రివ్యూ : వ‌జ్ర క‌వ‌చ‌ర‌ధ‌ర గోవింద‌ – బిల్డప్ ఎక్కువయ్యింది..

స్టార్ కాస్ట్ : సప్తగిరి, వైభవి జోషి తదితరులు..
దర్శకత్వం : అరుణ్ పవర్
నిర్మాతలు: నరేంద్ర, జీవిఎన్ రెడ్డి
మ్యూజిక్ : బుల్గానియన్
విడుదల తేది : జూన్ 14, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2/5

రివ్యూ : వ‌జ్ర క‌వ‌చ‌ర‌ధ‌ర గోవింద‌ – బిల్డప్ ఎక్కువయ్యింది..

అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరియర్ మొదలుపెట్టిన సప్తగిరి ఆ తర్వాత ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’, ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బీ’ చిత్రాలతో హీరోగా మరి తన సత్తా చాటాడు. తాజాగా మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అరుణ్ పవార్ డైరెక్షన్‌లో శివ శివమ్ ఫిలింస్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మాణంలో వ‌జ్ర క‌వ‌చ‌ర‌ధ‌ర గోవింద‌ అనే సినిమా తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా తో సప్తగిరి ఏం చెప్పాలనుకున్నాడు..ఏం చెప్పాడు..? అసలు ఈ చిత్ర కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

గోవింద (సప్తగిరి ) తన ఊర్లో ప్రజలంతా కాన్సర్ తో చనిపోతూ ఉండడం తట్టుకోలేకపోతాడు. ఎలాగైనా దీనిని అరికట్టాలని అన్ని ప్రయత్నాలు చేస్తాడు. తనకు సాయం చేస్తానన్న ఎమ్మెల్యే చేతిలో కూడా మోసపోతాడు. ఈ నేపథ్యంలో గోవింద కు ఓ నిధికి సంబందించిన విషయం తెలుస్తుంది. ఆ నిధి ని కనిపెట్టి..దాంతో ఊరి ప్రజలను కాపాడాలని అనుకుంటాడు.

ఈ నిధి విషయం గోవింద కు తెలుసు అని తెలుసుకున్న రౌడీ బ్యాచ్ గోవింద వెంటపడతారు. మరి ఆ రౌడీ గ్యాంగ్ నుండి గోవింద ఎలా తప్పించుకోగలిగాడు ..? నిధి ని సంపాదించాడా లేదా..? ఆ నిధి కోసం ఎలాంటి కష్టాలు పడ్డాడు..? ఆ ఊరి ప్రజలను ఎలా కాపాడుకోగలిగాడు..? అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* సప్తగిరి

* అక్కడక్కడక కామెడీ

మైనస్ :

* కథ – స్క్రీన్ ప్లే

* డైరెక్షన్

* సెకండ్ హాఫ్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* సప్తగిరి యాక్టింగ్..కామెడీ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు..ఆయన వేసి పంచ్ లు..డైలాగ్స్ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక ఈ సినిమాలో కూడా అదే రీతిలో నవ్వించే ప్రయత్నామ్ చేసారు. సప్తగిరి యాక్షన్ లో కంటే కామెడీ లోనే బాగా ఆట్టుకున్నాడు. గతం మర్చిపోయిన సన్నివేశాల్లో.. రౌడీలతో సాగే సన్నివేశాల్లో అలాగే వజ్రం కోసం గుహలోకి వెళ్లిన సీన్స్ లో సప్తగిరి తన కామెడీ టైమింగ్ తో అలరించారు.

* ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచమైన ‘వైభవి జోషి’ తన గ్లామర్ , యాక్టింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

* శ్రీనివాస్ రెడ్డి, వేణు అలాగే మిగిలిన కమెడియన్స్ వారి వారి పరిధిలో నవ్వించే ప్రయత్నం చేసారు కానీ పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు.

సాంకేతిక విభాగం :

* బుల్గానియన్ మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. నేపథ్యం సంగీతం కూడా మామూలుగానే ఉంది.

* సినిమా ఫొటోగ్రఫీ కొన్ని చోట్ల బాగానే ఉందనిపించింది.

* ఎడిటింగ్ విషయంలో కూడా అక్కడక్కడా బోర్ కొట్టించింది. సెకండ్ హాఫ్ లో అనవసర సీన్ల తో విసుగు తెప్పించారు.

* నరేంద్ర, జీవిఎన్ రెడ్డి నిర్మాణ విలువలు కథకు తగ్గట్లే ఉన్నాయి.

* ఇక డైరెక్టర్ అరుణ్ పవర్ విషయానికి వస్తే ఎందులోనూ తన సత్తా చాటలేకపోయారు. కామెడీ స్టార్స్ చాలామందే ఉన్నప్పటికీ వారిని ఉపయోగించుకోవడం లో విఫలం అయ్యాడు. ఇక రాసుకున్న కథ బాగున్నప్పటికీ దానిని స్క్రీన్ ఫై చూపించడంలో నిరాశ కల్పించాడు.

సప్తగిరి ని ఓ రేంజ్ యాక్షన్ హీరో అనుకున్నాడో ఏమో గాని ఆ రీతిలో చూపించి కామెడీ ని చేసాడు. సన్నివేశాలు అలాగే ఏ మాత్రం ఆసక్తికరంగా సాగని కథాకథనం లాంటి కొన్ని అంశాలతో ప్రేక్షకులను విసుగు తెప్పించాడు.

ఫస్ట్ హాఫ్ అంత హీరో తపన..ఊరి కోసం ఏం చేయాలనీ ఆలోచించడం తోనే నడిపించాడు. పోనీ సెకండ్ హాఫ్ లోనైనా బాగా తీసాడా అంటే అది లేదు..కొన్ని సన్నివేశాల్లో అయితే దర్శకుడు తనకు తోచినట్లు రాసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయాడా అన్న భావన కలుగుతుంది. ఓవరాల్ గా సప్తగిరి బిల్డప్ ఇచ్చాడు తప్ప కథలో దమ్ము చూపించించలేకపోయాడు.

తెలుగు మిర్చి రేటింగ్ : 2/5

Click here for English Review