రివ్యూ : విజేత – ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా..!

స్టార్ కాస్ట్ : కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, మురళి శర్మ తదితరులు..
దర్శకత్వం : రాకేష్ శశి
నిర్మాతలు: సాయి కొర్రపాటి ప్రొడక్షన్
మ్యూజిక్ : హర్షవర్ధన్ రామేశ్వర్
విడుదల తేది : జులై 12, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : విజేత – ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా..!

ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి దాదాపు అరడజన్ కు పైగా హీరోలు ఇండస్ట్రీ కి పరిచమై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అభిమానులు ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యం లో మరో హీరో ఇండస్ట్రీ కి పరిచమైయ్యాడు. ఆయనే కళ్యాణ్ దేవ్. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు గా కొణెదల ఫ్యామిలీ లో అడుగుపెట్టిన కళ్యాణ్ ..ఇప్పుడు మెగా హీరో గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

చిరంజీవి నటించిన విజేత సినిమా టైటిల్ ను పెట్టుకొని , రాకేష్ శశి దర్శకత్వం లో కళ్యాణ్ దేవ్ విజేత గా రావడం జరిగింది. సాధారణం గా ఏ హీరోయినా తన మొదటి సినిమా ప్రేమకథ గానో లేదా యాక్షన్ బ్యాక్ డ్రాప్ గానో ఎంచుకుంటారు. కానీ కళ్యాణ్ మాత్రం మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి `విజేత‌` గా వచ్చాడు. మరి కళ్యాణ్ దేవ్ టైటిల్ కు తగట్టు విజేత గా నిలిచాడా..లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

రామ్‌(క‌ల్యాణ్ దేవ్‌) ఇంజనీరింగ్ పూర్తి చేసి , ఏ పని చేయకుండా స్నేహితులతో కలిసి గాలి తిరుగుడు తిరుగుతుంటాడు. ఎదిగిన కుర్రాడు ఏ పని చేయకుండా తీరుగుతున్నాడే అని తండ్రి శ‌్రీనివాస‌రావు(ముర‌ళీశ‌ర్మ) బాధపడుతుంటాడు. స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగి గా పనిచేస్తూ కుటుంబ బాధ్యతలను ఒక్కడే నెట్టుకొస్తుంటాడు శ్రీనివాసరావు. ఈ నేపథ్యం లో రామ్ ఎదురింట్లో ఛైత్ర‌(మాళ‌వికా నాయ‌ర్‌) అద్దెకు దిగుతుంది. ఛైత్ర‌ను చూసిన రామ్ ఆమెను ఇంప్రెస్ చేయ‌డానికి విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు.

రోజు తండ్రి చెప్పే మాటలు వినలేక, తిట్టే తిట్లు భరించలేక ఈవెంట్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్ మొదలు పెడతాడు.. కానీ ప్రారంభంలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ ప్లానింగ్ లో త‌ప్పులు జ‌రిగి చెడ్డ పేరు వ‌స్తుంది. దాంతో శ్రీనివాసరావు కు గుండెపోటు వస్తుంది. త‌ను లేక‌పోతే త‌న కుటుంబం ఏమైపోతుందోన‌ని శ్రీనివాస‌రావు బాధ‌ప‌డుతుంటాడు. శ్రీనివాస‌రావు పరిస్థితి చూసిన స్నేహితుడు(త‌నికెళ్ల‌భ‌ర‌ణి).. రామ్‌కి శ్రీనివాస‌రావు గురించి నిజం చెప్పి.. కుటుంబానికి తోడుగా నిల‌బ‌డ‌మ‌ని చెపుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? తండ్రి కోసం రామ్ మారాడా..? లేదా..? తన తండ్రి గురించి రామ్ కు తెలిసిన నిజం ఏంటి..? వంటివి తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* సెకండ్ హాఫ్

* మురళీ శర్మ యాక్టింగ్

* తండ్రి కొడుకుల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు

మైనస్ :

* కామెడీ

* మ్యూజిక్

* ఫస్ట్ హాఫ్ రొటీన్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ముందుగా మురళీ శర్మ యాక్టింగ్ గురించి చెప్పాలి..ఇప్పటికే చాల సినిమాల్లో తండ్రి పాత్రలో మురళీ శర్మ ను చూసాం..కానీ ఈ మూవీ లో మాత్రం నిజమైన తండ్రి ఎలా ఉంటాడనేది కళ్లకు కట్టినట్లు చూపించాడు. కుటుంబాన్ని పోషించే తండ్రి గా , ఎదిగిన కుర్రాడు ఇంట్లో ఉన్న కానీ ఏ పని చేయడంలేదంటూ బాధపడుతూ తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు.

ముఖ్యం గా కళ్యాణ్ దేవ్ – ఈయన మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. త‌న‌దైన న‌ట‌న‌తో, అనుభ‌వంతో పాత్ర‌కు మురళీ శర్మ న్యాయం చేసాడు.

* ఇక హీరో కళ్యాణ్ దేవ్ కు మొదటి చిత్రమే కావడం తో ఆయన నుండి భారీగా అంచనాలు వేసుకోడదు. తన పాత్రలో ఒదిగిపోయి నటించాడని చెప్పొచ్చు.

* మాళ‌వికా నాయ‌ర్ పేరుకు హీరోయిన్ కానీ… ఆ పాత్ర‌లో న‌ట‌న‌కు పెద్ద‌గా స్కోప్ లేదు.

* తనికెళ్ళ భరణి, మురళి శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పృథ్వి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్ (తమిళ్), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రం, సుదర్శన్, మహేష్ విట్టా మొదలగు వారు వారి వారి ప‌రిధి మేర చ‌క్క‌గా న‌టించారు.

సాంకేతిక విభాగం :

* హ‌ర్ష‌వర్ధ‌న్ రామేశ్వ‌ర్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

* బాహుబలి ఫేమ్ కె.కె.సెంథిల్ కుమార్ తన కెమెరాపనితాన్ని చూపించాడు.

* రాకేష్ శశి మాటలు అక్కడక్కడా బాగానే పేలాయి. ముఖ్యం గా తండ్రి – కొడుకు మధ్య వచ్చే సన్నివేశాల్లో డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి, ఆలోచింపచేసాయి.

* కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ బాగానే ఉంది.

* నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక నూతన డైరెక్టర్ రాకేష్ శశి విషయానికి వస్తే..కుటుంబ నేపధ్య కథలు ఎన్ని వచ్చిన కథ బాగుంటే ప్రేక్షకులు బ్రహ్మ రధం పడతారని మనం ఇదివరకే చూసాం. ఇక ఈ చిత్ర విషయం లో కూడా అదే జరగబోతుందని అర్ధం అవుతుంది. ఫ‌స్టాఫ్ అంతా హీరో క్యారెక్ట‌రైజేష‌న్ చుట్టూనే సినిమాను న‌డిపించాడు. హీరో జులాయిగా తిర‌గ‌డం.. తండ్రి బాధ్య‌త‌ల‌ను తెలుసుకోక‌పోవ‌డం వంటి త‌ర‌హా క్యారెక్ట‌ర్ తో నడిపించాడు. దీంతో రొటీన్ కథలాగే అనిపిస్తుంది.

కానీ సెకండ్ హాఫ్ లో అసలైన కథను నడిపించాడు. హీరో బాధ్య‌త‌గా మెల‌గ‌డం.. తండ్రి కల‌ను తీర్చ‌డానికి కొడుకుగా త‌న వంతు కర్తవ్యాన్ని నేర‌వేర్చ‌డం వంటివి ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. మొదటి సినిమానే అయినా ఎక్కడ ఆ ఛాయలు కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. కాకపోతే కామెడీ విషయం లో ఇంకాస్త శ్రద్ద పెడితే బాగుండు.

చివరిగా :

అప్పటి చిరంజీవి విజేత సినిమాలో తండ్రి కోసం ఎలాంటి త్యాగం చేసి విజేత అయ్యాడో..ఇప్పటి కళ్యాణ్ దేవ్ తన తండ్రి బాధ్యతలు, కోరిక తెలుసుకొని వాటిని నెరవేర్చడం లో విజేత అయ్యాడు. ఒక తండ్రి కోసం కొడుకు పడే ఆరాటం కుటుంబ ప్రేక్షకులను బాగా నచ్చుతాయి.ఇక క్లైమాక్స్ లో భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు కంటతడి పెట్టించడం ఖాయం. మొత్తంగా చూస్తే ఇదో ఫ్యామిలీ డ్రామా! తండ్రీ కొడుకుల అనుబంధానికి అద్దం పట్టిన చిత్రంగా చెప్పొచ్చు.