రివ్యూ : తెనాలి రామకృష్ణ – రొటీన్ కామెడీ లాయర్

స్టార్ కాస్ట్ : విశాల్‌, హన్సిక, వరలక్ష్మీ శరత్‌ తదితరులు..
దర్శకత్వం : జీ. నాగేశ్వరరెడ్డి
నిర్మాతలు: నాగ భూషణ్ రెడ్డి
మ్యూజిక్ : సాయి కార్తీక్
విడుదల తేది : నవంబర్ 15, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : తెనాలి రామకృష్ణ – రొటీన్ కామెడీ లాయర్

కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయినా దర్శకుడు జీ నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘తెనాలి రామ‌కృష్ణ బీఏ బీఎల్‌’. దేశముదురు బ్యూటీ హన్సిక హీరోయిన్ గా నటించగా..తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అయ్యప్ప, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, సప్తగిరి, రఘుబాబు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ తో సందీప్ ఎలాంటి హిట్ కొట్టాడు..? అసలు ఈ సినిమా కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌ (సందీప్‌ కిషన్‌) లాయర్‌..పేరుకే మాత్రమే లాయర్..కేసులు లేక ఖాళీగా ఉంటూ తన దగ్గరికి వచ్చే క్లయింట్స్‌కు ఆఫర్లు ప్రకటిస్తుంటాడు. అయినాగానీ ఎవరుకూడా తెనాలిని పట్టించుకోరు. మరోపక్క తన కొడుకు చిన్న చిన్న కేసులు వాదిస్తే గొప్పవాడు కాలేడని అతని తండ్రి దుర్గారావు (రఘుబాబు) ఏ చిన్న కేసు కూడా తెనాలి కి రాకుండా చేస్తుంటాడు. ఈ క్రమంలో తెనాలి… క్రిమినల్‌ లాయర్‌ చక్రవర్తి (మురళీ శర్మ) కూతురు రుక్మిణి (హన్సిక)తో ప్రేమలో పడతాడు.

ఇదే సమయంలో కర్నూలు సిటీలో సింహాద్రి నాయుడు ( అయ్యప్ప శర్మ) రౌడీగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. కోట్లు సంపాదిస్తాడు. రాజకీయాల్లోనూ తన పవర్‌ చూపించాలనుకుంటాడు. కానీ ఇండస్ట్రియలిస్ట్‌ అయిన వర్మలక్ష్మీ దేవి (వరలక్ష్మీ శరత్‌కుమార్) తన మంచితనం తో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతుంది. దీంతో వరలక్ష్మీ తన పొలిటికల్‌ కెరీర్‌కు అడ్డుపడుతుందని సింహాద్రి నాయుడు భావిస్తాడు. ఈ నేపథ్యంలో ఓ జర్నలిస్ట్‌ హత్య కేసులో వరలక్ష్మి ని ఇరికిస్తాడు..ఆ తర్వాత ఏం జరుగుతుంది..ఈ హత్య కు తెనాలికి సంబంధం ఏంటి..? ఈ కేసు నుండి వరలక్ష్మి ఎలా బయటపడుతుంది..? తెనాలి కి ఓ లాయర్ గా ఎలా గుర్తింపు వస్తుంది..? అనేది అసలు కథ.

ప్లస్ :

* సెకండ్ హాఫ్ కామెడీ

* ఇంటర్వెల్ ట్విస్ట్

* సందీప్ కిషన్

మైనస్ :

* కథ – కథనం

* రొటీన్ క్లైమాక్స్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ‘ప్రస్థానం’తో నటుడిగా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టిన సందీప్ కిషన్ ఆ తరవాత సోలో హీరోగా మారారు. తెలుగు, తమిళ భాషల్లో వరసపెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్ మాత్రం కొట్టలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో తెనాలి గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో తన పాత్ర కు పూర్తి న్యాయం చేసాడు. కామెడీ, యాక్షన్‌ సీన్స్‌లో ఇరగదీశాడు.

* దేశముదురు బ్యూటీ హన్సిక చాల రోజుల తర్వాత ఈ సినిమా తో తెలుగు రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ రీ ఎంట్రీ అమ్మడికి ఏమాత్రం పనికి రాలేదు. తన పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేకపోవటం, తన లుక్స్‌ కూడా అంతగా ఆకట్టుకోకపోవటంతో నిరాశపరిచింది.

* తమిళ్ చిత్రాల్లో విలన్ పాత్రలతో ఆకట్టుకుంటూ వస్తున్న నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌..ఈ సినిమా లో అంతా సింగిల్‌ ఎక్స్‌ప్రెషన్‌ తో కనిపంచింది. కానీ తన పాత్రకు మాత్రం ప్రాణం పోసింది.

* మురళీ శర్మ రొటీన్‌ పాత్రలో కనిపించాడు. ఇతర పాత్రల్లో రఘుబాబు, వెన్నెల కిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, సప్తగిరి, పోసాని కృష్ణమురళీ తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :

* సాయి కార్తీక్‌ అందించిన పాటలు ఓకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.

* సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్‌ సీన్స్‌లో పిక్చరైజేషన్‌ ఆకట్టుకుంటుంది.

* ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెడితే బాగుండు.

* నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ విషయానికి వస్తే..

కామెడీ చిత్రాలకు కేరాఫ్ అయినా నాగేశ్వర రెడ్డి..ఈ చిత్ర కథ – కథనం విషయంలో కాస్త తడపడినట్లు తెలుస్తుది. వరలక్ష్మీ, అయ్యప్ప శర్మ లాంటి ఇంటెన్స్‌ యాక్టర్స్‌ ఉన్నా వాళ్లను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు. సినిమా నిడివి తక్కువే అయినా కథనం ఆసక్తికరంగా లేకపోవటంతో ప్రేక్షకులు బోరు గా ఫీల్ అయ్యారు. సినిమాను ఇంట్రస్టింగ్‌గా మొదలు పెట్టిన దర్శకుడు, ఫస్ట్ హాఫ్‌లో ఆ పాయింట్‌ను పూర్తిగా పక్కన పెట్టేశాడు. ఫస్ట్ హాఫ్ అంత కూడా హీరో హీరోయిన్ల మధ్య లవ్‌ సీన్స్‌తోనే నడిపించాడు. అక్కడక్కడా కామెడీ, కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ పెట్టినప్పటికీ పూర్తిస్థాయి లో ఆకట్టుకోలేకపోయాయి.

సెకండ్ హాఫ్ కూడా పెద్దగా ఏమిలేదు. హీరో, విలన్‌ మధ్య ఎత్తు పై ఎత్తులతో ఇంట్రస్టింగ్‌గా నడిపించే అవకాశం ఉన్నా కామెడీకే ఇంపార్టెన్స్‌ ఇస్తూ.. ఏ మాత్రం లాజిక్‌ లేని సన్నివేశాలతో బోర్‌ కొట్టించాడు. కాకపోతే ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ లో కామెడీ వర్క్ అయ్యింది. కానీ క్లైమాక్స్ మాత్రం సాదాసీదాగా పూర్తి చేసాడు. ఓవరాల్ గా తెనాలి రామకృష్ణ ..పూర్తిస్థాయి లో ఆకట్టుకోలేకపోయాడు.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review