రెండో టెస్ట్ : తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 308/4

తొలి టెస్టులో వెస్టిండీస్ ని చిత్తు చిత్తుగా ఓడించిన టీమిండియా.. రెండో టెస్టులోనూ పట్టు బిగిస్తోంది. విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకే ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 308/4 తో ఆటని కొనసాగిస్తోంది. పృథ్వీ షా(70; 53 బంతుల్లో, 11×4, 1×6), కోహ్లీ(45; 78బంతుల్లో,4×5), పుజారా(10;50 బంతుల్లో, 2×4) పరుగులు చేశారు.

కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిందనుకున్న టీమిండియాను మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్స్‌ ఆదుకున్నారు. అజింక్య రహానే, రిషబ్‌ పంత్‌ ఇద్దరూ క్రీజులో కుదురుకుని అర్ధ సెంచరీలు చేయడం కలిసొచ్చింది. ప్రస్తుతం రహానే 75, రిషబ్‌దే. పంత్‌ 85 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ సేన భారీ ఆధిక్యంలో నిలిచేలా కనబడుతోంది. ఈ సిరీస్ లో యువ ఆటగాళ్లు పృధ్వీ షా, రిషబ్ పంత్ రాణిస్తుండటం భారత్ కు సానుకూలాంశంగా చెప్పవచ్చు.