రివ్యూ : వీర భోగ వసంత రాయలు

స్టార్ కాస్ట్ :నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్ మరియు శ్రీ విష్ణు
దర్శకత్వం : ఇంద్రసేన.ఆర్
నిర్మాతలు: అప్పారావ్ బెల్లన
మ్యూజిక్ : మార్క్ కె రాబిన్
విడుదల తేది : అక్టోబర్ 26, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2/5

రివ్యూ : వీర భోగ వసంత రాయలు

నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ వీర భోగ వసంత రాయలు ‘. ఇంద్రసేన ఆర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కి ‘కల్ట్ ఈజ్ రైజింగ్’ అనేది టాగ్ లైన్..పెట్టి సినిమా ఫై ఆసక్తి నెలకొల్పారు. ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో నటించడం , టీజర్స్ , ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆసక్తి గా ఉండడం తో సినిమా అంచనాలు పెరిగాయి.. కానీ రిలీజ్ సమయానికి సినిమా ప్రమోషన్స్ చేయకుండా , డైరెక్ట్ గా థియేటర్స్ లలో విడుదల చేసే సరికి అసలు ఈ సినిమా ఈరోజు విడుదల అని కూడా చాలామందికి తెలియదు. మరి ప్రమోషన్స్ లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..? అసలు ఈ ‘ వీర భోగ వసంత రాయలు ‘ కథ ఏంటి..? నిర్మాణ విలువలు ఎలా ఉన్నాయి..? లీడ్ యాక్టర్స్ ఎలా నటించారు..? మిగత విశేషాలు ఏంటి అనేది రివ్యూ లో చూద్దాం.

కథ :

ఈ కథ గురించి సింపుల్ గా చెప్పాలంటే మిస్సింగ్ కు సంబందించిన కథ. కొంద‌రు హైజాక‌ర్స్ క్రికెటర్స్‌ తో పాటు పలువురు ప్రముఖులు ప్రయాణిస్తున్న ఫ్లైట్‌ని హైజాక్ చేయ‌గా, వారి నుండి ప్రయాణికుల‌ని త‌ప్పించే క్ర‌మంలో హీరోలు ఏం చేసారు..ఎలా చేశారనేది సినిమా కథ. ఒక ఫ్లైట్ ను హైజాక్ చేయడం.. ఒక ఇల్లు మాయమైపోవడం.. అనధలైన ఆడ పిల్లలు అదృశ్యం కావడం ఇవన్నీ సినిమాలోని మిస్సింగ్ కేసులు. ఈ మిస్సింగ్ కేసులను క్రైమ్ బ్రాంచి హెడ్ దీపక్‌ (నారా రోహిత్) , పోలీస్ అధికారి వినయ్‌ (సుధీర్ బాబు), ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ నీలిమా ( శ్రీయ ) ఈ ముగ్గురు ఎలా ఆ మిస్సింగ్ కేసులను ఛేదించారు..? మరి ఈ కథ కు రాయలు (శ్రీ విష్ణు) కు సంబంధం ఏంటి..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.

ప్లస్ :

* స్టోరీ లైన్

* లీడ్ యాక్టర్స్ యాక్టింగ్

* చివరి 15 నిముషాలు

మైనస్ :

* సాగదీత సన్నివేశాలు

* దర్శకత్వ లోపాలు

* నిర్మాణ విలువలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రియా శరణ్ మరియు శ్రీ విష్ణు వీరంతా కూడా కథ కు తగ్గ నటన చేసి ఆకట్టుకున్నారు.

* సుధీర్‌ నటన పరంగా ఆకట్టుకున్నా వాయిస్‌ తనది కాకపోవటంతో అభిమానులు , ప్రేక్షకులు డిస్పాయింట్ అయ్యారు.

* నారా రోహిత్, శ్రీయ లు తెర మీద కనిపించింది కాసేపైనా వారి పరిధి మేరకు బాగానే చేసారు. ఇంకాసేపు ఉంటె బాగుండు అనిపించింది.

* టైటిల్ రోల్ లో చేసిన శ్రీ విష్ణు దారుణంగా నిరాశపరిచాడు. ఇంతకాలం లవర్ బాయ్ పాత్రల్లో , పక్కింటి అబ్బాయి పాత్రలో కనిపించిన శ్రీవిష్ణు..ఈ మూవీ లో విలన్‌ లుక్‌లో ఆకట్టుకోలేకపోయాడు. డైలాగ్‌ డెలివరీ కూడా నిరాశకలిగిస్తుంది. నటన పరంగానే కాదులుక్ పరంగా కూడా మార్కులు వేసుకోలేకపోయాడు.

* ఇక మిగతా పాత్రల గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.

సాంకేతిక విభాగం :

* మార్క్ కే రాబిన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జస్ట్ ఒకే..

* ఎస్ వెంకట్ , నవీన్ యాదవ్ సినిమా ఫొటోగ్రఫీ పర్వాలేదు అనిపించింది.

* ఎడిటింగ్ కూడా చాల బోర్ కొట్టించింది. చాల సన్నివేశాలు లాజిక్ లేకుండా వస్తుండడం తో థియేటర్స్ లలో ప్రేక్షకులు ఏం చేయాలో తెలియక అటు ఇటు చూడడం మొదలు పెట్టారు.

* నిర్మాణ విలువల గురించి ఎంత తక్కువ మాట్లాడుకునే అంత మంచిది.

* ఇక డైరెక్టర్ ఇంద్రసేనా గురించి చెప్పాలంటే తాను రాసుకున్న కథ లైన్ బాగున్నప్పటికీ , దానిని తెరకెక్కించడం లో విఫలం అయ్యాడు. కథ మొదలు పెట్టడం ఆసక్తిగా అనిపించినా , పది నిమిషాలకే దానిని పక్క దారిలోకి తీసుకెళ్లాడు. చాలా సన్నివేశాలు లాజిక్‌ లేకుండా వస్తుండడం ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. చివరి 15 నిమిషాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ దానిముందు సాగిన కథ తర్వాత ఆ 15 నిముషాలు అనవసరం అనిపిస్తాయి. ఓవరాల్ గా డైరెక్టర్ గా ప్రేక్షకుల చేత మార్కులు వేసుకోలేకపోయాడు ఇంద్రసేనా.

చివరిగా :

ముగ్గురు హీరోలు ఉన్నారని సినిమాకు వెళ్తే..థియేటర్ లో చుక్కలు చూడడం ఖాయం. సినిమా ఓపెనింగ్ బాగున్నప్పటికీ , ఆ తర్వాత మాత్రం ఎప్పుడు బయటకు వెళ్దామా అనిపిస్తుంది. లీడ్ యాక్టర్స్ కాస్త కష్టపడినప్పటికీ, ఆ కష్టం మాత్రం సినిమాను విజయ పధంలో చేర్చలేకపోయింది. దసరా బరి తర్వాత వచ్చిన ఈ వీర భోగ వసంత రాయలు..ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

నోట్ :

సినిమాను థియేటర్స్ లలో చూడండి..పైరసీ చేసి సినిమా ఇండస్ట్రీ ని నాశనం చేయకండి. ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది కేవలం మన ఆనందం కోసమే..అలాంటి ఆనందాన్ని పైరసీ లో చూడకండి.

తెలుగు మిర్చి రేటింగ్ : 2/5

Click here for English Review