రివ్యూ : పరువు – ప్రేమల మధ్య నలిగే ‘ఉప్పెన’

స్టార్ కాస్ట్ : వైష్ణవ్ తేజ్ , కృతి శెట్టి , విజయ్ సేతుపతి ‌ తదితరులు..
దర్శకత్వం : బుచ్చిబాబు
నిర్మాతలు: మైత్రి మూవీస్
మ్యూజిక్ : దేవి శ్రీ
విడుదల తేది : ఫిబ్రవరి 12, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 3.25/5

వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఉప్పెన. కృతిశెట్టి కథానాయిక గా నటించగా విజయ్‌ సేతుపతి కీలకపాత్ర పోషించాడు. గతేడాది వేసవి కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ కావడం ..ప్రేక్షకులు సైతం థియేటర్స్ కు అలవాటు పడడం తో ఈ సినిమాను ఈరోజు ( ఫిబ్ర‌వ‌రి 12న) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఇలా ఉంది..? వైష్ణవ్ – కృతిలా నటన ఇలా ఉంది..? సన డైరెక్షన్ ఆకట్టుకుందా..? సినిమా కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

ఆశి (పంజా వైష్ణవ్ తేజ్) నిరుపేద మత్స్యకారకుటుంబంలో జన్మిస్తాడు. అదే గ్రామంలో బాగా డబ్బున్న ఆసామి శేషారాయనం (విజయ్ సేతుపతి). పరువు ముఖ్యమని భావించే ఈయనకు ఒక్కగానొక్క కూతురు సంగీత (కృతి శెట్టి ). అయితే చిన్నప్పటి నుండే ఆశీ ఆమెను ప్రేమిస్తాడు. సంగీత సైతం ఆశి ని ప్రేమిస్తుంది. పరువే ముఖ్యమని భావించే తన తండ్రి మన ప్రేమను ఒప్పుకోడని , కొంతకాలం ఊరు వదిలి వెళ్లిపోతామని చెప్పి , ఆశిని తీసుకొని కొంతకాలం పాటు ఊరు వదిలి పారిపోతుంది. తన కూతురు ప్రేమించిన వాడితో ఊరు వదిలి పోయిందని..ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని శేషారాయనం అనుకుంటాడు. మరి ఆ తర్వాత కూతురు వస్తుందా..? వీరి ప్రేమను శేషారాయనం ఒప్పుకుంటాడా లేదా..? అసలు ఏంజరుగుతుంది..? అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.

ప్లస్ :

  • దేవి శ్రీ మ్యూజిక్
  • వైష్ణవ్ తేజ్ – కృతి శెట్టిల యాక్టింగ్
  • విజయ్ సేతుపతి రోల్
  • ఎమోషన్స్
  • క్లైమాక్స్

మైనస్ :

  • సెకండ్ హాఫ్ నేరేషన్
  • విజయ్ సేతుపతి డబ్బింగ్ నటీనటుల తీరు :
  • వైష్ణవ్ తేజ్ – కృతిలకు మొదటి చిత్రమైనప్పటికీ ఎంతో అనుభ‌వం ఉన్న న‌టుల్లా నటించి ప్రాణం పోశారు. వైష్ణవ్ యాక్షన్, లుక్స్ ఇలా ప్రతి దాంట్లో చాల బాగా నటించారు. ఇక కృతి సైతం తన గ్లామర్ తో , నటనతో కట్టిపడేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో తండ్రి తో మాట్లాడే సన్నివేశాల్లో అద్భుతంగా నటించి మెప్పిచింది.
  • విజ‌య్ సేతుప‌తి పాత్ర సినిమాకు ప్రధాన‌బ‌లం. రాయ‌నం పాత్రలో ఒదిగిపోయారు. క‌థానాయ‌కుడి తండ్రిగా సాయిచంద్ న‌ట‌న దీటుగా ఉంది. మిగిలిన పాత్రధారులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం :

  • ముఖ్యముగా దేవి శ్రీ సంగీతం గురించి అంత మాట్లాడుకోవాలి. ఈ మధ్య దేవి నుండి వచ్చిన పాటలన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయిన..ఈ మూవీ లో మాత్రం పాత దేవి ని గుర్తు చేసారు. నీ నీలి కన్ను సముద్రం పాట.. , జల జల జారే,.. ఇలా పాటలన్నీ ప్రేక్షకులను మెప్పించాయి. ఆడియో పరంగానే కాదు విజువల్ గా కూడా బాగా ఆకట్టుకున్నాయి.
  • నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ నిర్మాణ విలువల్లో రాజీ పడలేదు.
  • శ్యామ్‌దత్‌ సినిమాటోగ్రఫీ చాలా ఫ్రెష్‌ లుక్‌ను ఇచ్చింది. ఇంతకు ముందు ప్రస్తావించినట్లు దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు మేజర్‌ ఎస్సెట్‌గా నిలిచింది.
  • ఇక డైరెక్టర్ బుచ్చిబాబు విషయానికి వస్తే.. సుకుమార్ దగ్గర ఎన్నో చిత్రాలకు పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమాతో డైరెక్టర్ గా మారారు. ఈయన రాసుకున్న లైన్ పాతదే అయినప్పటికీ తెరపై చాల కొత్తగా చూపించి సక్సెస్ అయ్యాడు. చక్కటి సాంకేతిక వర్గం , మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం తో ఈ కథ కు అవన్నీ ప్రాణం పోసి సక్సెస్ చేసాయి. ఫస్ట్ హాఫ్ అంత హీరో – హీరోయిన్ మధ్య ప్రేమ ను చూపించిన డైరెక్టర్..సెకండ్ హాఫ్ లో మాత్రం కాస్త సాగదీసి సన్నివేశాలు రాసుకున్నాడు. అవి కాస్త ఇబ్బంది పెట్టాయి. ఆ తర్వాత ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మ‌ళ్లీ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. సంగీత ఇంటికి రావ‌డం, తండ్రితో మాట్లాడే స‌న్నివేశాలు ర‌క్తిక‌ట్టిస్తాయి. అయితే అప్పటివ‌ర‌కూ కర్కశంగా క‌నిపించిన రాయ‌నం… చివ‌రిలో కూతురు చెప్పే మాట‌ల్ని వింటూ నిలబడటం చూస్తుంటే ఒక్కసారిగా ఆ పాత్ర తేలిపోయిన‌ట్టు అనిపిస్తుంది. దర్శకుడు త‌న ప్రత్యేక‌త‌ని ప్రద‌ర్శిస్తూ క్లైమాక్స్‌లో క‌థ‌నాన్ని మ‌లిచిన ‌విధానం మాత్రం ఆక‌ట్టుకుంటుంది.

ఫైనల్ గా : పరువు – ప్రేమల మధ్య నలిగే ‘ఉప్పెన’