రివ్యూ : విశ్వరూపం 2 – సహనానికి పరీక్ష

స్టార్ కాస్ట్ : కమల్‌హాసన్‌, రాహుల్‌ బోస్‌, పూజా కుమార్‌, ఆండ్రియా తదితరులు..
దర్శకత్వం : కమల్ హాసన్
నిర్మాతలు: రాజ్ క‌మ‌ల్ ఫిలిమ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్‌
మ్యూజిక్ : జిబ్రాన్
విడుదల తేది : ఆగస్టు 10, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

రివ్యూ : విశ్వరూపం 2 – సహనానికి పరీక్ష

యూనివర్సల్‌ హీరో కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మించిన ‘విశ్వరూపం’ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘విశ్వరూపం 2’. ఆస్కార్‌ ఫిలిం (ప్రై) లిమిటెడ్‌ వి.రవిచంద్రన్‌ సమర్పణలో రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మించిన ఈ భారీ చిత్రంపై ప్రేక్షకుల్లో చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి.

తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో, ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌లో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి వారి అంచనాలను అందుకోవడం లో కమల్ సక్సెస్ అయ్యాడా..లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

విశ్వరూపం సినిమా చూసిన వారికీ విశ్వరూపం 2 మొదలు అర్ధం అవుతుంది లేదంటే కాస్త కష్టమే. ఎందుకంటే విశ్వరూపం సినిమా చివర్లో విస్సు (కమల్ హాసన్) , ఒమ‌ర్ (రాహుల్‌ బోస్‌) గానీ, నేను గానీ.. ఒక్క‌రే మిగ‌లాలి అప్పుడే ఈ యుద్ధం పూర్తి అవుతుందని చెపుతాడు..దానిని కొనసాగింపుగా ఈ విశ్వరూపం 2 మొదలు అవుతుంది.

ఒమ‌ర్ తన గ్యాంగ్ తో లండన్ సిటీ ని నాశనం చేయాలనీ ప్లాన్ చేస్తాడు. ఈ ప్లాన్ తెలుసుకున్న విస్సు..తన భార్య నిర‌ప‌మ‌ ( పూజా కుమారి ) అసిస్టెంట్ ఆశ్రిత‌(ఆండ్రియా) తో కలిసి కొంతమంది అధికారులతో లండన్ కు వెళ్తాడు. అక్కడ స‌ముద్ర గ‌ర్భంలో ఒమర్ గ్యాంగ్ ఏర్పటు చేసిన భారీ పేలుడు బాంబుల‌ను డీ యాక్టివేట్ చేస్తాడు. దీంతో ఒమర్ , విస్సు అండ్ టీం ఫై పగ పెట్టుకొని , ఇండియా కు వచ్చిన నిర‌ప‌మ‌, ఆశ్రిత‌ల‌నో ఓమ‌ర్ కిడ్నాప్ చేస్తాడు..ఒమర్ నుండి నిర‌ప‌మ‌, ఆశ్రిత‌లను విస్సు ఎలా కాపాడాడు..? ఇండియాను ఒమర్ ఎలా నాశనం చేయాలనుకుంటాడు..? విస్సు ఎలా ఇండియా ను కాపాడతాడనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* కమల్ హాసన్ యాక్టింగ్

* పూజా , ఆండ్రియా గ్లామర్

* కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు

* సినిమా ఫొటోగ్రఫీ

మైనస్ :

* బోరింగ్ సన్నివేశాలు

* భారీ యాక్షన్ సన్నివేశాలు

* ఫస్ట్ హాఫ్

* స్లో నేరేషన్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* కమల్ హాసన్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో కూడా తనదయిన యాక్టింగ్ , రొమాన్స్ , డైలాగ్ డెలివరీ ఇవ్వన్నీ కూడా అభిమానులను ఆకట్టుకున్నాయి. క‌మ‌ల్ హాస‌న్ స్వంతంగా డ‌బ్బింగ్ హైలైట్ గా ఉంది.

* విలన్ గా నటించిన రాహుల్‌ బోస్‌ అదరగొట్టాడు..

* పూజా కుమార్‌, ఆండ్రియా గ్లామర్ గా కనిపించి ఆకట్టుకున్నారు. అలాగే వారి నటన కూడా బాగుంది.

* శేఖర్‌ కపూర్‌, వహీదా రెహమాన్‌ మొదలగు వారు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక విభాగం :

* శామ్‌దత్‌ సినిమా ఫొటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది. స‌ముద్రంలోప‌ల వ‌చ్చే సీన్స్ తోపాటు ఫైట్స్ లలో తన కెమెరాపనితాన్ని చూపించారు.

* మహమ్మద్‌ గిబ్రాన్‌ మ్యూజిక్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే నేపధ్య సంగీతం కూడా నామమాత్రంగానే ఉంది.

* మహేష్‌ నారాయణన్‌, విజయ్‌ శంకర్‌ ఎడిటింగ్ చాల చిరాకు తెప్పిస్తుంది. చాల సన్నివేశాలు సోలో నేరేషన్ తో కూడగా వాటికీ ఇంకాస్త పదును పెడితే బాగుండు. ఎలాంటి కామెడీ లేకుండా కేవలం యాక్షన్ తో రెండు గంటలు థియేటర్స్ లలో కూర్చోవాలంటే చాల కష్టం.

* శశాంక్‌ వెన్నెలకంటి మాటలు మామూలుగానే ఉన్నాయి.

* ఇక కమల్ డైరెక్షన్ & స్క్రీన్ ప్లే విషయానికి వస్తే..మొదటి పార్ట్ తో పోలిస్తే రెండో పార్ట్ చాల దారుణంగా ఉందనే చెప్పాలి. సాధారణ కథ అయినప్పటికీ కథనంలో చాలావరకు తడబడ్డాడు కమల్ . స్క్రీన్ ప్లే అనుకున్న స్థాయిలో రాసుకోలేక పోయాడు. దానికి తోడు స్లో నెరేషన్ తో సన్నివేశాలు రావడం థియేటర్స్ లలో ప్రేక్షకులను అసహనానికి గురి చేసాయి.

మొదటి 30 నిమిషాల వరకు ఫస్టాఫ్ లో ఏం జరుగుతుందో ప్రేక్షకులకు అర్ధం కాలేదు. సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేశాయి. నటుడిగా ఆకట్టుకున్న కమల్, దర్శకుడిగా మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. సినిమా ఉన్నంత లో భార్య భ‌ర్త‌ల మ‌ధ్య ఎమోష‌న్స్‌, త‌ల్లికొడుకుల మ‌ధ్య ఎమోష‌న్స్‌.. ఆండ్రియా, పూజా కుమార్ గ్లామ‌ర్ కాస్త ప్రేక్షకులకు ఉపశమనం కలిగించాయి.