రివ్యూ : తిప్పరామీసం – ఎమోషల్ డ్రామా

స్టార్ కాస్ట్ : శ్రీ విష్ణు, నిక్కీ తంబోలీ, రోహిణి తదితరులు..
దర్శకత్వం : కృష్ణ విజయ్
నిర్మాతలు: రిజ్వాన్
మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి
విడుదల తేది : నవంబర్ 08, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : తిప్పరామీసం – ఎమోషల్ డ్రామా

సోలో చిత్రం తో నటుడిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన శ్రీవిష్ణు..ఆ తర్వాత వరుస పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన శ్రీవిష్ణు..ఆ తర్వాత హీరోగా కూడా రాణించాడు. తాజాగా తిప్పరామీసం చిత్రం తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, రిజ్వాన్ నిర్మాణంలో, ‘అసుర’ ఫేమ్ కృష్ణ విజయ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ లో నిక్కీ థంబోలి హీరోయిన్‌గా నటించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది..? ఈ చిత్ర కథ ఏంటి..? అనేది చూద్దాం.

కథ :

మణిశంకర్ (శ్రీవిష్ణు) చిన్నప్పటి నుండే డ్రగ్స్ అలవాటై..కన్న తల్లినే శత్రువు గా చూస్తుంటాడు. ఆలా పెరిగి పెద్దయిన మణి..ఓ పబ్ లో డీజే గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలోనే మౌనిక (నిక్కీ తంబోలి)తో ప్రేమలో పడతాడు. బెట్టింగ్ అంటే ఎక్కువ గా ఇష్టపడే మణి..చాల డబ్బులు బెట్టింగ్లో పోగొట్టుకుని ఆర్ధికంగా నష్టపోతాడు. ఎలాగైనా ఆర్థికంగా సెట్ అవ్వాలని ఇల్లీగల్ పనులు చేయడం మొదలు పెడతాడు. ఆలా మణి కొన్ని సమస్యల్లో ఇరుకుంటాడు. ఆ సమస్యల నుండి ఎలా బయటపడ్డాడు..? తల్లి ప్రేమను ఎలా తెలుసుకుంటాడు..? మణి ఎందుకు తన తల్లి ను శత్రువు గా చూస్తాడు అనేది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది.

ప్లస్ :

* శ్రీ విష్ణు

* తల్లి సెంటిమెంట్

* క్లయిమాక్స్

మైనస్ :

* కథ కథనం

* సెకండ్ హాఫ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* శ్రీవిష్ణు మణిశంకర్ పాత్రలో అద్భుతంగా నటించారు. క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హీరోయిన్ తో సాగే లవ్ ట్రాక్ బాగానే ఉంది.

* సీనియర్ నటి రోహిణి అమ్మ‌పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. కొడుకు మీద ప్రేమను వ్యక్త పరిచే ప్రతి సన్నివేశంలో ఆమె నటన ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది.

* హీరోయిన్ గా నటించిన నిక్కీ తంబోలి కొన్ని లవ్ సీన్స్ లో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది.

* అలాగే హీరోకి మామయ్య పాత్రలో కనిపించిన బెనర్జీ మరియు చెల్లిగా నటించిన నటి కూడా బాగా నటించారు.

* ఇతర పాత్రల్లో నటించిన వారంతా వారి పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక విభాగం :

* సురేశ్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంది. తల్లి కొడుకుల సెంటి మెంట్ కు కరెక్ట్ గా సెట్ అయ్యింది. సాంగ్స్ విషయానికి వస్తే లవ్ సాంగ్ బాగుంది.

* సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా అందంగా చూపించారు.

* ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండు. ఇంకొన్ని సాగతీత సన్నివేశాలను తగ్గించాల్సింది.

* రిజ్వాన్ నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.

* ఇక డైరెక్టర్ కృష్ణ విషయానికి వస్తే..కథ కథనం పెద్దగా ఆకట్టుకోకపోయిన తల్లి – కొడుకుమధ్య సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ చేసాడు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మరియు ప్రీ ఇంటర్వెల్ లో గేమ్ యాక్షన్ సీక్వెన్స్ పర్వాలేదనిపించినా.. స్క్రీన్ ప్లే సాగదీసాడు. హీరో జర్నీని బలంగా ఎలివేట్ చేసినప్పటికీ.. హీరోకి ఎదురయ్యే సమస్యలను కానీ.. హీరో పాత్రకి అతని తల్లి పాత్రకు మధ్య వచ్చే సంఘర్షణ గానీ ఆ స్థాయిలో రాసుకోలేకపోయాడు. క్లయిమాక్స్ మాత్రం బాగా తెరకెక్కించారు. ఓవరాల్ గా సినిమాలు ఎమోషనల్ డ్రామాగా చూపించే ప్రయత్నం చేసాడు.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review