రవి, అరుణ్‌ కుమార్‌ తదితరులు వారి వారి పరిధిలో బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

* గోపిసుందర్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. అందమైన చందమామ సాంగ్ ఒక్కటే బాగా అలరించింది. మిగతా సాంగ్స్ మామూలుగానే ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సైతం కథకు తగ్గట్లు ఉంది.

* ఆండ్రూ కెమెరా ప‌నిత‌నం మరోసారి ఆకట్టుకుంది. అందమైన లొకేషన్లను చాలా అందంగా చూపించి సక్సెస్ అయ్యాడు.

* డార్లింగ్ స్వామి మాట‌లు పర్వాలేదు అనిపించాయి.

* క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ సంస్థ నిర్మాణ విలువలు చాల బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ కరుణాకరన్ విషయానికి వస్తే..తేజ్ ఐ లవ్యూ టైటిల్ చూస్తేనే సినిమాలో ప్రేమ ఉందని అంత అనుకున్నారు కానీ ఆ ప్రేమ కేవలం టైటిల్ కు మాత్రమే పరిమితం చేసాడని సినిమా చూస్తే అర్ధం అవుతుంది. ఇది వరకు చాల సినిమాల్లో చూసిన , తెలిసిన కథనే మళ్లీ రాసుకొని మన ముందుకు వచ్చాడు కానీ కొత్తదనం కథ మాత్రం కాదు. పోనీ రొటీన్ కథే అయినప్పటికీ దానికి తగట్టు స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడా అంటే అదీలేదు.

హీరో, హీరోయిన్ల మ‌ధ్య సాగే ప్రేమను సరిగా చూపించలేకపోయాడు. కుటుంబం, ఆ నేప‌థ్యంలో భావోద్వేగాల్ని పండించ‌డంలోనూ విఫలం అయ్యాడు. కామెడీ లోని కొత్తదనం రాసుకోలేకపోయాడు. కాలం చెల్లిపోయిన సన్నివేశాలతో విసుగు తెప్పించాడు. ఫస్ట్ హాఫ్ అంత తేజ్ , తేజ్ కుటుంబం తో సాగించాడు. ఇంటర్వెల్ దగ్గర కాస్త సెకండ్ హాఫ్ ఫై ఆసక్తి పెంచాడు. కానీ సెకండ్ హాఫ్ మొదలు తోనే ఆ తర్వాత ఏం జరగబోతుందో ప్రేక్ష‌కుడి ఊహ‌కు త‌గ్గ‌ట్టుగానే సాగుతుంటుంది. ఇక క్లైమాక్స్ అయినా బాగా తీసాడా అంటే అది లేదు. ఓవరాల్ గా కరుణాకరన్ మరోసారి ఆకట్టుకోలేకపోయాడు.

చివరిగా :

సాయి ధరమ్ తేజ్ ప్లాపుల లిస్ట్ లో ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు. రొటీన్ కథ , ఆకట్టుకోలేకపోయిన కామెడీ, అర్ధం పర్థం లేని సన్నివేశాలతో సినిమా ఫీల్ పోయింది. తేజ్ ప్రేమను పంచలేకపోయాడు.