రివ్యూ : వినయ విధేయ రామ – మాస్ ప్రేక్షకుల కోసం

స్టార్ కాస్ట్ : రామ్ చరణ్ , కియారా అద్వానీ తదితరులు..
దర్శకత్వం : బోయపాటి శ్రీను
నిర్మాతలు: దానయ్య
మ్యూజిక్ : దేవి శ్రీ
విడుదల తేది : జనవరి 11, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : వినయ విధేయ రామ – మాస్ ప్రేక్షకుల కోసం

సంక్రాంతికి పెద్ద హీరోల సందడి ఉందంటే ఆ మజానే వేరు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి సినిమాలు థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు, పేట చిత్రాలు సందడి షురూకాగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రం భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గత ఏడాది ‘రంగస్థలం’ సినిమాతో తెలుగు హిస్టరీ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన రామ్ చరణ్..ఇప్పుడు మాస్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి మొదటిసారి బోయపాటి – చరణ్ లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది..? చరణ్ ను ఎలా చూపించాడు..? అసలు కథ ఏంటి..? ఆ కథ కు నటి అంట్లు న్యాయం చేసారా లేదా..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

ఓ అందమైన ఫ్యామిలీ..ఐదుగురు అన్నదమ్ములతో చాల సరదాగా ఉంటుంది..అందరి కన్నా చిన్నవాడు రామ్ కొణెదల (రామ్ చరణ్). చిన్నవాడు కావడంతో అందరికి చాల ఇష్టం..పెద్దన్న భువన్ కుమార్ (ప్రశాంత్) ఎన్నికల అధికారిగా పనిచేస్తుంటాడు. ఆయన పనిచేసే ప్రాంతంలో జరిగే ఉప ఎన్నికల్లో పరశురాం (ముఖేష్ రుషి) చేసే అన్యాయాలకు అడ్డు పడతాడు. దీంతో పగ పెంచుకున్న పరశురాం భువన్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది..? రామ్ కొణెదల తన ఫ్యామిలీని ఎలా కాపాడుకోగలిగాడు.. ? మున్నాభాయ్‌ (వివేక్ ఒబెరాయ్‌), రామ్ కొణెదల ఫ్యామిలీకి సంబంధం ఏంటి..? అసలు మున్నాభాయ్‌ ఎవరు..? ఈయనకు, కథ కు లింక్ ఏంటి అనేది మీరు తెరపై చూడాల్సింది.

ప్లస్ :

* యాక్షన్ పార్ట్

* రామ్ చరణ్ యాక్టింగ్

* మాస్ మెచ్చే సన్నివేశాలు

మైనస్ :

* రొటీన్ కథ

* సెకండ్ హాఫ్ ఫైట్స్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* రంగస్థలంతో తనలోని అసలు సిసలైన నటనను కనపరిచిన రామ్ చరణ్..ఈ మూవీలో అసలైన యాక్షన్ హీరోగా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. డాన్స్, సిక్స్ ప్యాక్, యాక్షన్, కామెడీ, లవ్ ఇలా అన్నింట్లో చించేసాడు.

* సీత పాత్రలో నటించిన కియారా అద్వానీ..ఆమె పాత్ర పెద్దగా లేనప్పటికీ ఉన్నంతలో చాల బాగా చేసింది. గ్లామర్ పరంగానే కాక డాన్సులలో కూడా చరణ్ కు పోటీ పడి చేసి అభిమానులను ఆకట్టుకుంది.

* భువన్ కుమార్ గా ప్రశాంత్ యాక్టింగ్ బాగుంది..ఫ్యామిలీకి పెద్దగా అన్నీచూసుకొనే పెద్దన్నగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ కు మరిన్ని ఛాన్సులు రావడం ఖాయం.

* గాయత్రీ దేవిగా స్నేహ రోల్ బాగుంది..మరోసారి ఈ రోల్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరయింది.

* మిగతా అన్నదమ్ములుగా నటించిన ఆర్య‌న్‌ రాజేష్‌, మ‌ధునంద‌న్‌, ర‌వివ‌ర్మ‌ తమ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

* రాజా భాయ్ మున్నా రోల్ లో నటించిన బాలీవుడ్ నటుడు వివేక్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. రామ్ చరణ్ – వివేక్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. ఈ యాక్షన్ పార్ట్ మాస్ జనాలకు బాగా నచ్చుతుంది.

* ప్రత్యేక సాంగ్ లో ఇషా గుప్తా తన గ్లామర్ తో ఆకట్టుకుంది..ఈమె డాన్స్ సైతం అదిరిపోయాయి.

* ఇతర పాత్రల్లో నటించిన నటి నటులంతా తమ పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక విభాగం :

* రంగస్థలం చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్రసాద్…ఈ చిత్రానికి ఆ రేంజ్ మ్యూజిక్ ఇవ్వలేకపోయాడు..రెండు సాంగ్స్ తప్ప మిగతావి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సైతం యాక్షన్ కు తగినట్లు ఉంది తప్ప గొప్పగా అనిపించలేకపోయింది.

* రిషి పంజాబీ, ఆర్థర్ సినిమా ఫొటోగ్రఫీ సినిమాకు హైలైట్ గా నిలిచాయి..అందమైన లొకేషన్లతో పాటు యాక్షన్ పార్ట్ లలో కూడా తమ కెమెరా పనితనం ఆకట్టుకుంది.

* ఎడిటింగ్ విషయంలోనూ కోటగిరి వెంకటేశ్వర రావు,తమ్మిరాజు చాల జాగ్రత్తలే తీసుకున్నారు. ఎక్కడ కూడా బోర్ అనిపించకుండా సినిమాను స్పీడ్ గా లాగించేసారు.

* దానయ్య నిర్మాణ విలువలు సైతం బాగున్నాయి. సినిమా అంత చాల రిచ్ గా, కాస్టింగ్ కూడా భారీ ఎత్తున తీసుకుని తన నిర్మాణ విలువలను చాటుకున్నాడు.

* ఇక డైరెక్టర్ బోయపాటి విషయానికి వస్తే..బోయపాటి సినిమా అంటేనే మాస్ ఆడియన్స్ కు పండగా..ఆయన యాక్షన్ కు చరణ్ లాంటి మాస్ హీరో తోడైతే ఇంకేముంది థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే. ఆయన ప్రతి సినిమాలో యాక్షన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది..ఈ సినిమాలో ఆది ఇంకాస్త ఎక్కువయ్యింది. ఫస్ట్ హాఫ్ అంత చక్కగా ఫ్యామిలీ సన్నివేశాలతో పాటు లవ్ సన్నివేశాలు జోడించి సరదా సరదాగా సాధించాడు.

ఇక సెకండ్ హాఫ్ పూర్తిగా యాక్షన్లకే ప్రాధాన్యం ఇచ్చాడు..దీంతో ఏ సెంటర్స్ ఆడియన్స్ కు కాస్త ఇబ్బంది అనిపించినా, బి&సి సెంటర్ ప్రేక్షకులు మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. కథలో కొత్తదనం లేకపోయినప్పటికీ, చరణ్ కు మాత్రం ఇలాంటి కథ కొత్తదే కాబట్టి మెగా అభిమానులు ఫుల్ గా ఎంజాయ్ చేయవచ్చు.

చివరగా :

గత ఏడాది రంగస్థలంతో ఆకట్టుకున్న చరణ్, ఈ సంక్రాంతి బరిలో వినయ విధేయ రామగా వచ్చి సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. రామ్ కొ.. ణె.. ద.. ల అంటూ సిక్స్ ప్యాక్‌ ఉగ్రరూపం చూపించాడు. డాన్స్, ఫైట్స్, యాక్షన్ ఇలా అన్నింట్లో చరణ్ చించేసాడు. ఇక బోయపాటి సైతం తనదైన యాక్షన్ చూపించి ఆకట్టుకున్నాడు. కియారా మరోసారి తన గ్లామర్ తో ఆకట్టుకుంది. డాన్సులతో చరణ్ తో పోటీ పడి చేసి ఆకట్టుకుంది. స్నేహ, ఆర్యన్ రాజేష్, వివేక్ మొదలగు స్టార్స్ అంత అదరగొట్టారని చెపుతున్నారు. ఓవరాల్ గా సంక్రాంతి బరిలో అసలైన యాక్షన్ చూపించాడు.

నోట్ :

సినిమాను థియేటర్స్ లలో చూడండి..పైరసీ చేసి సినిమా ఇండస్ట్రీని నాశనం చేయకండి. ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుంది కేవలం మన ఆనందం కోసమే..అలాంటి ఆనందాన్ని పైరసీ లో చూడకండి.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review